*ఒకప్పుడు ఒక బావిలో ఒక కుక్క పడి చనిపోయింది. నీళ్ళు*
*కంపు గొడుతూ త్రాగడానికి పనికి రాకుండా పోయాయి. ఊరి పెద్దలు ఒక స్వామీజీని సలహా అడిగారు.*
*"వంద బిందెల నీళ్లు తోడి పోసేయండి, శుభ్రమైన కొత్త నీరు ఊరుతుంది."*
*గ్రామస్తులు స్వామీజీ చెప్పినట్లు 100 బిందెల నీళ్లు తోడి పోసేసారు. అయినా ఆ నీళ్ళు అపరిశుభ్రంగా కంపు కొడుతూనే ఉన్నాయి. మరో 100 బిందెల నీళ్లు తోడి పోసేసారు. అయినా నీళ్లు గబ్బు కొడుతూనే ఉన్నాయి. ఇంకో 100 బిందెల నీళ్లు తోడి పోసేసారు, అయినా కంపు పోలేదు. మళ్ళీ స్వామి దగ్గర మొరపెట్టుకున్నారు. "ఈ మూడు వందల బిందెల నీళ్లు తోడే ముందు చచ్చిన కుక్క శవాన్ని తీసేసారా !!!!" స్వామి అడిగాడు. "లేదు స్వామీ, మీరు వంద బిందెల నీళ్లు మాత్రమే తోడి పోసేయమన్నారు కదా" అన్నారు ఆ గ్రామీణులు.*
*(ఆలోచిస్తే, మనం కూడా, మన సమస్యలను ఇలాగే పరిష్కరించుకోవాలని చూస్తాం, అసలు మూలకారణం తెలుసుకోకుండా, దాని వలన ఉత్పన్నమౌతున్న పర్యావసానాలను తీర్చుకోవాలని చూస్తాం. మనం అందరి సలహాలు తీసుకుంటామే గానీ, మన మేధస్సుతో తార్కికంగా విశ్లేషించి, సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమై, ఇబ్బందుల పాలౌతాం.)*
No comments:
Post a Comment