*స్టేటస్ .. హంగు .. ఆర్బాటం !*
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక జిల్లా విద్య శాఖాధికారి, నిన్న మండల విద్య శాఖాధికారుల సమావేశం లో మాట్లాడుతూ... " ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా అడ్మిషన్స్ తీసుకొనే విద్యార్థుల సంఖ్య... గత ఏడాదితో పోలిస్తే... సగానికి పడిపోయింది ... అడ్మిషన్స్ కోసం నేనే ఇల్లిల్లూ తిరుగుతాను "
- పత్రికల్లో వార్త !
అయ్యా ! డీఈఓ గారు !
మీ చిత్తశుద్ధి బాగుంది . కానీ ఇల్లిల్లూ తిరిగితే ... అడ్మిషన్స్ రావు మాస్టారూ !
మీరేమి చేసినా ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతూనే ఉంటుంది . సమాజాన్ని అర్థం చేసుకోలేక పొతే ఎలా ?
ఇప్పుడు దేశమంతా , ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ నడుస్తోంది .
కరోనా తరువాత ఇది బాగా ఉదృతమయ్యింది .
ఊర్ధ్వ ముఖపు వలసలు !
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.... ప్రైవేట్ బడ్జెట్ { అంటే నెలకు వెయ్యి.. రెండు వేలు ఫీజు ఉన్న} పాఠశాలలకు వలస పోతున్నారు .
బడ్జెట్ పాటశాలల విద్యార్థులు... కార్పొరేట్ మిడ్ బడ్జెట్ ... అంటే నెలకు మూడు నాలుగు వేల ఫీజు ఉన్నవాటికి ...
మిడ్ బడ్జెట్ పాఠశాలల వారు... హై బడ్జెట్ సిబిఎస్సీ పాటశాలలకు ...
సిబిఎస్సీ వారు... కేంబ్రిడ్ కరికులం పాఠశాలలకు ...
కేంబ్రిడ్ పాఠశాల వారు ఐబీ కి ..
ఐబీ వారు హై ఎండ్ సెవెన్ స్టార్ పాఠశాలలకు వలస పోతున్నారు .
తమ పిలల్లు చదివే పాటశాలల ఫీజు , అక్కడ ఉన్న హంగు ఆర్భాటాలు తమ స్టేటస్ కు సూచిక అని... ఆధునిక తల్లితండ్రులు ... అంటే కరోనా వాక్ సీన్ వేసుకొన్న ప్రతోడు భావిస్తున్నాడు .
దీన్ని ఎవడూ ఆపలేడు.
దౌర్బాగ్యమిటంటే ఈ ట్రెండ్ గురించి మేధావుల్లో కనీస అవగాహన లేదు . అందుకే పాపం డీఈఓ గారు ఇల్లిల్లూ తిరుగుతాను అని చెబుతున్నారు .
ప్రభుత్వ పాఠశాలలు చేసిన పాపమేమి ?
విద్య బాగోదా?
నిజమే... ఇక్కడ
నూటికి తొంబై శాతం ప్రైవేట్ పాటశాలలకంటే నాణ్యమయిన విద్య ప్రభుత్వ పాటశాలల్లో అందుతోంది .
మరి సమస్య ఏమిటి ?
చదువు నాణ్యత ఎవడికి కావాలిరా ?
ప్రభుత్వ పాటశాలల్లో విద్య ఉచితంగా వస్తుంది ... అదే సమస్య .
ఫ్రీ గా వచ్చే చదువు చెప్పించడమంటే నామోషీ .. తల కొట్టేసినంత పని .
ఎంత ఫీజు అయితే అంత గొప్ప !
హంగు ఆర్భాటాలే ముఖ్యం !
హైదరాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ పాటశాలలో ఒకటో తరగతి ఫీజు నాలుగు లక్షలు . " వామ్మో .. నాలుగు లక్షలే!... ఏదో లెండి .. బాగా డబ్బున్న మా రాజులు చేర్పిస్తారు... అనుకొంటున్నారా ? ఆ పాఠశాలకు రెండు బ్రాంచెస్ వున్నాయి . రెంటిలో కలిపి మొత్తం ఆరు వేల మంది విద్యార్థులు !
ఒకటో తరగతికి నాలుగు లక్షల ఫీజు కట్టే పేరెంట్స్ ఇంతమందా ?
ఆ ఒక్క పాఠశాల్లో ఆరువేలు . అలాంటి అన్ని పాఠశాలల్లో మొత్తం లక్ష మంది కి పైగా .
అప్పుడే కళ్ళు బైర్లు కమ్మితే ఎలా .. పోస్ట్ లో ఇంకా చదవాల్సింది చాలా వుంది .
హైదరాబాద్ లో అదొక గేటెడ్ కమ్యూనిటీ . ఇద్దరు మహిళల సంభాషణ .
" మా వాడిని ఫలానా స్కూల్ లో చేర్పించాము . ఫీజు రెండు లక్షలు ".... గొప్పలు పోతూ ఒకావిడ !
చాల్లే సంబడం... నీ ముఖం చూడు అన్నట్టు ముఖం పెట్టి మరో ఆవిడ " జస్ట్ టు లాక్స్? అదేంటి బాబీ? . మరీ ఇంత కక్కుర్తి ? మా వాడి ఫీజు నాలుగు లక్షలు . ఒకటో తరగతిలోనే గుర్రపు స్వారీ నేర్పుతారు తెలుసా ?"
ఒకటో తరగతి పిల్లాడు గుర్రపు స్వారీ ఏమి చేస్తాడు ? అని ఆలోచించే తత్త్వం ... కోవై షీల్డ్ పుణ్యమా అంటూ చచ్చింది .
ఇప్పుడిక ... తన బిడ్డను కూడా నాలుగు లక్షల ఫీజు పాఠశాలలో చేర్పించేవరకు... ఆమె తన హస్బెండ్ గారిని రాత్రిళ్ళు పస్తులు పడుకోబెట్టేస్తుంది . కాదు... కూడదంటే... విడాకులు .
నలుగురితో గొప్పలు చెప్పు కోవాలి అంతే.. అంతకు మించి ఆలోచించే తెలివి , సహనం ఎవరికీ లేదు .
హైదరాబాద్ గల్లీ నుంచి పల్లె దాక ఇప్పుడిదే !
ఇరవై ఎకరాల పాఠశాల ! గుర్రపు స్వారీ .. పోలో .. రగ్బీ .. ఐస్ హాకీ .. ఫెన్సింగ్ ..
ఫార్మా కింగ్ గారి కోడలు .. నిన్నటి హీరో గారి కొడుకు .. స్టార్ ఆసుపత్రి బారన్ గారి మనవరాలు / మనవడు .. డబ్బున్న ప్రతోడు .. ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడం .. పదెకరాల .. యాభై ఎకరాలు .. వంద ఎకరాలు .. రెండేళ్లలో ఫుల్ .. ఓపికుంటే కాలక్షేపానికి ఇంకేదీ పని లీకుంటే నడుపుతారు . లేకుంటే వెయ్యో.. రెండు వేల కోట్లకు ఫారీన్ కంపెనీకి అమ్మేస్తారు .
హైదరాబాద్ లో కొత్తగా ప్రారంభించిన స్కూల్ లో అడ్మషన్ ఫీజు యాభై లక్షలు .
అవునండీ అక్షరాలా అరకోటి .
దీని తలదన్నేలా ఇప్పుడు మరో రెండు మూడు పాఠశాలలు రానున్నాయి .
క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందా ?
ఎవడ్రా వీడు ?
మళ్ళీ అదే సుత్తి ప్రశ్న . ఇందాకే చెప్పగా .. క్వాలిటీ ఎవడికి కావాలి ?
"బాబీ నీకు తెలుసా ?మా వాడి స్కూల్ లో స్మార్ట్ బోర్డు . టీచర్ పాఠం చెబుతుందా లేదా అనేది... ప్రిన్సిపాల్ తన సీట్ నుంచి లేవకుండా మానిటర్ ద్వారా తన రూమ్ నుంచే చూస్తుంది "
ఒక హై రైస్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ హాల్ లో ఉబుసు పోక గొప్పలు .
పాఠం ఎప్పటికప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కావాలంటే ప్రతి తరగతి గదిలో పవర్ఫుల్ వైఫై ఉండాలి . రేడియేషన్ .
స్కూల్ లో ఉన్నంత సేపు ప్రతి బిడ్డ మెదడు రోస్ట్ అయిపోతుంది .
చిన్న పిల్లల స్టార్ ఆసుపత్రికి పోయి .. ఇటీవలి కాలం లో బ్రెయిన్ కాన్సర్ తో ఆసుపత్రిలో చేరిన పిల్లల సంఖ్య ఎన్ని రెట్లు పెరిగింది? అని ఒక్కడంటే ఒక్కడూ అడగరెందుకో ???
మోడరన్ ట్రెండా? నీ పిండాకూడా ? ఫ్రాన్స్... రష్యా .. పాటశాలల్లో వైఫై ని దాదాపు బాన్ చేసాయి . అమెరికా ఇంకా నిద్దుర లేవలేదు . వాడు లేసేటప్పటికి ... నీ వాక్ సీన్ బుర్రకు అర్థం అయ్యే టప్పటికి జరగరాని ఘోరం జరిగిపోతుంది .
సెట్ నుంచి లేవకుండా ప్రిన్సిపాల్ తన సీట్ లోనే కూర్చుంటే ఆమెకు త్వరలో వెరికోస్ వీన్స్ ఖాయం .
" మీ స్కూల్ లో ఇంకా టీచర్స్ నోటి తో పాటలు చెబుతారా? బ్రో . మా స్కూల్ లో అయితే మొత్తం వీడియో పాఠాలు" హైదరాబాద్ లో ఒక పోష్ క్లబ్ లో మందు పార్టీ లో నవ యుగపు తండ్రి స్టేటస్ డిక్లరేషన్ .
వీడియో పాఠాలు అవసరమే . కంప్యూటర్ ల్యాబ్ లో వైఫై కూడా అవసరం . కానీ ప్రతి పాఠాన్ని వీడియో ద్వారా చూపితే పిల్లల సృజనాత్మక శక్తి చస్తుంది . ఆలోచనల్లో వైవిధ్యత లోపిస్తుంది .. కాల్పనికత బలహీన పడుతుంది .
ఈ న్యూరో సైన్స్ సత్యాలు .. సింగల్ మాల్ట్ డాడీ కి తెలియదు . ఎవడైనా చెప్పినా .. వినడు . పైగా నిజం చేప్పిన వాడినే అనుమానిస్తాడు .
" నూటికి తొంబై అయిదు మందికి కరోనా సోకింది . ఒక సారి సోకితే టి సెల్స్ రక్షణ వచ్చినట్టే . అంతకు మించిన వాక్సిన్ ఏదీ లేదువాక్ సీన్ వద్దు అని నెత్తి నోరు కొట్టుకొని చెబితే విన్నారా ??
" వీడు .. వీడి మొఖం" .. అనుకొని లగెత్తుకొని వేసుకొన్నారు .
వాక్ సీన్ కు సంభందించిన సింపుల్ సైన్స్ అర్థం కాని ముఖాలకు న్యూరో సైన్స్ అర్థం అవుతుందా ?
చెప్పేవాడు సన్నాసి అయినా అయివుండాలి ! లేదా పనీ పాటలేకుండాలి !
" బ్లాక్ బోర్డు .. చాక్ పీస్ .. నోటు పుస్తకం .. పెన్ను పెన్సిల్ .. బ్రో ! ఇంకా ఏ కాలం లో వున్నావు ? ఇది నయా తరం .. కాలం మారింది . నువ్వు ఇంకా రాతి యుగంలో ఉంటే ఎలా ?
ఇప్పుడు స్మార్ట్ బోర్డు . లాప్ టాప్"..
.. అని గొప్పలు పొయ్యే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నయా డాడీ కి " అరేయ్! వాక్ సీన్ వెర్రి పుల్కా ! టీచర్ చాక్ పీస్ { అది డస్ట్ లెస్ అయితే మంచిది } తో రాస్తే చేతి రాత చక్క గా... అందంగా వస్తుంది . దాన్ని చూసి పిలల్లు నేర్చుకొంటారు . వారి చేతిరాత అందంగా తయారవుతుంది . స్మార్ట్ బోర్డు అవసరం అయిన చోట వాడాలి . నిజమే .. కానీ అది ఫాషన్ స్టేటమెంట్ కాదురా .. చేతితో రాస్తే .. ఐ - హ్యాండ్ కోఆర్డినేషన్ ... న్యూరో మాస్కులర్ అభివృద్ధి , లోతైన అవగాహన , సృజనాత్మకత... ఇలా ఎన్నో ఎన్నెన్నో లాభాలు .. ఇది న్యూరో సైన్స్ అని చెప్పేది ఎవరు ?
ఎవడ్రా అలాగా జనం ?
పిల్లల్ని ప్రభుత్వ బడ్జెట్ పాటశాలల్లో చేర్పిస్తే అలాగా జనాలు .. వీరి కంపెనీ తో మన పిల్లాడు పాడై పోతాడు" ఇదీ అధిక శాతం తల్లితండ్రుల ఆలోచనలు .
సంవత్సరానికి నాలుగు నుంచి ఇరవై లక్షల ఫీజు ఉన్న పాఠశాలలోకి ఎవరు వస్తున్నారు ?
అమ్మ నాన్న ఇద్దరు .. పని నుండి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పదకొండు . ఈ లోగా పిల్లోడు స్నాప్ చాట్ ఇంస్టాగ్రామ్ వాట్సాప్ .. రెండో తరగతిలోనే మిడిల్ ఫింగర్ ని చూపడం ప్రతి మాటను ఎఫ్ అనే పదంతో ప్రారంభించడం నేర్చుకొంటాడు . స్కూల్ కొచ్చి నీ బిడ్డ కు నేర్పుతాడు .
హవాలా వ్యాపారి .. కేసినో కింగ్ .. రాజకీయ నాయకులకు బ్యూరాక్రాట్స్ కు రాత్రి ఏర్పాట్లు చేసి.. డీల్స్ కుదిర్చి కోట్లు గడించిన బ్రోకర్ .. చదువు సంద లేకున్నా రియల్ ఎస్టేట్ లో కోట్లు గడించి రెండు మూడు ఫామిలీ లు సెట్ అప్ చేసిన మహారాజు . ఇంట్లో పిల్లల కెదురుగా మందు... దమ్ము కొట్టే తల్లి ..
ఆగండాగండి . అందరూ ఇలాంటోళ్లే అనడం లేదు . పాపం కష్టపడి పిల్లలకు మంచి విద్య నందించాలి అనుకొంటున్న తల్లితండ్రులు వున్నారు .
కానీ క్లాసుకు ఇద్దరు ముగ్గురు పిల్లలు పైన చెప్పిన పోరంబోకు .. పాపిష్టి సొమ్ము కుటుంబాల నుండి ఉంటే చాలు .. మొత్తం క్లాసును ను చెడగొట్టేస్తారు .
పిల్లలు తమ స్నేహితుల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతారు .
అదొక ఇంటర్నేషనల్ స్కూల్ . అక్కడ ప్రతి క్లాస్ కు స్మార్ట్ బోర్డు .
పిలల్లు టీచర్స్ ను రిక్వెస్ట్ చేసి .. రిక్వెస్ట్ కాదు .. అదొక రకం బ్లాక్ మెయిల్ .
తాము చెప్పింది చేయక పొతే టీచర్ బాగా పాఠం చెప్పలేదనో... తిట్టాడనో ఇంట్లో చెబుతారు . పాపం టీచర్ కు ఉద్యోగం ఊడుతుంది . కాబట్టి వారు చెప్పింది వినాల్సిందే....
" సార్ ఎంత సేపు పాఠం చెబుతారు సార్ ! ఈ ట్రేడింగ్ పాట వెయ్యండి సార్ " అని... క్లాస్ రూమ్ లో ట్రేండింగ్ పాట చూస్త్తూ డాన్స్ చేస్తారు . వాటర్ బాటిల్ లో తెచ్చుకొన్న వోడ్కా తాగేవారు .. బాత్ రూమ్ కు వెళ్లి హుక్కా కొట్టే వారు .. జ్వరం పేరుతొ తెచ్చుకొన్న టాబ్లెట్స్ మాటున ఉన్న డ్రగ్ తీసుకొనే వాడు .. ఇంకా చాలా చాలా నేరాలు ఘోరాలు !
సో బ్యూటిఫుల్ .. సో ఎలిగంట్.. జస్ట్ లైక్ ఏ వావ్!
*ఇదే నేటి కరోనా అనంతర మానవ జాతి !*
No comments:
Post a Comment