Sunday, June 30, 2024

****మానవ జన్మకి సాత్విక మైన గుణములు ఎలా ఆవిర్భవిస్తాయి ??

              *_నేటి మాట_*

*మానవ జన్మకి సాత్విక మైన గుణములు ఎలా ఆవిర్భవిస్తాయి ??*

"ఆహారమే మనస్సు  - జలమే ప్రాణము"
మనము మంట చేసుకుంటాము, ఎట్టి మంటనో అట్టి పొగ తయారౌతుంది, 
ఎట్టి పొగనో అట్టి మేఘములు చేరుకుంటాయి,
ఎట్టి మేఘమో అట్టి వర్షము కురుస్తుంది,
ఎట్టి వర్షమో అట్టి పంట పండుతుంది, ఎట్టి పంటను అట్టి బుద్ధి...
ఐతే-  ఇక్కడ మంట అంటే ఏమిటి? మనకర్మలే! 
దేహము చేసే ప్రతీ పనీ కర్మనే!!

మానవుని శరీర మంతయు కర్మ మయమే! 
కనుక, కర్మ మయిన ఈ శరీరమునకు ధర్మ మయిన ఆహారమును వేయాలి. 

అనగా ఆహారము పవిత్ర మైనదిగా ఉండాలి. 
సాత్విక మైనది గా ఉండాలి, భగవదర్పిత మైనది గా ఉండాలి. 
అప్పుడే మానవుని యందు సాత్విక మైన గుణములు ఆవిర్భవిస్తాయి...

               *_🥀శుభమస్తు.🥀_*
 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

No comments:

Post a Comment