Thursday, July 25, 2024

 *బడ్జెట్...*

చినుకులకు తడిసిన గుడిసెది 
ఓ బడ్జెట్...
గుడిసె నుంచి ఎదిగిన రేకుల షెడ్‌డి
ఓ బడ్జెట్...
రేకుల షెడ్‌ నుంచి మొలిచిన సిమెంటు ఇంటిది ఓ బడ్జెట్...

తినడానికి లేనివాడికి తిండి వెతుక్కోవడానికే
*శ్రమ బడ్జెట్...*
తిండి కలిగినోడికి దండిగా చదువుకోవడానికే 
*పీజుల బడ్జెట్...*
స్వేచ్ఛపరుడికి వ్యాపారపు వృద్ధికే
*పెట్టుబడి బడ్జెట్...*
*నేలనే నమ్మి ఉన్నది మట్టిలో వేసి*
*అన్నం పెట్టేవాడికి ప్రకృతి పరిస్థితుల అనుకూలతే ఆశల బడ్జెట్...*

ఉన్నోడికి ఓలా
లేనోడికి మరోలా
మధ్యతరగతి వాడికి ఇంకోలా
ఆర్థిక స్థితిని బట్టి అవతరించే 
గణిత గమ్మత్తు  ఈ బడ్జెట్...

బరువు బాధ్యతలను 
బ్రతుకులను
రాష్ట్రాల అడుగులను
దేశాల ఎదుగుదలను
మనిషి మనుగడ మెరుగుదలను నడిపించే 
*జగన్నాథ రథచక్రాలే ఈ బడ్జెట్ కాసులు...*

పార్లమెంట్ లో కురిసిన 
ఈ లెక్కల చినుకులు
ప్రతి గడపలో మొలిచిన ఆశలకు ఆశయాలకు
సరిపడా తడిని అందించినపుడే 
*బడ్జెట్‌కు సార్థకత...*

బ్రతుకు బండికి భరోసా
భవిష్యత్తు తరాలకు బాసట
అయినపుడే *బడ్జెట్ ప్రవేశ పర్వమునకు దక్కును ప్రతిష్టత...*

*అభిరామ్ 9704153642*

No comments:

Post a Comment