పవిత్రత
➖➖➖
*పవిత్రత ఎన్నడూ సోమరి జీవితంలోకి ప్రవేశించదు.*
*మనస్సు ప్రాపంచిక ఆలోచనలతో, భావాలతో పూర్తిగా నిండిపోతే అది దట్టంగా, భారంగా, స్పందించలేనిదిగా మారిపోతుంది.*
*మన మనస్సు మొద్దుగా, బరువుగా ఉంటే సాధన సమయంలో ఆధ్యాత్మిక భావాలు ఉదయించవు. జాగరూకతతో, ఆలోచనాపరులై ఉన్నవారి విషయంలో ఇది సంభవించదు. వారి ఉత్సాహం ఎన్నడూ సడలిపోదు. చివరి క్షణం వరకు వారు ఆధ్యాత్మిక సాధనలు విడిచిపెట్టరు. వారు ప్రతీ రోజూ, ప్రతీ కార్యాన్ని ఆధ్యాత్మికమయంగా మలచుకుంటారు.*
*మనం కూడా ఇలా చేస్తే మన పనులన్నీ ఉన్నతమైన ప్రేరణలతో నిండిపోతాయి. ఇది మన మనోదృక్పథం మీద, మన ఉత్సుకత మీద, మన అప్రమత్తత మీద ఆధారపడి ఉంటుంది.*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment