హరిఓం , - _*కర్మ-పునర్జన్మ*
*_మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి._*
*_1. మొదటిది :-_*
*_మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది._*
*_2. రెండవది :_*
*_వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి._*
*_3. మూడవది :-_* *_ఈ శక్తులు మన వర్తమానంలోనూ భవిష్యత్తులోను గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి._*
*_ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు ?_*
*_మహర్షులు, యోగులు కర్మల నుండి ఎలా తప్పించుకోవాలా ? అని ఎప్పుడు ఆలోచించలేదు. కర్మ క్షాళనం కోసం తపించారు. వారు అనుసరించిన పద్ధతినే మనం కూడా అనుసరించ వచ్చును.._*
*_మనం గత జన్మల్లో చేసుకున్న పాప రాశి కొండంత ఉంటుంది. దీనిని చాలా నెమ్మదిగాను, వాటినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చే జన్మలకి వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగి పోతాయి._*
*_విష్ణుమూర్తి ద్వారపాలకులు అయిన జయవిజయులని ‘మూడు జన్మల్లో హరి వైరులుగా మారి, శ్రీహరితో చంపబడి వైకుంఠం చేరతారా ?’ లేదా ‘ఏడు జన్మల్లో హరిభక్తులుగా జన్మించి వైకుంఠం చేరతారా ? ‘ అని అడిగితే వారు ‘ఏడు జన్మల హరి విరహం భరించలేము. ఏడు జన్మల సుదీర్ఘ కాలం భరించలేము !’ అన్నారు._*
*_మనం మాత్రం మన కర్మాభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించుకోవద్దూ ! దీనికి మనం ఏమి చేయాలి ? దీనికి శ్రీకృష్ణుడు ఒక మహాద్భుత మార్గాన్ని సూచించాడు.._*
*_యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జీతాః_*
*_జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితమ్ బుధాః_*
*_భగవద్గీత.. జ్ఞానయోగం..19 శ్లో.._*
*_ఎవరి సమస్త కర్మలు కోరిక సంకల్పం లేకుండా ఉంటాయో, వారి కర్మలు "జ్ఞానం" అనేయగ్ని చేత దహించబడతాయి._*
*_"యధేయాంసి సమిద్ధో అగ్ని ర్భస్మాత్కురుతే అర్జున_*
*_జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కతరుతే తధా”_*
*_జ్ఞాన యోగం : 37 శ్లో.._*
*_"అర్జునా ! బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని, కట్టెలని ఏ విధంగా బూడిద చేయగలుగుతుందో, మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయగలుగుతుంది.”_*
*_ఈ ఉపదేశంలో పరమార్ధం ఏమిటి ?_*
*_జ్ఞానం మనలో అగ్నిలా జ్వలిస్తే… మన కర్మలు మనలని బాధించలేవు. మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే, ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు._*
*_మనం ఈ కర్మ రహస్యాన్ని… జ్ఞానాన్ని పొందితే మన పెదవులపైన చిరునవ్వే వుంటుంది ................... - 🙏🙏...... - వలిశెట్టి లక్ష్మీశేఖర్ .. - 98660 35557.... - 18.06.2024 ......
No comments:
Post a Comment