శ్రీమద్రామాయణము.
(216 వ ఎపిసోడ్),,
"" మానవులు ఆచరించాల్సిన సత్కర్మలలో పురుషార్థాలనియు కర్మలనియు మూడు రకములైనవిగ యుంటాయి""
""ధర్మము, అర్థము,, కామము,, "" అనబడునవి పురుషార్థములు,
"" సామ, దాన , దండోపాయము,
అనబడునవి త్రివిధ కర్మలు.
రావణుడు గొప్ప తపస్సంపన్నుడు,కైలాస పర్వతాన్ని తన భుజస్కందాలపై ఎత్తి మహాశివుని ప్రసన్నము చేసుకున్నవాడు.గొప్ప గొప్ప వరాలని సంపాదించుకున్నవాడు.అంతటి మహాశూరుడు తనకన్నా చిన్నవాడైన తమ్ముడగు కుంభకర్ణుని రామసైన్యముపై పోరు సల్పి తనకి విజయము చేకూర్చమని ప్రాధేయపడతు,
" కురుష్వ మే ప్రియహితమే తదుత్తమం,
యథాప్రియం ప్రియరణబాంధవప్రియ|,
స్వతేజసా విధమ సపత్న వాహినీం
శరద్ఘనం పవన ఇవోద్యతో మహాన్||, ( యుద్ద కాం. 62-23),
ఓ కుంభకర్ణా! మనిరువురి మధ్య గల సోదర ప్రేమ ప్రగాఢమైనది.రామ సైన్యాన్ని తుదముట్టించి నాకు ప్రియము మరియు హితము ప్రసాదించి పెట్టుము.శరత్కాల మేఘమువలే నీ పరాక్రమముతో శత్రుసేనను ఛిన్నాభిన్నము చేయుమని ప్రాధేయపడతాడు.
ఆ సమయములో కుంభకర్ణుడు బిగ్గరగ నవ్వి సోదరా రావణా! ఇదివరలోనే నీ నిర్ణయము దోషభూయిష్టమైనదని చెప్పాము.కానీ నీవు వినలేదు.
"" యః పశ్చాత్ పూర్వకార్యాణి కుర్యాదైశ్వర్యమాస్థితః,
పూర్వం చాపరకార్యాణి న స వేద నయా~నయౌ||< (63- 05),
బలముతోడ గర్వించియున్నవాడు మదముతో తాను ముందు చేయవలసిన పనిని తర్వత చేయును.తర్వాత ఎప్పుడో చేయవలసిన పనిని ముందుగానే ఆచరించుచుండును.దీనినే ""యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనత"" యని అంటారు.
"" త్రయాణం పంచథా యోగం కర్మాణాం యః ప్రపశ్యతి|,
సచివైః సమయం కృత్వా స సభ్యే వర్తతే పథి||, (63-07),,
ఓ రావణబ్రహ్మా! కర్మలు మూడు రకాలు అవి సామ, దాన, దండోపాయములు. వాటిని ప్రాజ్ఞులు ఉత్తమ,మధ్యమ,అథమ కర్మలని చెపుతారు. ఎదుటివాడు బలహీనుడైతే దండోపాయమును ఆశ్రయించుట ఉత్తమ కర్మ, ఇద్దరివి సమాన బలములైతే సామోపాయమును ఆశ్రయించుట మథ్యము, ఇక మనకన్నా శత్రు బలము ఆథిక్యములో యున్న దానోపాయమును ఆశ్రయించటము అథమము.
అన్నా రావణా! నీవు వీటిని నిర్లక్ష్యము చేసి కనీసము మంత్రులను కూడ చర్చించక ధర్మగ్లానికి పూనుకున్నావు.అంతేకాదు ఈ సమయములో నీవు ముఖ్యమైన పురుషార్థములను కూడ విస్మరించావంటు,
"" ధర్మమ్ అర్థం కామం చ సర్వాన్ వా రక్షసాం పతే|,
భజేత పురుషః కాలే త్రీణి ద్వందాని నా పునః||,(63-09),,
"" అన్నా ! నీకు ఇవి తెలియనివి కావు.కానీ నీవు వాటిని నిర్లక్ష్యము చేసావు.ఈ ధర్మము, అర్థము,కామము అనబడే ఈ మూడు పురుషార్థాలు తగిన కాలములందు మాత్రమే నిర్వహించాలి.కానీ ఈ మూడింటిలో ధర్మమే శ్రేష్టమైనది.ధర్మకార్యాలను ప్రాతఃకాలమున ఆచరించి, ధర్మము వీడక అర్థ సంపాదన మధ్యాహ్న కాలమున ఆర్జిస్తు, ఇక రాత్రివేళలలో ధర్మప్రకారము కామములను అనుభవించవలెను. ఇట్లుకాక సదా కామము పట్ల ఆకర్షితుడైన వానిని అథమశ్రేణి వ్యక్తిగ గుర్తింతురు
అన్నా నీవు ఈ ధర్మాలని లెక్కచేయక ఇప్పుడు చింతిస్తున్నావంటు,
"" అవశ్యం తు హితం వాచ్యం సర్వాస్థం మయా తవ,|,
బంధుభావాదభిహితం భ్రాత్రు స్నేహచ్చ పార్థివ||, (63-32),
"" ఓ అన్నా! బంధుభావముతో ,ఆత్మీయతతో సోదరప్రేమతో నీ హితము కోరి ఇట్లు పరుషముగ పలికితినని రావణునికి నిర్భయముగ ధర్మార్థకామముల గురించియు త్రివిధ కర్మముల గురించి వివరించిన విధము సందర్భోచితమైనవిగ గమనించుకొన వలసిన విషయాలు.
రామాయణములో పైన కుంభకర్ణుడు చెప్పిన నీతులు కాలానుగుణముగ సంధర్భోచితములు.ఇక్కడ గమనించవలసిన విషయము హితముకోరువారు మంచి విషయములైన ఎదుటివారు ఎంతటివారైనను లోపాలను ఎత్తి చూపి సరియైన మార్గము సూచించవలసినదేయని రామాయణము మనకి హితవు పలుకుతంది.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment