Sunday, July 14, 2024

*****పాల్ బ్రంటన్ ఇంగ్లాండు దేశస్థుడు.

 పాల్ బ్రంటన్ ఇంగ్లాండు దేశస్థుడు. నిజానికి ఇతర దేశీయులకు యోగులన్న పదమే తెలియదు. కానీ పూర్వపుణ్యమేదో ఉండటం వల్ల కాబోలు అతడి హృదయం భగవంతుడి గురించి సత్యాన్వేషణ సాగించేలా భారతదేశం వైపు పురిగొల్పడమేగాక, సరైన గురువును ఆశ్రయించి తాను బ్రంటన్. తరించాలన్న తపన ఒక మహాఋషి ఒడిలో పడవేసింది.ఆదిత్యయోగీ..
భారతేదేశంలోకి అడుగుపెట్టినది మొదలు క్షణం తీరిక లేకుండా ఆధ్యాత్మిక వ్యక్తులను కలుసుకోవడానికే తన సమయాన్ని వెచ్చించాడు. ఈ క్రమంలో ఆధ్యాత్మికవేత్తలను, స్వామీజీలను, గొప్ప గొప్ప యోగులను, యోగవిద్యలో ఆరితేరినవారినీ కలుసుకున్నాడు.
వీరితోపాటు పొట్టకూటి కోసం విద్యలు ప్రదర్శించే గారడీవాళ్ళను, సాధకులను, మనశ్శాంతి కోసం కాషాయం మధ్యలో...... కట్టినవాళ్ళను, తమకు తాము గొప్పవారమని ప్రకటించుకునే అమాయక స్వాములను కీర్తి కండూతితో, స్త్రీ వ్యామోహంతో, విలాసాలపై మోజుతో ఆధ్యాత్మికాన్ని అడ్డుపెట్టుకొని కాలం గడుపుతున్న మోసగాళ్ళను, కుహనా గురువులను కూడా కలుసుకున్నాడు.
ఎవరిని కలిసినా తన లక్ష్యం ఒక్కటే అనిర్వచనీయమైన ఆనందం శాశ్వతమయ్యేది ఎలా? మనిషి గమ్యమేమిటి? సత్యదర్శనం జరగడమెలా? -
ఇక్కడ ఈ భారతదేశంలో ఏదో ఆధ్యాత్మిక రహస్యం ఉన్నదన్న విషయం అవగతమవుతూ వస్తూన్నది. తర్కానికీ, మానవ మేథస్సుకు కూడా అందనిదీ, అతీతమైనదీ, మనిషిని ప్రశాంతత వైపునకు నడిపిస్తున్నదీ, మరణభీతి నుండి దూరం చేస్తున్నదీ ఏదో శక్తి ఉన్నదని పాల్ బ్రంటన్ హృదయానికి | అనిపిస్తూ, అట్టి స్థితిని అనుభవిస్తున్న యోగులు దర్శనానికి తహతహలాడుతూ అడుగులు వేయసాగాడు.
శ్వాసను బంధించి, శరీరాన్ని ప్రాణంతోనే నిలిపి ఉంచగలిగినవారినీ, యోగసాధకులను, స్వాములను దర్శించుకున్నాడు. అయినా మనిషికి ఆనందం ఇవ్వగలిగేది. మరేదో ఉన్నదని తలచి ముందుకు సాగిపోతూన్నాడు.
ఈ క్రమంలో మద్రాసు దగ్గరలో ఒక మౌనయోగిని కలుసుకున్నాడు పాల్ బ్రంటన్. కష్టపడి ఆయనను దర్శించుకొని తన సందేహాలు తీర్చుకునే అవకాశం కల్పించుకున్నాడు. బ్రంటన్ మాట్లాడుతూంటే, ఆ యోగి తనకిచ్చిన కాగితంపై పెన్సిలుతో వ్రాస్తూంటే, ఒక అనువాదకుడు ఇద్దరి మధ్యలో సంధానకర్తగా వ్యవహరిస్తున్నాడు. వారి సంభాషణ కొనసాగింది. మాటల
"యోగశాస్త్రంలో నిష్ణాతులైనవారు ఇంకా భారతదేశంలో మిగిలి ఉన్నారని విని, వారిని వెదుకుతూ బయలుదేరాను. నాకు ఈ విషయంలో ఏమైనా ఉపదేశించగలరా?" అభ్యర్థించాడు పాల్ బ్రంటన్.
