Monday, June 3, 2024

మానవత్వపు ఉన్నతమైన పాఠం*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*మానవత్వపు ఉన్నతమైన పాఠం*
             ➖➖➖✍️

*నేను మా ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌లో వేచి ఉన్నాను. బస్సు ఇంకా  రాలేదు..*

 *నేను అక్కడ కూర్చుని పుస్తకం చదువుతున్నాను.* 

 *నన్ను చూసి, దాదాపు 10 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి నా దగ్గరకు వచ్చి, "సార్, ఈ పెన్నులు కొనుక్కోండి, నేను మీకు నాలుగు పెన్నులు రూ.10కి ఇస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఏదైనా తినడానికి ఉంటుంది."* 

 *ఆమెతో పాటు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు, బహుశా ఆమె తమ్ముడనుకుంటాను.* 

 *నేను, "కానీ, నాకు పెన్ను అవసరం లేదమ్మా", అన్నాను.* 

 *ఆమె తర్వాత చాలా ముద్దుగా ఇలా ​​అడిగింది,   "అప్పుడు మేము ఏం తింటాం?"* 

 *"నాకు పెన్ను వద్దు, కానీ నువ్వు తప్పకుండా ఏదోకటి తింటావు" అన్నాను.* 

  *నా బ్యాగ్‌ లో రెండు బిస్కెట్ల ప్యాకెట్లు ఉన్నాయి. నేను ఆ రెండు ప్యాకెట్లను తీసి, ఇద్దరికీ చెరొకటి ఇచ్చాను.* 

*కానీ ఆమె ఒక ప్యాకెట్ తిరిగి ఇచ్చేసి, "అయ్యగారు! ఒక్కటి చాలు, ఇద్దరం పంచుకుంటాం" అని చెప్పడంతో నేను చాలా ఆశ్చర్యపోయాను.* 

 *నేను మళ్ళీ "ఫర్వాలేదు, ఈ రెండూ ఉంచుకో!" అన్నాను.* 

 *దానికి ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న నన్ను, నా హృదయాన్ని, నా ఆత్మను కూడా కదిలించింది.* 

*”అప్పుడు మీరు ఏమి తింటారు?" అని అడిగింది.* 

 *కోట్లాది కోట్లు సంపాదిస్తున్న మనుషులు మానవత్వాన్ని పక్కనపెట్టి విజయం పేరుతో ప్రజలను విపరీతంగా దోచుకుంటున్న ఈ ప్రపంచంలో, ఆకలితో ఉన్న ఓ చిన్నారి అమ్మాయి నాకు మానవత్వపు ఉన్నతమైన పాఠాన్ని నేర్పింది.* 

 *ఆత్మతో సంతృప్తి చెందేవాళ్ళు ఇలాగే ఉంటారేమో అని నాలో నేనే అనుకున్నాను...* 

 *దురాశతో వాళ్ళ వంతు కూడా తినేసేంతగా ఎదుటివారి వద్ద నుండి తీసుకోకండి ..!!* 

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment