Forwarded...
😡*25.6.1975*😡
*ఎమర్జెన్సీ చీకటి రోజులు గుర్తు చేసుకుందాం*..
అప్రజాస్వామికంగా , దొడ్డి దారిలో ప్రధానమంత్రి అయిన నెహ్రూకి కూతురు అయిన ఇందిరా గాంధీ కూడా తండ్రికి తగ్గ తనయే.కుట్రలతో కూడిన నాటకీయ పరిణామాల వలన, మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రిగారి ( *అనుమానాస్పద హత్య లాంటి* ) మరణంతో సునాయాసంగా ప్రధాని పదవిలోకి వచ్చిన ఇందిరా గాంధీకి ప్రజలన్నా , దేశంలోని వ్యవస్థ లన్నా ఎంత అలుసో. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, నియంతగా మారి , దేశాన్ని అల్ల కల్లోలం చేసిన ఇందిరా గాంధీ నిజ రూపం ఎమర్జెన్సీ అరాచకాలలో బయట పడింది. అన్ని వివరాలు ఈ చిన్న పోస్ట్ లో పొందు పరచడం కష్టం కనుక, మీరు కూడా పూర్తి వివరాలకై గూగుల్ లో సెర్చ్ చేయండి.🙏🙏🙏
*ఇందిరాగాంధీ భారతదేశపు ప్రధానమంత్రిగా అధికారం చెలాయిస్తున్న కాలమది.* దేవకాంత్ బారువా అనే ఒక కాంగ్రెసు నాయకుడు ‘‘ఇందిరాయే ఇండియా’’ అని వ్యాఖ్యానించే స్థాయికి వ్యక్తి ఆరాధన , భజన పెరిగిపోయింది. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. *1975 జూన్ 12వ తేదీనాడు అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి జగన్‌మోహన్ సిన్హా ఒక తీర్పు వెలువరించారు. లోక్‌సభకు శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని ప్రకటించారు*. అంతేకాదు దాదాపు ఆరు సంవత్సరాలపాటు ఆమె రాజకీయ ప్రత్యక్ష జోక్యంపై ఆంక్షలు విధించారు. ఇంకేముంది? కాంగ్రెసు నాయకులు ఖంగుతిన్నారు. మాకు న్యాయస్థానాలతో పనిలేదు. రాజ్యాంగంతో పనిలేదు. ఇందిరాగాంధీయే కావాలి అని ఆందోళన మొదలుపెట్టారు. అప్పుడు సర్వోదయ నాయకుడు *జయప్రకాశ్‌నారాయణ్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఇందిరాగాంధీ గద్దె దిగిపోవలసిందే* నని ఆందోళన చేశాయి. అలా పోరాడిన వారిలో అటల్‌బిహారీ వాజపేయి, అశోక్‌మెహతా, మొరార్జీదేశాయ్, ఎల్.కె.అద్వానీ వంటి ఎందరో సీనియర్ నాయకులు ఉన్నారు. పరిస్థితి చేజారిపోతున్న సంగతి గమనించి శ్రీమతి ఇందిరాగాంధీ 1975 జూన్ 25 అర్ధరాత్రి భారతదేశంపై *అత్యవసర పరిస్థితి* విధించింది. *అంటే ప్రజల ప్రాథమిక హక్కులు రద్దుచేయబడ్డాయి*. పత్రికా స్వాతంత్య్రం హరింపబడింది. తర్వాత కొద్దినెలలకు *పత్రికల హక్కుల కోసం పోరాడే ప్రెస్ కౌన్సిల్ కూడా రద్దు చేయబడింది*. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి, ఆనంద్‌మార్గ్ వంటి ఎన్నో సంస్థలు నిషేధానికి గురయ్యాయ. కమ్యూనిస్టులు మొదట ఎమర్జెన్సీని బలపరిచారు. తెలుగు కవులు *సిగ్గు లేకుండా* ఈమె భద్రకాళి, మహాశక్తి అని కవితలు వ్రాశారు. 25 జూన్ అర్ధరాత్రి ఆనాటి భారత రాష్టప్రతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఎమర్జెన్సీ డాక్యుమెంటుపై సంతకం చేసి ఆమోదముద్ర వేశారు. దేశంలోని పత్రికలన్నీ తమ నిరసన తెలియజేయటం కోసం సంపాదకీయ స్థలాన్ని తెల్లగా వదిలివేశాయి.
