జగన్నాథుని విగ్రహ నీడ అద్దంలో కనిపించకుండా పోవడానికి గల అసలు కారణమేంటో తెలుసా..?
హిందూ ధర్మంలో చార్ ధామ్ యాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ యాత్రను పూర్తి చేసిన వారు భగవంతుని సన్నిధిని చేరుకుంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఈ నాలుగు ధామ్‌లలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ ధామ్‌లో ఉన్న జగన్నాధుని విగ్రహం( Lord Jagannath Idol ) ఎల్లప్పుడూ చర్చనీయంగా మారి ఉంటుంది.ఈ పూరీ ధామ్‌లో( Puri Dham ) ఉన్న జగన్నాధుని విగ్రహం కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
అంతే కాకుండా ఈ దేవాలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథలు, రహస్యాలు ఉన్నాయి.
జగన్నాథుని విగ్రహం కూడిన ఒక సంఘటన ప్రజలను ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.నిజానికి జగన్నాథ విగ్రహం నీడ ఒకసారిగా కనిపించకుండా పోయింది.
ఈ సంఘటనను చూసిన పండితులు భక్తులంతా ఆశ్చర్యపోయారు
1890వ సంవత్సరంలో జన్మాష్టమి రోజున పూర్ణ రాజు దేవునికి ప్రసాదం సమర్పిస్తున్నాడు.ఆ సమయంలో జగన్నాధుడి నీడ( Puri Jagannath Shadow ) అద్దంలో కనిపించకపోవడంతో రాజు ఆశ్చర్యపోయాడు.జగన్నాథుడు భోజనం చేయడం లేదని ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారు.
అప్పుడు నగర ప్రజలందరూ జగన్నాధునికి రోజంతా వివిధ రకాల ఆహారాలను సిద్ధం చేశారు.అయినప్పటికీ జగన్నాథుడి నీడ కనిపించలేదు.
ఈ సంఘటనను చూసిన రాజు జగన్నాథుడి విగ్రహం నీడ కనిపించకుండా పోవడానికి వెనుక ఉన్న కారణం తెలిసే వరకు తను భోజనం చేయనని ప్రతిజ్ఞ చేశాడు.
అంతేకాకుండా రాజు ఆ దేవాలయంలో( Puri Jagannath Temple ) కూర్చొని దేవుడి నీడ కోసం ఎదురుచూస్తున్నాడు.అలా రాజు ఎదురుచూస్తూ చూస్తూ కునుకు తీశాడు.అప్పుడు ఆ రాజుకు కలలో జగన్నాథుడు కనిపించి తను దేవాలయంలో లేనని భోజనం చేయడానికి ఒక పేద భక్తుడి గుడిసెకు వెళ్లాలని, అందుకే దేవాలయంలోని తన విగ్రహం నీడ కనిపించలేదని చెప్పాడు.
ఈ ఘటన తర్వాత జగన్నాధునికి మళ్ళీ నైవేద్యాలు సమర్పించినప్పుడు అద్దంలో జగన్నాథుడి నీడ స్పష్టంగా కనిపించింది.నేటికీ జగన్నాధునికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో పండితులు తమ అరచేతుల్లో నీళ్లు పెట్టుకుంటారని చెబుతున్నారు.
ఆ సమయంలో పండితుల అరచేతిలో ఉన్న నీటిలో జగన్నాధుని విగ్రహం నీడ స్పష్టంగా కనిపిస్తుంది.ఇలా నీడ కనిపించినప్పుడే జగన్నాథుడు నైవేద్యాన్ని స్వీకరించినట్లు భక్తులు భావిస్తారు
sekarana from net.
No comments:
Post a Comment