Sanathana Sarathi Telugu
Date of Publication 23rd June 2024
దైవానికి చెల్లించవలసిన 'ట్యాక్స్'
మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు 'థ్యాంక్స్' అంటాము. మరి అన్నివిధాలుగా మనకు సహాయపడుతున్న దైవానికి 'థ్యాంక్స్' చెబుతున్నామా? మనం కొనుక్కున్న స్థలంలోనే ఇల్లు కట్టుకుంటే 'హౌస్ ట్యాక్స్' కడుతున్నాము. నీరు వాడుకుంటే 'వాటర్ ట్యాక్స్' కడుతున్నాము. ఫ్యాన్ వేసుకుంటే కరెంటు ఛార్జి కడుతున్నాము. మరి పంచభూతాలను మనకు 'ఫ్రీ'గా అనుగ్రహించిన భగవంతునికేమి ట్యాక్స్ కడుతున్నాము? పైగా, 'భగవంతుడు నాకది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు' అంటాము. ఇచ్చినదానికే ట్యాక్స్ చెల్లించకపోగా ఇంకా ఏదో కావాలని ఆశించడం ఎంతటి దురాశ! ఇచ్చినదానికి ముందు 'ట్యాక్స్' కట్టాలి. దీనికే మహర్షులు 'బలి' అని పేరు పెట్టారు. కానీ, బలి అనగా ఏదో ఒక ప్రాణిని బలి ఇవ్వడమని ప్రజలు అపార్థం చేసుకున్నారు. బలి అనగా దైవానికి 'ట్యాక్స్' కట్టడం. ఏమిటీ ట్యాక్స్? ప్రార్థనతో భగవంతునికి కృతజ్ఞతలు తెల్పుకోవడమే. మన హృదయాన్ని దైవానికి అర్పితం చేయాలి. 'నాది అనేది ఏదీ లేదు. అంతా నీదే' అని శరణాగతి చేయడమే మనం ఇవ్వవలసిన ట్యాక్స్. అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా ఎత్తవలసిందే. ఇలాంటి 'ట్యాక్స్' ఇవ్వడానికి సిద్ధంగా లేము కానీ, భక్తులమని చెప్పుకుంటున్నాము. ఈ 'ట్యాక్స్’ ఇచ్చినప్పుడు భక్తి అనే డిగ్రీ మనకు లభిస్తుంది.
- శ్రీ సత్యసాయి
No comments:
Post a Comment