*రామాయణంలో రాక్షసవీరులందరూ ధర్మంతెలిసినవారే!*
ధర్మం గురించి మూడు రకాల వ్యక్తుల గురించి వారి పరిస్థితి గురించి రామాయణం నుండి.
దశకంఠుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురూ సాంగోపాంగంగా వేదం చదువుకున్నారు, తపస్సంపన్నులు, సాక్షాత్ బ్రహ్మ వంశస్థులు. ధర్మం విషయంలో ముగ్గురూ మూడు రకాల ప్రవర్తనలు కలిగి ఉంటారు. దాని వలన ఎవరేం ఫలితం పొందారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు కదా...!
ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్పడు, ఆచరించడు :-
1] దశకంఠుడు (రావణుడు) - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్పడు, ధర్మం ఆచరించడు, భూతదయలేనివాడు. ఎవరైనా తనకు ధర్మబోధ చేసినా వినడు, సహించడు తనకు నచ్చినట్లుగా ఉండడమే ధర్మం అని బుకాయిస్తాడు. రాముడి చేతిలో చచ్చాడు.
ధర్మం తెలుసు, ధర్మం బోధిస్తాడు, కానీ ఆచరించడు :-
2] కుంభకర్ణుడు - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్తాడు, ధర్మం ఆచరించడు, భూతదయలేనివాడు, అధర్మం ఐనా సరే అన్నకోసం చేసేస్తాడు. రావణుడికే సీతమ్మను అపహరించి అధర్మం చేసి లేనిపోని కష్టం కొని తెచ్చుకున్నావని కోపంతో ధర్మబోధ చేసాడు, కానీ అన్నకోసం అధర్మం వైపే ఉన్నాడు. రాముడి చేతిలో చచ్చాడు.
ధర్మం తెలుసు, ధర్మం బోధిస్తాడు, ధర్మమే ఆచరిస్తాడు:-
3] విభీషణుడు - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, ధర్మం చెప్తాడు, ధర్మం ఆచరిస్తాడు, భూతదయఉన్నవాడు, అధర్మం ఐతే అన్నైనా సరే విభేధిస్తాడు. రావణుడికే సీతమ్మను అపహరించి అధర్మం చేసి లేనిపోని కష్టం కొని తెచ్చుకున్నావని ధర్మబోధ చేసాడు. మహాశక్తివంతుడు మహైశ్వర్యవంతుడైన రావణుణ్ణి ఎదిరించి, వానరాలతో వచ్చిన సాధారణ మానవుడు శ్రీరాముని శరణు జొచ్చాడు. ఐశ్వర్యమూ, బలమూ ఎక్కడ ఉన్నదో అని కాదు ధర్మం ఎక్కడుందో అక్కడ ఉంటాడు. రామునికి ప్రాణ మిత్రుడైయ్యాడు......
🚩సర్వేజనా సుఖినోభవంతు 🚩
No comments:
Post a Comment