Friday, June 28, 2024

 **హాస్య ప్రధానమైన చాటు సంభాషణలు.!*
*“ఆవంఛావారి పావంఛా మీద గావంఛా ఆరవేశాను.*
*అది ఎండిందంఛావా? లేదంఛావా?”*
*అవంచా అనేది ఇంటి పేరు, పావంచా అంటే అరుగు. గావంచా అంటే చిన్ని టవలు.*
*ఇంకో చమత్కారయుతమైన చాటు వాక్యంచూద్దాం.*
*ఒక ధనవంతుడి ఇంట్లో పెళ్ళికి కొంతమంది కవులు,పండితులు వెళతారు. వివాహానంతరం వారికి సంభావనలు (డబ్బులు) ఇచ్చేటప్పుడు ఆ యజమాని కవులకి కొంచెం ఎక్కువ, పండితులకి తక్కువగా సంభావనలు ఇస్తాడు. వారిలో ఒక కవికి తక్కువ సంభావన వస్తుంది.*
*ఆ కవికి కోపంవచ్చి యజమానితో ఇలా అంటాడు. (ఇవి పద్యపాదాలు)*
*“కవిగనుము కనులు లేవా!”*
*నేను కవిని నీకు కనిపించటం లేదా? అని.*
*యజమానికూడా పద్యపాదంలోనే కోపంగా సమాధానం చెపుతాడు.*
*“కవివైతే ‘చంకనాకు’ గంటంబేది?” అని.*
*(పూర్వం వ్రాసుకోడానికి తాటాకులు ఉపయోగించేవారుకవులు. అట్టి తాటాకుల కట్ట చంకలో పెట్టుకొనేవారు. మొలకి వ్రాసుకొనే గంటం వ్రేలాడేది.)*
*నువ్వు కవివైతే నీ చంకన్+ఆకు= చంకలో ఆకు, మొలలో గంటం ఏది? అవి లేవు కనుక పండితుడనుకొని సంభావన తక్కువగా ఇచ్చేను. అని సమాధానం.*
*ఇందులో ఇంకో చమత్కారం,* *"చంకనాకు” అనేది ఓతిట్టు*
*కూడా!*
*(కోపంతో నా చంకనాకు అని అంటారు)*
**ఇట్టి హాస్య ప్రధానమైన చాటు సంభాషణలు సాహిత్యంలో కోకొల్లలు.**
                        ***

No comments:

Post a Comment