"ఉపదేశించడానికి ఏముంది?" అని తమిళంలో వ్రాసివ్వగా, దానిని అనువాదకుడు చెప్పాడు.
"ఈ విశ్వమంతా సమస్యలతోనే నిండి ఉన్నది కదా!” అని ప్రశ్నించాడు బ్రంటన్.
మౌనయోగి ముఖంలో వ్యంగ్యంతో కూడిన చిరునవ్వు మెరిసింది. "నిన్ను నువ్వే సరిగా అర్థం చేసుకోలేనప్పుడు విశ్వాన్ని ఎలా అర్థం చేసుకోగలవు?" ఎదురు ప్రశ్న వేశాడు. మౌనయోగి.
“ఎక్కడ ప్రయత్నం చేయాలి?"
“ముందు నిన్ను నీవు తెలుసుకో. అప్పుడు మనస్సులోని మాట చెప్పగలిగే సాధకులను, అంతర్గతంగా ఉన్న సత్యమేమిటో బోధపడుతుంది.”
చనిపోయిన పక్షులను బ్రతికించగలవారినీ, గుండె పనిని “నాకు మాత్రం ఎటు చూసినా అజ్ఞాన జనిత నిలిపివేసి యోగముద్రలో ఉండిపోగలిగేవారినీ, చివరకు శూన్యమే ఎదురవుతున్నది.”
“అజ్ఞానమనేది నీ ఆలోచనల్లో మాత్రమే "ఉన్నది.....నీ ప్రస్తుత అజ్ఞానమంతా నువ్వు కల్పించుకున్నదే. ఇప్పుడు మళ్ళీ జ్ఞానం వైపు పయనించు. దానినే ఆత్మశోధన అంటారు. ఆలోచన అనేది అతడు. మనిషిని చీకటి గుహలోకి తీసుకెళ్ళే ఎడ్లబండి లాంటిది. ఆ బండిని వెనక్కి తిప్పి పయనిస్తే మళ్ళీ వెలుగులోకి వస్తావు.” బ్రంటన్ కు అంతా అయోమయంగా ఉంది.
“ఆలోచనలను అంతర్ముఖం చేయడమే అన్నిటికంటే. ఉన్నతమైన యోగం. అర్థమైందా?” మౌనయోగి మాటలు కొద్ది కొద్దిగా అర్థమవుతున్నట్లనిపిస్తున్నది బ్రంటను.
అయినా మరో ప్రశ్న సంధించాడు- “మహాశయా! ప్రపంచమంతా ఇప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తూన్నది. ఈ సమయంలో మీ వంటి వివేకులు ఈ విధంగా ఏకాంత సాధనలో మునిగిపోవడం ధర్మమేనా?”
ఈ ప్రశ్న మనకు అసందర్భంలా అనిపించినా, ఆ మౌనయోగి ఇలా సమాధానం ఇచ్చారు: “నిన్ను నీవే అర్థం చేసుకోనప్పుడు నన్ను మాత్రం ఎలా అర్థం చేసుకుంటావు? ఈ చర్చలన్నీ వ్యర్థమైనవి. యోగసాధన ద్వారా నీ అంతరంగ దర్శనానికి కృషి చేయి. ఈ విధమైన తీవ్రకృషి వల్ల నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది.”
"ఈ ప్రపంచానికి ఇప్పుడు లభిస్తున్న దానికంటే ఎక్కువ మార్గదర్శకత్వం అవసరం. దానిని శోధించి సాధించడానికి నేనేం చేయాలి?" మళ్ళీ ప్రశ్నించాడు బ్రంటన్.
“ముందు నీకు సత్యం అవగతమైతే, మానవాళికి సేవ చేయటానికి ఏమి చేయాలో నీకే తెలుస్తుంది. అలా సేవ చేసే శక్తి కూడా నీకు సమకూరుతుంది. పుష్పంలో మకరందమంటూ ఉంటే భ్రమరం ఎలాగైనా దానిని కనుగొంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానమూ, శక్తి పొందిన వ్యక్తి ప్రజలను వెతుక్కుంటూ వెళ్ళక్కరలేదు. వాళ్ళే అతని దగ్గరకు వస్తారు. ఇది అర్థమయ్యే వరకూ అంతరంగ శోధన సాగించు. ఇదొక్కటే చాలు. ఇతర ఉపదేశాలేమీ అక్కరలేదు”. మౌనస్వామి స్పష్టపరిచారు.

