Thursday, June 13, 2024

****బాధ - నీతి

 *శ్రీ గురుభ్యోనమః*

                      
*బాధ  -  నీతి*

*ప్రశ్న :  మనమంతా  విముక్తులమే,  మనకే  బంధమూ  లేదు,  మనం  భగవంతుని  నుండి  నిప్పు  కణాల  వలె  వచ్చాం.  తిరిగి  ఆయననే  చేరుతామంటారు  శ్రీ శంకరాచార్యులు.  అట్లా  అయితే,  అన్ని  రకాల  పాపాలనూ  ఎందుకు  చేయకూడదు ?*

*జవాబు :*  మనకి,  ఆత్మకీ  బంధంలేని  మాట  నిజమే !  చివరికి,  నీ  మూలంలో  నీవు  చేరుతావన్నదీ  నిజమే !  ఈ లోగా  నీవనే  పాపకార్యాలు  చేస్తే  వాటి  ఫలితాన్ని  అనుభవించాల్సిందే,  దానిని  తప్ఫించుకోలేవు.  ఎవరైనా  వచ్చి  నిన్ను  బాదుతూంటే ..  "నేను  విముక్తుడ్ని,  ఈ దెబ్బల  వల్ల  నాకే  బంధమూ  లేదు,  నాకే  బాధా  లేదు,  వాడు  కొట్టితే  కొట్టనీ"  అనగలవా ?  అట్లా  నిజంగానే  నీకనిపిస్తే  నీ ఇష్టం  వచ్చినట్టు  నీవు  చేయవచ్చు.  "నేను  విముక్తుడ్ని"  అని  పెదవులతో  అనటంలో  అర్థమేమిటి ?

*ప్రశ్న :  ప్రపంచమంతా  ఈశ్వరుని  లీల  అని,  అంతా  బ్రహ్మమయమనీ  అంటారు.  అటువంటప్పుడు  దురభ్యాసాలని  విడనాడాలని  ఎందుకంటారు ?*

*జవాబు :*  మనిషి  శరీరంలో  ఒక  పుండుందనుకో,  శరీరంలో  కొంచెం  భాగమే  నంటూ  నిర్లక్ష్యం  చేస్తే  అది  శరీరానికంతా  నొప్పిని  కలిగిస్తుంది.  మామూలు  వైద్యంతో  నయం  కాకపోతే,  డాక్టరు  వచ్చి  కత్తితో  దానిని  కోసివేసి  ఆ మాలిన్యాన్ని  తీసివేయ  వలసి  వస్తుంది.  ఆ భాగాన్ని  తీసివేయకపోతే  కుళ్ళుతుంది.  తీసివేసిన  తరువాత  సరిగ్గా  కట్టు  కట్టకపోతే,  చీము  పడుతుంది.  ప్రవర్తన  విషయమూ  అంతే !  దురభ్యాసాలు,  దురలవాట్లూ  దేహంలో  కురుపువంటివే !  ప్రతి  రోగానికీ  తగిన  వైద్యాన్నివ్వాలి.


*(ప్రశ్న :: _"జ్ఞానాగ్ని"లో కర్మలన్నీ దగ్ధమైపోతాయి అంటారు కదా. ఎలా, ఏ విధంగా దగ్ధమవుతాయి ??)_*

*గురుదేవులు :: "కర్మ" అనేటువంటిది జీవితాన్ని బంధిస్తున్నది. ఈ జీవన బంధన నుండి విడుదల పొందాలని– 'కర్మ రాహిత్యం' పొందడానికి నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వాటి ద్వారా నీకు సాధ్యం కాదు. కేవలము ఈ విధమైనటువంటి అవగాహనతో, (అంటే)*
    ఇవి 
    చైతన్యము యొక్క
    పాత్రలు 
    చైతన్యము యొక్క స్థితులు
    అని చక్కగా అవగాహన
    చేసుకొని,
   *   నీ జీవితములో
        'చైతన్యము యొక్క
        పాత్రల'ను 
        నీవు గుర్తెరిగి,
   *   ఏ చైతన్యము ఎందుకు
        ఉద్దేశింపబడిందో కూడా
        తెలుసుకొని,
   ఆ భగవంతుణ్ణి–
  (అంటే)
  ఏ భగవంతుడు "వ్యక్తమై"
  అవతరించాడో,
  అవతరించినటువంటి
   అవతారపురుషుని యొక్క
   విధేయతలో,
   అవతారపురుషుని యొక్క
   సర్వార్పణ  స్థితిలో
   నీ యొక్క సర్వ కర్మలూ
   దగ్ధమవుతవి.
*అదే జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధమవుతవి అంటే.*

*ఏది 'జ్ఞానము'?*
   *   ఈ పుస్తకములన్నీ చదివి
       సముపార్జించినటువంటి
       సిద్ధాంతమా,
        జ్ఞానమంటే ?  
               _కాదు !_
   *   -  ఈ జీవితమంటే
            ఏమిటో, లేదా
        -  ఈ "కర్మ" అంటే
            ఏమిటో,
        -   ఈ దేవుడంటే
             ఏమిటో
        -   ఈ "చైతన్యమంటే"
             ఏమిటో
      చక్కగా  నిర్వచించ
      గలిగినటువంటిదా
      జ్ఞానమంటేను ?
             _కాదు !_
*(మరి) ఏది జ్ఞానము ?*
  _ఏ గురువు,_
      _నీవు విధేయుడవై_
      _ఉన్నటువంటి_
      _ఏ గురువు,_
  _నీకు విధించినటువంటి_
  _కర్మ ఆచరణకు_
  _అవసరమైనటువంటి_
  _"విజ్ఞత"ను నీవు పొంది_
  _ఉంటావో,_
    అది మాత్రమే జ్ఞానము !
   _అంటే,_
   _గురువు యొక్క ఆదేశమే_
   _జ్ఞానము!_
*"జ్ఞానయోగము" అంటే– ఆ గురువు యొక్క ఆదేశమునకు బద్ధుడవై నీవు జీవించడమే "జ్ఞానయోగము"!*

*ఈ విధముగా, ఈ జ్ఞామనేటువంటి ఈ యోగము ద్వారా "కర్మ"ను రహితం చేసుకోవడం, ఈ "కర్మ రాహిత్య స్థితిలో– నీ వాస్తవమైనటువంటి స్థితి యొక్క అనుభవం పొందడమే గాక,*
   _ఏ "ఉపాధి"_
  _నీవు ఆటంకమని_
  _అనుకుంటున్నావో,_
  _వేటిని నీవు త్యజించాలని_
  _నీవు కోరుతున్నావో,_
  _ఆ 'శరీరముల' ద్వారానే_
  _నీవు "దైవీ జీవితాన్ని"_
  _జీవించగలుగుతావు–_
  _దైవమై !_

°° "Existence is Real, Life is Shadow "
             
*"నీ సహజస్థితిలో  ఉండు"*
     
 *భగవాన్ శ్రీ రమణమహర్షి బోధనలు*

No comments:

Post a Comment