Friday, June 28, 2024

 *🕉️🙏  చిన్ముద్ర  🕉️🙏*
              
*🕉️🙏"మానవుని"(జీవుడు) చేతికి ఐదు వ్రేల్లుoటాయి.🕉️🙏*

*🕉️🙏నాలుగు వ్రేల్లు కలిసే ఉంటాయి. ఒకటి మాత్రం దూరంగా(బొటనవేలు )ఉంటుంది. అది "పరమాత్మ". మిగిలిన ఈ నాలుగు వ్రేల్లు లో "చూపుడు వ్రేలు జీవుడు". మిగిలిన మూడు వ్రేల్లు , "మూడు గుణాలు".(సత్వ, రజస్, తమో) 🕉️🙏*

*🕉️🙏"జీవుడెప్పుడూ" మూడు గుణాలతో కూడియే ఉంటాడు. అందుకే నాలుగు వ్రేల్లు ఎప్పుడూ కలిసే ఉంటాయి.🕉️🙏*

*🕉️🙏అయితే ప్రయత్నంతో చూపుడు వ్రేలు అనబడే "జీవుడు" ని మిగిలిన మూడు వ్రేల్లు అనే "మూడు గుణాలకు" దూరంగా జరిపితే.. "పరమాత్మ" అనే బొటన వ్రేలితో కలసిపోతాడు🕉️🙏.*

*🕉️🙏ఇలా చూపుడు వ్రేలు, బొటన వ్రేలు కలిసి "సున్నా"గా ఏర్పచితే అదే … "చిన్ముద్ర". 🕉️🙏*

*🕉️🙏ఆలయాల్లో "దేవతా" విగ్రహాలు చూపే "చిన్ముద్ర"లోని "ఆంతర్యం" ఇదే..!*🕉️🙏

*🕉️🙏"మూడు గుణాలను వదిలించుకొని నాతో "ఐక్యం" కండి అని చెప్పటమే...!"🕉️🙏* 

*🕉️🙏స్వస్తి*🕉️🙏

*🕉️🙏సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు 🕉️🙏*

No comments:

Post a Comment