చివరిగా బ్రంటన్ తనకు ఏదైనా ఉపదేశమివ్వమని కోరాడు. ఆ మౌనయోగి అతడి తల మీదుగా శూన్యంలోకి కాసేపు చూసి "మీరు ఇక్కడకు రావడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. ఇదే నా ఉపదేశంగా స్వీకరించండి" అని వ్రాశారు.
ఆయన సమాధానం పూర్తయ్యేలోపే ఏదో అదృశ్యశక్తి వెన్నెముక ద్వారా శిరస్సులోకి ప్రవేశించిన అనుభూతికి లోనయ్యాడు.
మౌనయోగితో మాట్లాడేటప్పుడు మధ్యలో ఒక కాషాయవస్త్రాలు ధరించిన సాధువు ఒకరు "నీ ప్రశ్నలన్నింటికీ మా గురువుగారు సమాధానం చెప్పగలరు”. అని చెప్పినప్పటికీ అతడిని బ్రంటన్ పట్టించుకోలేదు.
బ్రంటన్ మౌనయోగి దగ్గర నుండి కానీ పాల్ వెలుపలికి వచ్చిన తర్వాత అతడు (సాధువు) మళ్ళీ కలుసుకొని మాట్లాడసాగాడు. ఇష్టం లేకుండానే బ్రంటన్ మాట్లాడసాగాడు. ఆ సాధువు తన మాటల్లో తన గురువు. అరుణాచలంలో ఉంటాడని, వచ్చి దర్శించుకోమని, శాశ్వత సత్యం గురించి జ్ఞానం ఆయన దగ్గర కలదనీ చెప్పాడు.
కానీ అతడి పట్ల మొదటి నుంచీ విముఖత కలుగుతోంది బ్రంటన్కు. తాను ఈశాన్య భారతానికి వెళుతున్నట్లు, తన నిర్ణయం మార్చుకునేది లేదని గట్టిగా చెప్పి తన మకాం చేరుకున్నాడు.
ఆ తర్వాత వెంకటరమణి అనే రచయితయైన స్నేహితుని ప్రేరణతో ఇరువురూ చెంగల్పట్టులోని శ్రీశంకరమఠం చేరుకొని, శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతీస్వామిని దర్శించుకున్నారు.
శ్రీమహాస్వామివారు ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థాయిలో ఉండి కూడా సాధారణత్వాన్ని అంటిపెట్టుకున్న ఒక విశిష్టవ్యక్తిగా అర్థమైంది వారిరువురికీ.
శ్రీమహాస్వామికీ, వారికీ మధ్య కొంతసేపు సంభాషణ సాగింది. ఆ సంభాషణలో కొంత చూద్దాం...
........ ఈ రోజున ప్రపంచమంతా వ్యాపించిన దుఃఖమూ, దారిద్ర్యమూ చూస్తే ఆ భగవంతుడి ఉదాసీనత తప్ప మరేమీ కనిపించడం లేదు” నిరాసక్తగా, వ్యంగ్యముగా అన్నాడు పాల్ బ్రంటన్.
“ఓర్పు గలవారే సత్యాన్ని దర్శించగలరు. తగిన సమయం వచ్చినప్పుడు భగవంతుడు మానవులకు మంచి బుద్ధిని కల్పిస్తాడు. దేశాల మధ్య విద్వేషాలూ, మనుషులలో దుర్బుద్దీ, లక్షలాది ప్రజల దారిద్ర్యమూ... ఇవి ఉధృతమైనప్పుడు వీటికి విరుగుడుగా భగవత్ప్రేరణా, భగవదాదేశమూ పొందిన వ్యక్తి తప్పకుండా ఉద్భవిస్తాడు...."మహాస్వామి చెప్పారు.వారి మధ్య సంభాషణ సాగుతూనే ఉంది. అనంతరం పాల్ బ్రంటన్ తన అన్వేషణ గురించి మహాస్వామివారికి వివరించి చెప్పారు. అతడికి మద్దతు ఇస్తూ మహాస్వామివారు "నీ యాత్రను కొనసాగించు. యాత్ర పూర్తయ్యాక నువ్వు కలిసిన యోగులూ, మహనీయులూ అందరి గురించీ ప్రశాంతంగా ఆలోచించు. వారిలో నీ మీద గాఢమైన ప్రభావం చూపినవారెవరో గుర్తించు. తిరిగి ఆయన వద్దకు వెళితే ఆయన నీకు సరైన ఉపదేశమివ్వగలరు.
