🔔పురుషామృగం🔔
నారద మహర్షి సలహా ప్రకారం ధర్మరాజు
రాజసూయ యాగం చేయడానికి సంకల్పించాడు. అయితే ఆ యాగం చేయడానికి కావలసినంత
ధనం పాండవుల వద్ద లేదు.
భీమ,ఆర్జున , నకుల సహదేవులు నలుగురూ తలా ఒక దిక్కుకు ధనం సేకరించడానికి బయల్దేరారు.
ఉత్తర దిశగా
వెడుతున్న భీముణ్ణి
కృష్ణుడు పిలిచి.
" భీమా..కుబేరుని రాజ్యంలో ఒక మహత్తర పురుషా మృగం వుంది. అది
మానవ, మృగ రూపములతో విచిత్రంగా వుంటుంది.
అది సామాన్యంగా మానవుల కంట పడదు.
దానిని కళ్ళతో చూసిన వారు చాలా పుణ్యాత్ములు.
నీవు ఆ పురుషామృగాన్ని తీసుకునివస్తే, ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగం శుభప్రదంగా నెరవేరుతుంది." అని సలహా ఇచ్చాడు.
కృష్ణుడు సలహాను పాటించడానికి భీముడు ఉత్సాహంగా బయలుదేరేడు.
మార్గమధ్యలో భీముడు తనను ఎదిరించిన
కుబేరుని వంటివారిని జయించి
అధికమైన ధనాన్ని సంపాదించాడు.
రాజసూయ యాగ నిర్వహణలో సహాయపడేందుకు కావలసిన అంగబలాన్ని సమకూర్చుకునే యత్నంలో భీమునికి కుబేరుని ఉద్యానవనం
వనంలోని పురుషామృగం కనిపించింది.
వెంటనే కృష్ణుడు చెప్పిన విషయం గుర్తుకి వచ్చింది. పురుషామృగం కనిపించడం
ఒక ప్రక్క సంతోషంగా అనిపించినా , ఆ
పురుషా మృగం యొక్క విచిత్రమైన గంభీర
రూపాన్ని చూసి భీముడు కొంచెం భయపడ్డాడు. కాని కృష్ణుడు చెప్పాడన్న
ధైర్యంతో , మెల్లిగా పురుషామృగం దగ్గరకు
వెళ్ళి , రాజసూయ యాగం జయప్రదంగా జరగడానికి ఇంద్రప్రస్తానానికి వచ్చి సహకరించవలసిందిగా వేడుకున్నాడు.
పురుషా మృగం ఒక షరతు మీద భీమునివెంట వెళ్ళడానికి ఒప్పుకున్నది.
" భీమా.. నీవు నాకు
మార్గం సూచిస్తూ నా వేగానికి సమానంగా
నీవు పరిగెత్తుకుంటూ రావాలి. ఎట్టి పరిస్థితులలో నా చేతికి పట్టుబడకూడదు.
పట్టుబడితే వెంటనే చంపివేస్తాను. నాకు అడ్డురాకుండా పరిగెత్తాలి. ఎందుకంటే నేను సదా మనసా, వాచా,కర్మేణా పరమేశ్వర ధ్యానంలో వుంటాను.
నీవు ఏమాత్రం నా వేగంతో సమానంగా పరిగెత్తలేకపోయినా
అది నా ధ్యానానికి భంగం కలిగిస్తుంది. ముందుగానే
హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త" అని పలికింది.
భీముడు విస్మయం చెందేడు. పురుషామృగం యొక్క షరతుకి ఒప్పుకున్నాడు.
ముందు భీముడు పమ వెనుక పురుషా మృగం
పరుగు పందెం ఆరంభమైనది.
భీముడు శరవేగంగా పరిగెట్టేడు.
ఎప్పుడు పురుషామృగం తనను పట్టుకుంటుందో
అనే భయంతో భీముడు ఒక ఉపాయం పన్నాడు.
మెరుపులా ఒక రాయి తీసుకుని ,దానిని ఒక శివలింగంగా
భావించి, మంత్రం జపించి వెనుక వేపుకి విసిరాడు.
అది పడిన చోట ఒక శివాలయం, ఒక తీర్ధం
ఏర్పడినవి. అది చూసిన పురుషామృగం
వెంటనే తీర్ధం లో స్నానం చేసి, పరమశివుని పూజించినది. భీముడు మాత్రం అతి వేగంగా పరిగెడుతూనే వున్నాడు. మరల పురుషామృగానికి దొరికి పోయే పరిస్థితి వచ్చింది. మరల అంతకుముందులాగే
భీముడు మంత్రం జపించి మరో
రాయి విసిరాడు. అక్కడ ఒక శివాలయం
తీర్ధం నిర్మించబడినవి. పురుషామృగం అక్కడ కూడా తన పూజాపునస్కారాలు ముగించుకున్నది.
ఈవిధంగా
భీముడు ఇంద్రప్రస్ధం చేరేలోగా అనేక శివలింగ క్షేత్రాలు ఏర్పడ్డాయి.
చివరగా భీముడు ఇంద్రప్రస్థంలో ఒక కాలు పెట్టాడు.
మరొక కాలు బయట వున్నది.
ఆ కాలిని వెనుక వచ్చిన పురుషామృగం
పట్టుకున్నది.
ఇద్దరి మధ్యా ఘర్షణ ఏర్పడింది.
భీముడు తన వైపు న్యాయం చెప్పగా , పురుషామృగం తన వైపు న్యాయం
మాటాడింది. ఈ
సమస్య ధర్మరాజు వద్దకు వెళ్ళినది.
ధర్మరాజు న్యాయం చెప్పాడు. లోపలికాలు
భీమునికి సొంతమని. ....షరతు ప్రకారం వెలుపలి కాలు
పురుషామృగానికి సొంతమని ధర్మరాజు
తీర్పు చెప్పేడు. అది విన్న పురుషా మృగం సంతోషించింది.
" ధర్మరాజా !నీవు నీపేరుకు తగినట్లు నడుచుకున్నావు. నీ ధర్మనిరతికి సంతోషిస్తున్నాను. భీముడు తన కాలుని
నాకివ్వక్కరలేదు. వచ్చేమార్గం మధ్యలో
పరమశివుని పూజించుకునేందుకు
భీముడు నాకు అవకాశాలు కలిపించాడు.
నేను కేవలం పరీక్షించడానికే వాదించాను."
అని పురుషామృగం పలికి అక్కడ వున్న కృష్ణునికి సవినయంగా
నమస్కరించినది.
ధర్మరాజు ప్రారంభించిన రాజసూయ యాగం
సంపూర్ణమయ్యేదాకా, పురుషామృగం
చేసిన సహాయా సహకారాలకు
అంతేలేదు.
యాగం పరిసమాప్తి అయ్యాక పురుషామృగాన్ని భూలోకంలోనే నివసింపజేయాలని శ్రీకృష్ణుడు వైశంపాయనుడు,
ధౌమ్యుడు, భృంగి
కౌండిన్య మహర్షి వంటి మహర్షుల
అభిప్రాయాలు
తెలుసుకొని
కృష్ణ భగవానుడు పురుషామృగాన్ని తానే స్వయంగా
తిరువాదూరు తీసుకువెళ్ళేడు.
మునులందరూ వారి వెంట వెళ్ళేరు.
తిరువాదూరు లో శ్రీకృష్ణుడు పురుషామృగ స్థిర నివాసానికి , శివపూజలకు కావలసిన సకల ఏర్పాట్లు చేసేడు.
No comments:
Post a Comment