*కొన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారి జోకులు.*
*రచన : ముళ్ళపూడి వెంకటరమణ*
*వకీళ్ళు*
“డాక్టర్, మంచినీళ్ళకు వెళ్ళి వస్తూండగా మంచం కోడు తగిలి కాలు బెణికింది, ఏం చెయ్యమంటారు?" అడిగారెవరో ఫోనులో.
"కుంటండి" అన్నాడు డాక్టరు మండిపడి.
"అలాగేనండి. అర్ధరాత్రిగదా, ప్రస్తుతానికి నిద్రపోతాను. రేప్పొ ద్దున్న మీ సలహా పాటిస్తా వీలైతే" అన్నాడు ఇవతలి మనిషి తొణుకూ బెణుకూ లేకుండా.
మర్నాడు డాక్టరుగారు ఒక పెళ్ళికి వెళ్ళారు. అక్కడ లాయరు మిత్రుడు కనిపించాడు. మాటల సందర్భంలో ఈ వైనాలన్నీ చెప్పి, " ఇలాటి వాడికి బిల్లు పంపాననుకోండి ఫోను చేసినందుకు. దావా వేస్తే డబ్బొస్తుందంటారా ?"
"నిక్షేపంలా బిల్లు పంపండి, వృత్తిరీత్యా మీరు చెప్పే ప్రతి మాటకీ డబ్బు పుచ్చుకోవలసిందే." అన్నాడు లాయరు.
మర్నాడు ఉదయం డాక్టరుగారికి ఒక బిల్లు అందింది నిన్నటి సలహాకి లాయరుగారి ఫీజు బిల్లు ఆది.
😄
కోర్టుతో జోస్తీ జాస్తిగా ఉన్న ఒక ముద్దాయి, లాయర్లు వాదించే పద్ధతులు చూసి చూసి, ఒకసారి తన తరపున తనే వాదించబోయాడు.
"నువ్వు బ్యాంకులో దొంగతనానికి వెళుతుండగా చూసినట్టు ఈయన సాక్ష్యం" అన్నాడు ప్రాసిక్యూటరు.
"ఏవయ్యా సాక్షి, నేను బ్యాంకులో కెళుతుండగా నువ్వు చూశావా?" అన్నాడు దొంగ.
"అవును చూశాను"
"మళ్ళీ తిరిగి యివతలకి వస్తూండగా చూశావా?"
"లేదు"
"చూశారాండి. సాక్షి ప్రకారం నేనింకా అక్కడే ఉన్నానన్న మాట, కాని నిజానికి ఇక్కడే ఉన్నాను గదా, ఈ కేసు అబద్దం అన్న మాట" అన్నాడు దోషి.
😁
"నీ జన్మలో ఎక్కడేనా ఓ రూపాయి డబ్బులు గడించిన పాపాన పోయావూ?" అని గర్జించాడు లాయరు.
"చిత్తం. కిందటేడు మీరు ఎలక్షనుకి నిలబడ్డప్పుడు మీకు ఓటివ్వడానికి మీదగ్గరైదు రూపాయలుచ్చుకున్నా గదండి. "
😆
“నీతరుపున వాదించడానికి లాయర్ని పెట్టుకోవా?" అన్నాడు న్యాయమూర్తి విచారణ ఆరంభిస్తూ.
"అబ్బే ఎందుకండీ. నే నెలాగా నిజం చెప్పేద్దామనుకుంటున్నాను. ఇంక లాయరెందుకూ?" అన్నాడు ముద్దాయి..
😃
ఒక ఆసామి కారు ప్రమాదంలో దెబ్బ తిన్నాడు. కాలుపోయింది. కర్ర దున్నలు పెట్టారు.
మూణ్ణాల్లయినా అతను ఆ కర్రలు పట్టుకునే నడవసాగాడు, కట్లు అలానే ఉంచి.
"అదేమిటి? ఈ పాటికి నయమైపోయుం టుందే. కట్లు విప్పి, ఆ కర్రలు కూడా పారెయ్యొచ్చుగా" అన్నాడొక మిత్రుడు.
"డాక్టరుగారు అదే అంటున్నారు, ఇవన్నీ తీసెయ్యొచ్చని, ప్లీడరుగారు ఒప్పుకోటం లేదింకా."
😀
" మీ పిక్చర్ కామెడియా? ట్రాజెడీయా?'
"డబ్బొస్తే కామెడి, రాకపోతే ట్రాజెడీ".
"నేడే చూడండి" అని ప్రతి సినిమా ప్రకటనలో వేస్తారు కదా! అంత కొంప మునిగిపోయే అర్జంటేమిటి?"
"రేపుండదని హెచ్చరిక"
🤣
కమల: ఈ మగవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో?
విమల: ఆడవాళ్ళు మాట్టాడుకునేవే మాట్లాడుతారనుకుంటా."
కమల: చి చి అసయ్యం.
😂
"రేపు ఎలక్షనుకు నిలబడే అభ్యర్దులిద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటోయ్?"
" ఇద్దర్లో ఎవడో ఒకడే గెలుస్తాడని ఆనందంగా ఉన్నది."
😁
"నాతో నేనే మాట్లాడుకోడం మహా అలవాటైపోయింది డాక్టర్ గారూ. కాస్త మందేమైనా ఇస్తే-"
"దాంతో ఇబ్బందేముంటుంది? మందెందుకు?"
" అబ్బే వెధవ సోదండీ . విసుగొస్తుంది వాగాలేకా-వినాలేకా".
😃
"ఏమండీ, ఈ కవర్ మీద పది పైసలు స్టాంపులు ఎక్కువ అంటించారు.'
" అయ్యో చూడు నాయనా. అది రాజమండ్రిదాకానే వెళ్ళాలి. బిళ్ళలెక్కువున్నాయని విశాఖపట్నం లో మా వియ్యపురాలింటికి తోలీకుండా చూడు."
😆
"ఇక లాభం లేదు, ఓ గంటకన్న ప్రాణం నిలబడదు. చెప్పదలుచుకున్నదేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి" అని పెదవి విరిచాడు.
"ఆ ఉంది...ఇంకో డాక్టర్ను పిలిపించండి చప్పున" న్నాడు రోగి నీరసంగా.
🤣
"డాక్టర్ గారూ, భోజనానికి సరైన వేళాపాళా ఏదంటారూ ?"
"లేనివాడికి దొరికినప్పుడు...ఉన్నవాడికి అరిగినప్పుడు"
😅
ఒక రోగి ఆ"పరేషన్" బల్ల ఎక్కుతూ
"మరే ప్రమాదం లేదుగా డాక్టర్ గారూ?"
"చాల్చాల్లెవయ్యా, నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషన్ ఎవడు చేస్తాడు. భలేవాడివిలే..
😁
అమ్మల గన్నయమ్మ! - అంటే ఎవరూ? “అమ్మమ్మండీ?”
😆
*భశుం*
💐
꧁☆•┉┅━•••❀❀•••━┅
No comments:
Post a Comment