Saturday, July 20, 2024

మనలోనే ఉన్న దైవాన్ని(పరమాత్మ) తెలుసుకోవడం ఎలా!?....

 *🕉️🙏మనలోనే ఉన్న దైవాన్ని(పరమాత్మ) తెలుసుకోవడం ఎలా!?....*🕉️🙏



*🕉️🙏"మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు.*
 *మనోమూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది.🕉️🙏"*

*🕉️🙏దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని*
*లోపల ఆత్మయే దైవం.*🕉️🙏  

*🕉️🙏"పరమాత్మ ను చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు".🕉️🙏*

 *🕉️🙏దీనిని బట్టి మనకి తెలుస్తుందేమిటంటే పరమాత్మ మన హృదయంలోనే ఉన్నాడు.* 🕉️🙏

*🕉️🙏కానీ మనకి కానరావడం*
*లేదు.*🕉️🙏

*🕉️🙏ఎందుకనీ?*🕉️🙏

*🕉️🙏మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన.!*🕉️🙏

*🕉️🙏మనలో ఉన్న పరమాత్మ కనబడకపోవడానికి ప్రధాన*
*కారణాలు రెండే రెండు తలంపులు!*🕉️🙏

*🕉️🙏మొదటిది ' నేనే ' అనే తలంపు*
*రెండవది ' నాది' అన్న తలంపు.*🕉️🙏

*🕉️🙏"మొదటిది అహంకారం, రెండవది మమకారం!"*🕉️🙏

*🕉️🙏ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు పరమాత్మ అవుతాడు .*🕉️🙏

*🕉️🙏మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ* *పరమపవిత్రుడుని*
*పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి..*🕉️🙏

*🕉️🙏ఎలా?*🕉️🙏

*🕉️🙏ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని ఒకటే.* *అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని* *శుభ్రపరిచి అన్నీ శుద్ధి*
*చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం.*🕉️🙏

*🕉️🙏ఈ రీతిలోనే హృదయమునందున్న పరమాత్మ ని అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను తొలగించాలి.*🕉️🙏

*🕉️🙏అజ్ఞానమును నిర్మాల్యమును తీసేయాలి.*🕉️🙏

*🕉️🙏ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి.🕉️🙏*

*🕉️🙏అంటే..కర్తృత్వ భావనను తొలగించుకోవాలి.*🕉️🙏

*🕉️🙏మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరుఅడ్డంకులు ఉన్నాయి.*🕉️🙏

 *🕉️🙏వాటిని తొలగించాలి.🕉️🙏*

*🕉️🙏సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదవగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు.*🕉️🙏

 *🕉️🙏"శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది."🕉️🙏*

*🕉️🙏మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి.* 🕉️🙏

*🕉️🙏మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే, మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం.* 🕉️🙏

*🕉️🙏మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం.*🕉️🙏

*🕉️🙏మనలో అనేక బలహీనతలుంటాయి. అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.*🕉️🙏

 *🕉️🙏హృదయంలో పరమాత్మ ఉన్నాడని తెలిసినా దానిని గురించి ఆలోచించం.*🕉️🙏

*🕉️🙏ఇదే మాయ.*🕉️🙏

*🕉️🙏శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వక ముందే హృదయమందున్న పరమాత్మ ని పట్టుకోవాలి.*🕉️🙏

 *🕉️🙏మానవుడు "ఆనందము"ను అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి.* 🕉️🙏

*🕉️🙏"అవి ఒకటి ప్రేమ, రెండుజ్ఞానం."*🕉️🙏

 *🕉️🙏ఈ రెండు ఉన్నప్పుడే "ఏకత్వస్థితి" వస్తుంది. 🕉️🙏*

No comments:

Post a Comment