Thursday, July 11, 2024

****ఎరుకతో జీవనం ఎప్పుడూ

 ఆధ్యాత్మికతను జీవితములో విడతీయలేని భాగముగా ఎప్పుడు భావించుకుంటామో - అప్పుడు అక్కడనుండి మన జీవన విధానం మొత్తం ఆధ్యాత్మిక సాధనే అవుతుంది. ఎందుకంటే మన అంతరంగాన్ని గమనిస్తూ మనము జీవించటం మొదలవుతుంది. మన ప్రతి ఆలోచన, మన ప్రతి కదలిక, మన సంపూర్ణ ఎరుకతో ఉంటుంది.ఈ ఎరుకలో మనము కేవలము మంచిని మాత్రమే ఆచరించగలిగితే అది సాధనామయ జీవితమే. ముందు మన హృదయములో ఆధ్యాత్మికత - భౌతికము వేరు వేరు కాదు అన్న దృఢ భావన స్థిరపడాలి. అప్పుడు మొత్తముగా లోపల బయట ఒకేసారి గమనిక ఏర్పడుతుంది. ఆ గమనికే ఎరుక. ఎరుకతో జీవనం ఎప్పుడూ సవ్య దిశలోనే సాగుతుంది. ఎరుక లేనప్పుడు - బయటి స్పృహ మాత్రమే వున్నప్పుడు ఆపసవ్య దిశలో ప్రయాణిస్తాము.

No comments:

Post a Comment