🌹 శ్రీ రమణీయం - 7 A🌹
👌మోక్షమైనా.. బంధమైనా... మనసే కారణం (1)👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ,
అద్వైత నిధయే నమః*
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
🌈 7. మోక్షమైనా బంధమైనా మనసే కారణం 🌹
✳️ *మన పుట్టుక అంటే అహంకరణ పుట్టుకే!* అంటే... *'నేను ఉన్నాను'* అని తెలియడం. అది ఎవరూ నేర్పేదికాదు. తెచ్చుకునేదికాదు. అది జీవ లక్షణం. కాబట్టే, చంటి పిల్లలైనా చిటిక వేసినవైపు తిరిగి చూస్తారు. నొప్పిపుడితే ఏడుస్తారు. దీనికి కారణం 'స్పృహ' కలిగి ఉండటమే. అదే ఎంత పెద్దవాడైనా నిద్రపోతుండగా ఇవన్నీ చేయలేడు. దీనికి కారణం దేహస్పృహ లేకపోవడమే. ఈ స్పృహే, జీవుడు. ఎందుకంటే జీవుని ఉనికి ఈ స్పృహతోనే ఉంది. ఆ స్పృహే శుద్ధంగా ఉంటే అదే ఈశ్వరుడు. అంటే మనలో కేవల స్పృహగా ఉన్న ఈశ్వరుడు మనసుగా వ్యక్తం అవుతాడు.
✳️ మనలోఉన్న స్పృహకి రెండు లక్షణాలు ఉన్నాయి. అవి *1. కేవల స్పృహ 2. ఆ స్పృహ కలిగి ఉన్నానని తెలియడం.* మొదటిది మనలో ఈశ్వరుడి కిరణం అయితే రెండవది దాని ఫలితంగా పుట్టిన మనసు. కేవల స్పృహే దేహంతో కలిసి అహంకరణగా ఒక ప్రత్యేక గుర్తింపుని ఆపాదించుకుంది. మనం నిద్రలో ఈ కేవలస్పృహగానే ఉంటాం కాని అది అచేతన స్థితిలో ఉంటుంది. మెలకువలో ఈ స్పృహ చైతన్యమై అహంకరణ వ్యక్తం అవుతుంది. ఈ చైతన్యమే మనకు కలిగే సుఖదుఃఖాది అనుభవాలకు కారణం. మనం 'జీవితం' అనుకుంటున్నది ఈ అహంకరణ తాలూకు అనుభవాలనే. నిద్రా స్థితిని జీవితం అని భావించలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ అహంకరణ అనుభవాలు లేవు (గనుక) కేవలస్పృహ దేవుడైతే అది చైతన్యంగా మారితే జీవుడు. ఆ చైతన్యం శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడాన్ని మరణంగా పిలుస్తాం.. స్పృహ తానుగా ఉన్నా, దేహం అన్న భావనతో ఉన్నా, రెండిటిలోనూ ఉన్నది ఒక్కటే. ఈ రెండిటికి భేదం కల్పించింది ఈ దేహమే. బావిలోమునిగిన బొక్కెన బావినీళ్ళను, బొక్కెనలో నీళ్ళను వేరుచేసినట్లే...ఈ దేహం అనంత స్పృహను పరిమిత స్పృహగా మారుస్తుంది. స్పృహనే ప్రజ్ఞ, ఎరుక, తెలివి, చైతన్యం అని పిలుస్తారు. అదే మన అసలు స్వరూపం కాని అది దేహం ద్వారా వ్యక్తమై ఈ దేహమే నేనన్న భావం కలిగిస్తుంది. అద్దంలో ప్రతిబింబం చూసేటప్పుడు కూడా అందులో ఉన్నది మనమే అని భ్రమిస్తూనే దువ్వుకుంటాం. అలాగే స్పృహ ప్రతిబింబించే ఈ దేహన్ని నేను అని అనుకుంటున్నాం.
✳️ ఈ శరీర గతమైన విధిని అనుభవిస్తూ మనసును మాత్రం మనలోనే ఉన్న దైవంపై లక్ష్యం చేయడం మన సాధన కావాలి. అంటే కార్యకారణాల్లో తన కదలికలకు గల కారణాన్ని ‘వేదకటం' అనే ఆత్మాన్వేషణకు పూనుకోవాలి. పువ్వు నుండి వాసన వేరు చేయలేనట్లే ఈ దేహానికి ప్రారబ్దాన్ని వేరు చేయలేం. కాని మనసుకు దాని వికారాలు అంటకుండా సాధన చేయవచ్చు.
✳️ శ్రీ రమణ భగవాన్‌ని వివాహం ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తే తన దేహప్రారబ్ధంలో లేదని సమాధానం ఇచ్చారు. జ్ఞానులకైనా దేహం నుండి విడదీయలేనిది కనుకనే అది 'విధి' అయ్యింది. మనసుని మన వివేకాన్ని బట్టి దైవంపైనో, వ్యామోహంతో దేహంపైనో నిమగ్నం చేయవచ్చు. దైవంపై నిమగ్నం అయిన మనసు మోక్షాన్ని, దేహంపై నిమగ్నమైన మనసు బంధాన్ని మిగుల్చుతుంది. దైవం మనలో ఉండి చేసే అనేక పనులను గుర్తిస్తే మనకి ఆయనపై కృతజ్ఞత కలుగుతుంది.
...ఇంకా ఉంది....
....మోక్షమైనా బంధమైనా మనసే కారణం .... సశేషం
🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment