*🍁 కర్మ ఫలము 🍁*
✍️ మురళీ మోహన్
_*🌴తప్పులు చేస్తూన్నప్పటికీ ఏ కర్మ కూడా మనలను భాదించలేదంటే దానికి కారణం భగవంతుడు మనలను గమనించుటలేదని భావించకూడదు. కర్మ ఫక్వానికి రాలేదని గ్రహించాలి. అది ఫక్వానికి రాకమునుపే తప్పు తెలుసుకుని పరిష్కార మార్గాన్ని వెతుక్కొేవాలి. ఒకే తప్పును పలుమార్లు చేయడం నేరం. తప్పులు చేస్తూ త్రొేవలు వెతుక్కొేవడం వలన ఒరిగేదీ ఏమీ లేదు.*
*భగవంతుడు సదా మనలను గమనిస్తూనే ఉంటాడు. మన బుద్దియే మన కర్మలకు సాక్షిగా నిలచి ఉంటుంది. ఎవరి కళ్ళు గప్పినా సరే భగవంతుని కళ్ళుగప్పలేము. చేసిన తప్పులు భగవంతుని ముందు ఒప్పుకుని మరల చేయకుండా ఉండుట వలన కొంతవరకూ వాటి ప్రభావాన్ని ఆపుకొేవచ్చు. నిరంతర భగవచ్చింతన ద్వారా కూడా కర్మఫల ప్రభావం తగ్గిపొతుంది.*
*ఇంకా చెప్పాలంటే సర్వేశ్వరుని పాదాలను నమ్మి బ్రతుకు చున్నవాడు దొేషాలను చేయలేడు. చేయనివ్వడు. 🌴*_
No comments:
Post a Comment