ఆలిండియా రేడియోలో ప్రభుత్వం సెన్సారు చేసిన వార్తలు మాత్రమే వచ్చేవి. దాదాపు *లక్షన్నర మంది దేశ పౌరులు జైళ్లపాలయినారు*.
*వినోబాభావే శిష్యుడు ప్రభాకరశర్మ ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఒక జాబు వ్రాసి ఆత్మహత్య చేసుకోవటంతో* ప్రజా ఉద్యమం మొదలయింది. సుప్రీంకోర్టులో కేసు వేశారు. మొదట ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కోర్టు స్పందిస్తుందని అంతా ఆశించారు. ఐనా చివరకు ఒక్క హెచ్‌ఆర్ ఖన్నా మాత్రమే ఎమర్జెన్సీని వ్యతిరేకించారు. మెజారిటీ బెంచ్ ఎమర్జెన్సీని వ్యతిరేకించలేక పోయింది( *ఎందుకో మరి* ?). సుప్రీంకోర్టులో కృష్ణఅయ్యర్ ఇందిరాగాంధీకి షరతులతో కూడిన తీర్పు వెలువరించారు. ఆమె లోక్‌సభలో ఓటు వేయకూడదు, మాట్లాడకూడదని తీర్పులో ఉంది. దాంతో ఇందిరాగాంధీ రెచ్చిపోయి రాజ్యాంగంలోని 352 అధికరణం ప్రకారం అత్యవసర పరిస్థితిని విధించారు. ఇక దుర్మార్గం మొదలయింది. పార్లమెంటును కాదు సరికదా కనీసం తన మంత్రివర్గ సహచరులను కూడా సంప్రదించలేదు. కలాలకు, గళాలకు నిగళాలు మొదలైనాయి. ఇందిరాగాంధీ అనుమతితోనే పత్రికలు సంపాదకీయాలు వ్రాయాలి. పతాక శీర్షికలు పెట్టాలి. ఇంత జరిగినా హిందూ వంటి ఒకటి రెండు పత్రికలు ఇందిరాగాంధీకి మద్దతు పలికి ‘ప్రకటనలు’( *దాని వలన ఆదాయం కూడా* ) సంపాదించుకున్నాయి. ప్రజలపై దమనకాండ మొదలయింది. శ్రీమతి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ వివాహితులకు , అవివాహితులకూ(😡😰😡) కూడా లక్షలాది సంఖ్యలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు. బుల్‌డోజర్లుపెట్టి ఢిల్లీలో కాలనీలకు కాలనీలను నేలకూల్చాడు. ‘‘భారత్‌మాతాకీ జై’’ అన్న వారిని జైలులో పెట్టారు. నన్ను కూడా ముషీరాబాదు సెంట్రల్ జైలులోపెట్టి రెండున్నర సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిప్పారు. చేతికి బేడీలు వేశారు- వి.రామారావు (మాజీ సిక్కిం గవర్నర్) వంటి వారు ఎందరో ఆనాడు ముషీరాబాదు జైలులో ఉన్నారు.
నల్లకుంట శంకరమఠంలో *పూరీ జగద్గురు శంకరాచార్యులవారు వచ్చి ప్రవచనం చేస్తున్నారు*.
