*_కోస్తుంటే కన్నీరు..__*
*_తింటుంటే నోట్లో సెలయేరు..!_*
*_(సురేష్..9948546286)_*
ఉల్లి తల్లి వంటిది..
ఉల్లి చేసే మేలు
తల్లి కూడా చెయ్యదు..
ఊహ తెలిసినప్పటి నుంచి
వింటున్న మాట..
నిజమే..
పెసరట్టు..మామూలే..
అదే ఉల్లి పెసరట్టయితే
ఆ లెక్కే వేరు..
కిక్కే సెప..రేటు..!
దోసె..మినపట్టు..ఊతప్పం..
సాదాగా వినిపించే పేర్లు..
మామూలుగా
అనిపించే రుచులు..
అదే ఉల్లి తగిలిస్తే..
అదెంత మజా..
పెనంపై చూడగానే
తెలిసే తేడా..!
అబ్బో..ఉల్లి వడా..
ఓ ఐదారు లాగించడమే
ఎడాపెడా..!
సాంబార్..అల్లం పచ్చడి..
కొత్తిమీర చట్నీ...
వేటిలోనైనా పడితేనే
ఉల్లిపాయ..పెరిగే హొయ..
ఆఘ్రాణిస్తుంటేనే తప్పే
గుండె లయ..!
ఇక నేరుగా ఉల్లి చట్నీ..
అదిరే రుచి..అదరగొట్టే వాసన..
మురిసిపోదా రసన..
జుర్రుమంటూ ఔపోసన..
ఉల్లి అంత రుచి గనకనే
ఎందరికో దాంతోనే ఉదరపోషణ..!
ఉల్లి..
కూరలో జాబిల్లి..
రసంలో రంగవల్లి..
వీటిలో ఉల్లి పడకపోతే
ఇంట్లో లొల్లి..!
ఉల్లి..
సాంబారులో ముక్క..
బారులో నంచుడు..
చికెన్లో తప్పనిది..
ఊరికే తిన్నా తప్పు కానిది..
కొన్ని సమయాల్లో
తప్పని సరయ్యేది..!
✍️✍️✍️✍️✍️✍️✍️✍️
No comments:
Post a Comment