గుడ్ మార్నింగ్ 🌹మనిషి జీవితములో సృష్టి సాధనను కలిపే ఉంచింది. ప్రయత్నించకుండా - కదలకుండా మనిషి జీవితం గడవదు.ఆ కదలికకు ఫలితం వున్నది. అది మనిషి అనుభవించక తప్పదు. ఆ అనుభవం సుఖ దుఖాల రూపములో ఉంటుంది. సుఖమైతే బ్రతుకు మీద ఆశను పెంచి బ్రతకాలి అనే భావానికి సహకరిస్తుంది. దుఃఖమైతే దీనిని తప్పించుకోవాలని- ఎలా తప్పించుకోవాలనే అన్వేషణ మొదలవుతుంది. ఈ అన్వేషణ ఎదో ఒక రోజుకు ఆధ్యాత్మిక అన్వేషణగా తప్పక మారుతుంది. ఎన్ని వంకర మార్గాలలో ప్రయాణించినా, ఆఖరుకు చేరుకోవలసిన దారి ఒక్కటే - శక్తి,, విశ్వ శక్తి, సమస్తానికి మూల శక్తి - అదే ఆత్మశక్తి, ప్రతి జీవిలో ప్రాణ శక్తి. శరీరము - మనసు - ప్రాణ శక్తి కలిపితే జీవి. జీవి శరీరానికి మాత్రమే కాల పరిమితి వుంది. మరల కొత్త శరీరం ధరించే అవకాశము వుంది. ఎన్ని శరీరాలు తీసుకుంటావో.... ఎన్ని మానసిక అనుభూతులు పొందుతావో.... తిరిగి తిరిగి, అలసి అలసి,ఎదో ఒక రోజుకు నువ్వే వెళ్లి, నీ ప్రాణ శక్తిలో నిశ్చలముగా కూర్చుంటావు. అనంత ఆత్మనుభూతిని పొందుతావు. జీవులందరికి సృష్టి ఇచ్చిన స్వేచ్ఛ - తిరుగు, కదులు నీ ఇష్టం. కానీ కర్మ ఫలానుభవం తప్పదు. ఈ అనేక జన్మల తిరుగులాట, కర్మ ఫలానుభవాలు - ఎప్పటికైనా అర్ధమై... అది కొద్ది కొద్దిగా జ్ఞానమై.... ఆ జ్ఞానము ఒక నాటికి పూర్ణమై, సంపూర్ణమై - జ్ఞానోదయం అవుతుంది. ఇదే మోక్షము. ఇదే సృష్టి ఆట.అర్ధం చేసుకో..ఆడు... ఏడవకు... ఇది నిజముగా నిజము కాదు. కేవలం మన శరీర భావన. 🌹god bless you 🌹
No comments:
Post a Comment