ఒకవేళ ఎవరూ ప్రభావం చూపకపోతే, అప్పుడు భగవంతుడు స్వయంగా ఉపదేశమిచ్చేవరకు నీ అన్వేషణ కొనసాగించు. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ, ప్రేమ నిండిన హృదయంతో శాశ్వతానందాన్ని గూర్చి విచారణ చేస్తే, ఆత్మ గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా. గమ్యం చేరుతావు" అన్నారు.
మహాస్వామివారి మాటలే ఆశీస్సులు మరి!
ఈ అన్వేషణలో విఫలమైతే తానేం చేయాలి అనడిగాడు పాల్ బ్రంటన్. అందుకు మహాస్వామివారు "గురువును ఆశ్రయించడం అవసరం" అని చెప్పారు. అంతేగాక శిష్యుల కోసం సమయం వెచ్చించగల గురువులు ప్రస్తుతం శరీరంతో ఇద్దరున్నారు. ఒకరు కాశీలో ఉండగా, ప్రకాశిస్తోంది. మరొకరు దగ్గరలోనే ఉన్న అరుణాచలంలో ఉన్న రమణమహర్షి" అని తెలిపారు.
అరుణాచలం పేరు వినగానే మౌనయోగి దగ్గర కలిసిన సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి బ్రింటన్కు.
తాను దక్షిణ భారతదేశం వదలి ఈశాన్య భారతావనికి వెళుతున్నట్లు బ్రంటన్ మహాస్వామివారికి చెప్పాడు.
మహర్షిని కలిసిన తరువాతనే వెళ్ళమని స్వామి అతడి నుండి హామీ తీసుకొని ఆశీస్సులందించారు.
పాల్ బ్రంటన్న, అతడి స్నేహితుడిని ఇరువురినీ సాగనంపుతూ ద్వారం వరకూ వచ్చారు మహాస్వామివారు. కొద్దిగా ఆగి అతడి స్నేహితుడి చెవిలో రహస్యంగా ఏదో చెప్పారు. వీడ్కోలు అందించారు. మహాస్వామివారు.
పాల్ బ్రంటన్ తిరిగి అర్థరాత్రికి మద్రాసులోని తన మకాం చేరాడు. ఇంటి వరండాలో మెట్లపై మౌనయోగి దగ్గర కనిపించిన సాధువు పడుకొని యున్నాడు. అతడి పేరు సుబ్రమణ్యం. ఆశ్చర్యంతో అతడితో మాట్లాడి, అతడు చెప్పిన అరుణాచలంలోని అతడి గురువుగారు, ఇంతకు మునుపు చంద్రశేఖరేంద్ర స్వామివారు చెప్పిన యోగి ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకున్నాడు బ్రంటన్.
మరుసటిరోజు అతడితో కలిసి అరుణాచలం వెళ్ళేందుకు బ్రంటన్ సిద్ధమయ్యాడు. ఇరువురూ నిద్రలోకి జారుకున్నారు.


కొంత సమయం తరువాత పాల్ బ్రంటను హఠాత్తుగా మెలుకువ వచ్చింది. గదంతా చిమ్మచీకటిగా ఉంది. వాతావరణంలో ఏదో మార్పు. అతడిలో ఉద్విగ్నత నిండింది. ఏదో అదృశ్యశక్తి చుట్టూ ఆవరించినట్లుగా ఉంది. దిండు క్రింద నుంచి గడియారం తీసి చూస్తే, సమయం 2.45 అయింది. పరుపు చివర మెరుస్తూ ఏదో ఆకారం కనబడుతోంది. అతడు పైకి లేచి కూర్చొని దగ్గరగా చూడగా, ఎదురుగా చంద్రశేఖరేంద్ర స్వామివారు. అప్పుడు తానేమీ భ్రమ చెందడం లేదు. అప్పుడు స్వామివారి చుట్టూ ఆవరించియున్న అద్భుత కాంతి చీకటిలో మరింతగా ప్రకాశిస్తోంది  కానీ ఇదెలా సాధ్యమని బ్రంటన్ ఆలోచిస్తున్నాడు. మహాస్వామివారి సన్నిధి అతడికి ఎంతో హాయినిస్తోంది. స్వామివారికి నమస్కరించాడు బ్రంటన్. ఆయన చిన్నగా నవ్వుతూ ఉన్నారు. "వినమ్రుడిగా ఉండు. నువ్వు ఆశిస్తున్నది లభిస్తుంది” అని ఆయన చెప్పినట్లు అనిపించింది. కొద్దిసేపటిలోనే ఆయన రూపం అదృశ్యమైంది.ఆదిత్యయోగీ..
