*🍁మనం జీవితంలో విజయవంతం కావాలంటే ఏది తోడ్పడుతుంది? మన అదృష్టమా? మన తలరాతా? భగవంతుడా? లేక మన కృషి ..?🍁*
✍️ మురళీ మోహన్
*సద్గురు*: అదృష్టం, తలరాత, భగవంతుడు, కృషి. బహుశా ఇవన్నీనేమో. సరే అదృష్టం విషయానికి వస్తే, అది మీ చేతుల్లో లేని విషయం. మీరు భగవంతుడు అన్నా, అదీ మీ నియంత్రణలో లేని విషయం. మీ తలరాత కూడా మీ నియంత్రణలో లేని విషయమే. మీరు చేయగలిగింది ఏముంది..? మీకు ఏది కావాలో దానికోసం కృషి చేయడం. బహుశా మీరు పూర్తిగా నూటికి నూరు శాతం మనస్సు పెట్టి కృషి చేస్తే అది జరుగుతుందేమో.
ఎదో ఉరికే కృషి చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది, ఉరికే కష్టపడడం అనేది మిమ్మల్ని గమ్యానికి చేర్చదు. మీరు సరైన పనిని సరైన సమయంలో సరైన చోట చేయడం అనేది చాలా ముఖ్యం కదా?ఇవన్నీ జరగడానికి మీకు తెలివితేటలు కావాలి. మీరు జీవితంలో చేయాల్సిందల్లా ఇంతే – మీ తెలివితేటలని, దృక్పదాన్ని పెంచుకోవడం. ఇది కనక మీరు చేస్తూ ఉంటె మీ జీవితం దానంతట అదే మెరుగవుతు ఉంటుంది.
మీ అవగాహనా శక్తి ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ సామర్ధ్యం దానంతట అదే పెరుగుతుంది
మనుషులు చేస్తున్న పొరపాటు ఏమిటంటే, వారి సామర్ధ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. కాని మీరు చేయవలసింది సామర్ధ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం కాదు, మీ అవగాహనా శక్తి ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ సామర్ధ్యం దానంతట అదే పెరుగుతుంది. చూడండి, ప్రతి ఒక్కరూ డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఈ రోజుల్లో కాదేమో కాని పాతిక సంవత్సరాల క్రితం అంతే. మీకు మెడిసిన్లో సీట్ రాలేదనుకోండి, ఎం చేయాలి? అప్పుడు ఇంజినీర్ అవ్వాలి అనుకుంటారు. సరే, మీరు డాక్టర్ అయ్యారు అనుకుందాం, అందరూ యోగా చేసి జబ్బులు ఏమి తెచ్చుకోలేదు అనుకుందాం. చాలా కొద్దిమంది నిజంగానే ఒక డాక్టర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ అవుతున్నారు, మిగతావారందరూ ఎందుకు డాక్టర్లు అవుతున్నారంటే ఇది ఒక మంచి వ్యాపారం అనుకుంటున్నారు. అవునా? ఎవరో అనారోగ్యం మీకు మంచి వ్యాపారం, అవునా? సరే నేను ఇందులోకి లోతుగా వెళ్ళను, ఎందుకంటే ఇది నన్ను బాధిస్తుంది. నిజంగా కొద్ది మంది మాత్రమే మానవాళికి సేవ చేయాలి అనుకుని డాక్టర్ అవుతున్నారు , అది చాలా గొప్ప విషయం.
మీరు మీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారా లేదా, మీరు చేయగలిగిందంతా మీరు చేస్తున్నారా లేదా అన్నదే అసలు విషయం
ఒక రోజు అందరూ ఆరోగ్యంగా అయ్యారు అనుకుందాం, ఆరోగ్యంగా అయిపోవడం అన్నది చాలా మంది డాక్టర్లకి ఇష్టంలేదు అవునా? మీరు డాక్టర్ అవ్వచ్చు, రాజకీయనాయకుడు అవ్వచ్చు లేదా యోగి అవ్వచ్చు, మీరు ఎం అయ్యారు అనేది కాదు ఇక్కడ విషయం. మీరు మీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారా లేదా, మీరు చేయగలిగిందంతా మీరు చేస్తున్నారా లేదా అన్నదే అసలు విషయం. మీరు “నా తెలివి తేటల్ని ఎలా పెంచుకోగలను” అని ఆలోచించకండి. జీవితం ఎలా ఉందో అలా చూడగలిగితే, ఇక్కడ బతకడానికి కావలసిన తెలివితేటలు అవే వస్తాయి. మీరు జీవితాన్ని అది ఉన్న విధంగా చూడలేక పోతున్నారనుకోండి, అప్పుడు మీ తెలివితేటలే మీకు విరుద్ధంగా పని చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో చాలా మంది తెలివిగల వాళ్ళు వారికి వారే కీడు చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది కదా? ఎందుకంటే వారికి తెలివితేటలు ఉన్నాయి కాని జీవితం పట్ల అవగాహన లేదు.
మీకు సామాజిక విజయం మాత్రమే కాకుండా నిజమైన విజయం కావాలంటే, మీరు జీవితాన్ని ఎలా ఉందో అలా చూడగలగాలి. మీరు విషయాలని ఎలా ఉన్నాయో అలా చూడగలిగినప్పుడు, జీవితం మీకు ఒక ఆట అయిపోతుంది. ఈ ఆటని బాగా ఆడగలిగారు అనుకోండి, అప్పుడు మీరు విజయం సాధించారు అని జనం అంటారు. మీరెప్పుడు “నేను విజయం సాధించాలి” అని అనుకోకూడదు, నేను ఈ జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా చేసుకోవాలి అని ఆలోచించాలి. మీరు ఇలా చేస్తూ ఉంటే, జనం ఏదో ఒక రోజున మీరు విజయం సాధించారు అని అంటారు, కాని మీ అంతట మీరు “నేను విజయం సాధించాలి” అని ఆలోచిస్తూ కూర్చో కూడదు. ఇలా ఆలోచిస్తూ మాత్రమే ఉంటే జరిగేదల్లా కేవలం మీరు బాధపడి మీ చుట్టూ ఉన్నవారిని బాధపెట్టడం అంతే. ఎందుకంటే మీరు విజయం అని దేనిని అనుకుంటున్నారు? అందరూ మీ కంటే కింద ఉండాలి, మీరు ఎవరి నెత్తినో ఎక్కి పిండి కొట్టాలి అని అంతే కదా?
మీరు ఎప్పుడు విజయం గురించి ఆలోచించకండి. మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన జీవితంగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచించండి. ఒక రోజున అది అనుభూతిలోకి వచ్చినప్పుడు మీరు విజయవంతులు అవుతారు, మీ చుట్టూ ఉన్న మనుషులు దాన్ని గ్రహించగలుగుతారు. కాని మీ అంతట మీరు ఎప్పుడు నేను ఎలా విజయం సాధించాలి అని ఆలోచించడం జీవితం పట్ల సరైనది కాదు.
No comments:
Post a Comment