🌷..
*ఒక దారుణమైన సంఘటన మీలో ఎవరికైనా గుర్తుందా?*
*10 ఏళ్ల క్రితం హైదరాబాద్ VNR విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు..*
*అక్కడ 8-06-2014 సాయంత్రం 5:30 గంటలకు బియాస్ నదీ తీరాన ఫోటోలు తీసుకుందామని వెళ్లారు..*
*అప్పుడు నదిలో నీళ్లు లేవు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి.*
*ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళను ఆకర్షించింది. దానిపై నిలబడి, ఫోటోలు దిగుదామని వెళ్లారు.*
*సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మ్రోగింది.. అదేంటో వీళ్లకు అర్థం కాలేదు..*
*వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ dam గేట్లు ఎత్తివేసి, నదీ జలాలను విడుదల చేశారు..*
*ఆ నదీ ప్రవాహం వీళ్ళ వైపుగా రావడాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు.. వీళ్ళను alert చెయ్యడానికి కేకలు వేశారు.. కానీ, వీళ్ళు పట్టించుకోలేదు.. ఆ నీళ్ళ మధ్యన నిలబడి, ఫోటోలు దిగుతూ enjoy చేస్తున్నారు.. (వాళ్ళ చివరి ఫోటోలు అవే)*
*అంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.. ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు.. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయాను అని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వెళ్లి పోయింది..*
*ఉన్నట్లుండి, నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకూ చేరుకుంది..*
*రాళ్ళ మీద నిలుచున్న విద్యార్థులు నిస్తేజంగా నిలబడిపోయారు..*
*అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్లెదుటే కొట్టుకునిపోయారు..*
*తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు..*
*ఇక్కడ మనం గమనించవలసింది, vijeta college లాంటి top college లో చదివిన వీళ్లకు,*
*ప్రకృతి ఎంత శక్తివంతమైనది అని తెలియకపోవడం..*
*వీళ్ళలో ఎవరికీ ఈత రాకపోవడం..*
*"చెప్పుల" కోసం ప్రాణాలను పోగొట్టుకోవడం..*
*ఈ post చదువుతున్నవారిలో, *
*ఎందరి పిల్లలకు ఈత వచ్చు? *
*ఈత అని మాత్రమే కాదు,*
*ఉన్నట్లుండి మీ ఇంట్లో electrical short circuit ఏర్పడితే, ఏమి చెయ్యాలి అన్నది ఎందరి పిల్లలకు తెలుసు?*
*ఎవరైనా పెద్దలకు heart attack, ఊపిరి ఆడకపోవడం, చెయ్యి తెగితే, రక్తం ధారగా కారుతున్నపుడు ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు?*
*కనీసం FIRST AID ఎలా చేయాలో తెలుసా?*
*పిల్లలకు మనం నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా?*
*చదువు, చదువు, చదువు, మార్కులు, ర్యాంకులు, engineering, medicine, GRE, G-MAT, IELTS, TOEFL, US, UK.. డాలర్లు..*
*వాళ్ళను shopping malls లో branded dresses వేసుకోమనడం, Reebok, Nike shoes కొనివ్వడం, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ టిక్కా ముక్కలు, బిర్యానీలు...ఇవి మాత్రమే కాదు..*
*ప్రకృతి అందాలే కాదు, ప్రకృతి కన్నెర్రజేస్తే, ఎలా ఉంటుందో చూపించాలి..*
*రాజ్యాంగం లోని మన హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి.. *
*ఎదుటి వాడు దాడి చేస్తే రక్షించుకోవడం నేర్పించాలి..*
*సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులతో సమయస్పూర్తిగా మెలగడం అలవాటు చెయ్యాలి....*
*అప్పుడే వాళ్ళకి మంచి , చెడు గురించి అవగాహన వస్తుంది..*
*అన్నింటికంటే ముందు "common sense" ‘ఇంగిత జ్ఞానము’ అనేది లేకుండా పిల్లలను పెంచుతున్నాం... దాన్ని నేర్పకుండా.. చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు.. అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే…,*
*ఇదుగో.. ఫలితాలు.. ఇలాగే ఉంటాయి.....*
*ఆలోచించండి....*
*ఈ దిశగా కూడా ప్రయత్నం చేయండి..*
*కొంతమందికి అయినా అవగాహన కల్పించి మన విద్యార్థుల విలువైన జీవితాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం…*✍️
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
No comments:
Post a Comment