ఈ అలౌకిక దృశ్యం అతడిలో ఉత్తేజాన్ని, సంతోషాన్ని కలిగించింది. అరుణాచల ప్రయాణానికి హృదయం తొందర పెట్టింది. అరుణాచలం చేరుకున్నాడు పాల్ బ్రంటన్.
అరుణాచలంలోని భగవాన్ శ్రీరమణమహర్షి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు బ్రంటన్. మహర్షి ఉండే గదికి చేరాడు. సుమారు 20మంది భక్తులు ఒక మూలవైపు చుట్టూ కూర్చోగా ఎదురుగా దివానుమీద రమణులు కూర్చొని
యున్నారు. ఆయన ప్రక్కనే ఉన్న కిటికీలోంచి స్థిరంగా బయటకు శూన్యంలోకి చూస్తూ ఉన్నారు.
బ్రంటన్ దగ్గరకు వెళ్ళి నమస్కరించుకున్నాడు.
మహర్షి నిశ్చలంగా, విగ్రహంలా ఉన్నారు. అందరూ మౌనంగా ఉన్నారు. తనను అనలు మహర్షి పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది అతడికి. ఆయననే చూస్తూ కూర్చున్న పాల్ బ్రంటన్ కు సుమారు రెండు గంటల తరువాత తనలో నిశ్శబ్ధంగా జరుగుతున్న మార్పును గమనించాడు. ఏవేవో అడగాలనుకున్న ప్రశ్నలు మనస్సులో నిలవడం లేదు. కారణం - ప్రశాంతత, ఆనందం అతడిని పూర్తిగా ఆవరించాయి.
గురువును చేరిన అతడి మనస్సు పూర్తిగా లయించింది....
.
*_మనం భగవంతునికి సమర్పించవలసినది మనలో ఉండిన చెడునే! ఫలితముగా తిరిగి  మనకు మంచిని ఇస్తాడు. నూనెలో తడిసిన వంద రూపాయల నోటును తీసుకోవడానికి ఒక కూలీ కూడా అంగీకరించడు.  కానీ మనం ఆ నోటును రిజర్వ్ బ్యాంక్‌లో అప్పగిస్తే, వారు దానికి బదులుగా తాజా నోటును ఇస్తారు. మనలో ఎన్నో పనికిరాని, చెడు అలవాట్లు ఉన్నాయి. చెడు ఆలోచనలు కలిగి ఉంటున్నాము. ఈ ప్రపంచంలో ఉన్నవారెవరూ వాటిని అంగీకరించరు. చెడుగా ఉంటే మన తల్లిదండ్రులు, బందువులు కూడా మనతో సుఖంగా ఉండలేరు. మనకోసం చెడు ఫలితాన్ని స్వీకరించడానికి సిద్ధపడిఉండలేరు! అయితే మన చెడు ఆలోచనలు మరియు చెడు ప్రవర్తనలన్నింటినీ స్వీకరించడానికి, అంగీకరించడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.  చిత్తశుద్ధితో ఆయనను నమ్మి మనలో ఉండిన చెడును అయనకు ఇచ్చి, మన భారం ఆయనదే అని బావించినపుడు బదులుగా పవిత్రమైన ఆలోచనలను, భావాలను మనకు ప్రసాదిస్తాడు. నాకు నీవు తప్ప మరో దిక్కు ఎవరూ లేరని వేడుకున్నపుడు కంటికి రెప్పవలే రక్షణ కల్పిస్తాడు......

#vikram








No comments:

Post a Comment