ఎందరో భక్తులు పట్టుపంచెలు కట్టుకొని భక్తిగా వినడానికి వచ్చారు. నేను పీఠాధిపతిగారికి సమీపంలో కూర్చున్నాను. ఈ ఇందిరాగాంధీ దుర్మార్గురాలు, దేశంపై అత్యవసర పరిస్థితి విధించి ప్రజలను హింసిస్తున్నది’ అని ఆయన ప్రసంగం ప్రారంభించారు. అంతే దాదాపు మూడు నిమిషాలల్లో శంకరమఠంలో ఒక్క భక్తుడూ లేడు. అంతా తలొక దిక్కుకు పారిపోయారు.( *ఎందుకు భయపడి పారి పోయారో అర్థం అయిందా ??* )
ఇందిరాగాంధీ అంతటితో ఊరుకోలేదు తన పదవిని శాశ్వతపరచుకోవటంకోసం ఐదేళ్ల లోక్‌సభ కాలపరిమితిని ఆరేండ్లు చేసింది. హాజీ మస్తాన్ వంటి బొంబాయి స్మగ్లర్లతోబాటు *సమానంగా* అకళంక దేశభక్తులను సెల్స్‌లో పెట్టి చిప్పకూడు తినిపించింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెసువారు అత్యుత్సాహంతో ఎమర్జెన్సీని అమలుపరిచారు. మీసా (అంతర్గత భద్రతా చట్టం) విధించి ప్రభుత్వాన్ని విమర్శించి దొరికిన వాళ్లను దొరికినట్లు జైళ్లలో పడేసి థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఎందరో ప్రముఖ నాయకులు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. మారువేషాలతో ప్రజాఉద్యమాన్ని నిర్మించటం మొదలుపెట్టారు. శ్రీమతి గాంధీ క్రమంగా తన పలుకుబడిని జాతీయ అంతర్జాతీయ రంగాలల్లో కోల్పోయింది. మొత్తం భారత ఖండంలో ఆమె భయోత్పాతం సృష్టించింది కేవలం పదవీ కాంక్షకోసం?? ఈ వివరాలేవీ ఈ తరం వారికి తెలియవు. ఎందుకంటే ఈ చీకటిచరిత్ర జరిగి సరిగ్గా 2015 జూన్ 25నాటికి నలభై సంవత్సరాలయింది.
అప్పుడు జైలులో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు బాలాసాహెబ్ దేవరస్‌కు ఆమె ఒక సందేశం పంపింది. మిమ్మల్ని విడుదల చేస్తాము. నిషేధం తొలగిస్తాము. ఎన్నికలలో నాకు మద్దతునివ్వండి అని అందుకు బాలాసాహెబ్ దేవరస్ అంగీకరించలేదు. ఎమర్జెన్సీని ఎత్తివేయకుండానే ఆమె ఎన్నికలు ప్రకటించింది. 1977 మార్చి 2వ తేదీనాడు ప్రకటన వచ్చింది. వెంటనే బాబూ జగ్జీవన్‌రాం వంటివారు కాంగ్రెసు నుండి బయటకు వచ్చి జనతాపార్టీ పేరుతో ఎన్నికలలో పోటీచేశారు. అంతకుముందు కాంగ్రెసుకు లోక్‌సభలో 350 సీట్లు ఉండేవి. ఎన్నికల తర్వాత *153* మాత్రమే వచ్చాయి. సోషలిస్టు పార్టీ నాయకుడు *రాజ్‌నారాయణ్ చేతిలో శ్రీమతి ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో ఘోర పరాజయం పొందింది*. ఆరోజు ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు త్రిదళ సైన్యాధికారులను పిలిచి *దేశంలో మిలటరీ పాలన పెడదాం అని సూచించింది*. అందుకు త్రిదళాధిపతులు *ఒప్పుకోలేదు*.
*తెల్లవారేసరికి శ్రీమతి గాంధీ ఓడిపోయింది*.
ఉదయం ఎమర్జెన్సీ ఎత్తివేయబడింది. అప్పుడు జరిగిన రాక్షసకాండపై ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ‘‘ఎండ్ ఆఫ్ యాన్ ఎరా’’ అని కులదీప్‌నయ్యర్ ఒక పుస్తకం ఆంగ్లంలో వ్రాశారు. ‘అత్యాచార పర్వం’ ‘జన విజయం’ అని రెండు తెలుగు పుస్తకాలు 1977లో నేను వ్రాశాను. మొరార్జీదేశాయ్ భారత ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. ఇంతటి ఎమర్జెన్సీలో కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వెనుకనే బలంగా నిలబడింది ( *ఎంత దౌర్భాగ్యం* ). 40 స్థానాలకు గాను 39 స్థానాలు గెలుచుకోగలిగింది.
