Friday, June 28, 2024

             *_నేటి మాట_*

*మానవ జన్మ ఎందుకు ఉత్కృష్టమైనది??*
మానవ జన్మ చాలా చాలా ఉత్కృష్టమైనది,
ఇది పొందడం చాలా అదృష్టం,

మాధవుని మాధుర్యాన్ని మరిమరి అనుభవించాలని దేవతలు మరి మరి ప్రార్ధించి, మానవజన్మమునే కోరారు...! అంతటి గొప్ప అదృష్టం...

అవతరించి వచ్చిన ఇప్పుడు ఆనందించే అవకాశము మనకు దొరికినది!!..
జరిగిపోయిన కాలమును, ఆయుస్సును వ్యర్థము చేయక, ఆ మాధుర్యాన్ని గ్రోలేదానికి మనమందరం ప్రయత్నించాలి!!.. 

మనము ఎల్లప్పుడూ కోరికల కోసం ప్రాకులాడడం చేస్తున్నాము, కోరికలను పెంచితే అశాంతి యే కానీ, దానిలో స్థిరత్వము సత్యము లేనే లేదు!!..
ఇహ పర చింతలు ఉండవచ్చు,  అయినా వాటిని హద్దులో పెట్టుకోవాలి. 
ప్రకృతి తత్వమును జీవ భావమును  దాటి ఈశ్వర తత్వమును ధ్యానము చేసి, పరబ్రహ్మ తత్వముతో ఐక్యమై పోవాలి. 

అదే మానవ జన్మకి పరమధ్యేయము... ఇది ఆచరణలో పెట్టని పాండిత్యము గానీ, జపధ్యానాదులు కానీ కాలమును వ్యర్ధ పరచడమే! 
ఇకనైనా ఈ జన్మ సుకృతం చేసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలి!!

               *_🌷శుభమస్తు.🌷_*
 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

No comments:

Post a Comment