నాకు తెలిసిన ఎన్నో కుటుంబాలు ఎమర్జెన్సీ కాలంలో చితికిపోయాయి. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం ఊరికేపోలేదు. సంజయ్‌గాంధీ ఆ తర్వాత కొద్ది కాలానికే న్యూఢిల్లీలో విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైనారు. శ్రీమతి గాంధీని ఆమె అంగరక్షకుడే కాల్చి చంపాడు. ఎమర్జెన్సీకాలంలో కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు గడ్డాలు పెంచుకొని తలగుడ్డలు చుట్టుకొని మారువేషాలల్లో తిరిగారు. ఎవరికీ తెలియకుండా ఎక్కడనుండో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కరపత్రాలు వస్తుండేవి. ఎమర్జెన్సీ తర్వాత మొరార్జీదేశాయ్ ‘‘షా’’ కమిషన్‌ను నియమించారు. వల్లూరి బసవరాజు అనే కాంగ్రెసు నాయకుడు ‘మొరార్జీ దేశాయ్ కమిషన్ ఏజెంటు’ అని అపహాస్యం చేశారు. 1975 ఎమర్జెన్సీని ప్రత్యక్షంగా చూచినవారూ శిక్షలు అనుభవించిన వారూ ఇప్పటికీ ఇంకా కొందరు జీవించే ఉన్నారు.
నా సహోదర మూర్ధన్య కవులెందరో *ఇందిరాగాంధీకి పాదాభివందనం చేసి* స్తుతిగీతాలు వ్రాసి సుఖ జీవనం సాగించారు. కృష్ణాపత్రిక సంపాదకుడు పిరాట్ల వెంకటేశ్వర్లు శ్రీవాణి ఆధ్యాత్మిక పత్రిక సంపాదకుడు కొమరగిరి కృష్ణమోహనరావు వంటివారిని *ఎందరినో ఆమె జైళ్లపాలు చేసింది*. వారి *కుటుంబాలు దుర్భర దరిద్య్రాన్ని అనుభవింపవలసి వచ్చింది*. ఇలా దేశవ్యాప్తంగా జరిగింది. 20 సూత్రాల పథకం అనే ఒక ప్రణాళికను ప్రవేశపెట్టి ఆకాశవాణి ద్వారా ప్రచారం చేయంచింది. ఈ కవి సమ్మేళనాలలో మన ప్రముఖ తెలుగు కవులంతా పాల్గొని ఎమర్జెన్సీని సమర్థించి పారితోషికాలు తెచ్చుకున్నారు.
*జయ ప్రకాశ్ నారాయణ్ ఎంతో శ్రమపడి సాధించిన జనతా పరివర్తనను చరణ్ సింగ్ అనే జాట్ నాయకుడు నీరు కార్చాడు*.
*ప్రధాని పదవిపై ఆశతో ఇందిరాగాంధీతో చేతులు కలిపి మొరార్జీ ప్రభుత్వాన్ని కూలద్రోశాడు*.
*అరుణ్ జైట్లీ, రామకృష్ణ హెగ్డే, మధు దండావతే వంటి మేధావి వర్గానికి చెందిన వారంతా జైళ్లపాలయ్యారు*.
రాజ్యాం గానికి 39 సవరణలు చేయంచారు.( *అప్పుడే మన దేశం సెక్యులర్ దేశం చేయబడింది* ) ఇంత జరిగినా, ఇందిరాగాంధీ, ఇతర గాంధీ ల పేర్లతో అంతర్జాతీయ విమానాశ్రయాలు, సోనియా గాంధీకి దేవాలయాలు కట్టడాలు, ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయంటే ఈ ప్రజలలో ఇంత మంది వివేకాన్ని , దేశభక్తిని సందేహించాల్సి ఉంటుంది.
🙏😰🙏😰🙏
- ముదిగొండ శివప్రసాద్
No comments:
Post a Comment