*ఓం నమో భగవతే వాసుదేవాయ*
*శ్రీహరి లీలామృతం 28వ భాగము*
*(సంక్షిప్త భాగవత గాథలు)*
🌸🌸🌸🌸🙏🕉️🙏🌸🌸🌸🌸
*తృతీయ స్కంధం*
*11వ భాగము*
🌸🌸🌸🌸🙏🕉️🙏🌸🌸🌸🌸
*🌻దేహాంతర ప్రయాణం🌻*
🍃🌺సంసారంలోని గృహస్థులు ధర్మకామాలను ప్రేమిం చుతూ, వాటిలోనే నిమగ్నులై ఉంటారు. వేదాలలోని భాగవత ధర్మాలను గాని, భగవంతుని యందు భక్తిని పట్టించుకోరు. జీవితాలను ఆరాధిస్తుంటారు. వైదిక కామ్యకర్మలు చేస్తుంటారు. ఇలాంటివారు ముక్తిని సాధించలేరు. వారు పై లోకాలకు వెళ్ళి సుఖాలనుభవించి, పుణ్యం తీరగానే మళ్ళీ భూలోకం లోకి వస్తూ పోతూ ఉంటారు. బుద్ధిమంతులు యోగనిద్రలో నున్న శ్రీమన్నారాయణుని ధ్యాని స్తారు. భక్తితో తమ ధర్మాలన్నీ శ్రీహరికే సమర్పిస్తారు. ఆ సర్వేశ్వరునిపై బుద్ధి స్థిరంచేసి, సుఖించే ధీరులు పునర్జన్మ పొందడానికి ఈ భూమిపైకి ఎన్నటికీరారు.
🍃🌺కొందరు బ్రహ్మనే పరమాత్మగా భావించి ఆరాధిస్తారు. వారు ప్రళయ కాలంలో కూడ ఆపరమేశ్వరునిలో లయమైపోతారు. అవ్యయుడైన ఆ పురుషోత్తమునినే శరణు వేడాలి. సర్వేశ్వరుడు అన్ని రూపాలలో అవతరి స్తుంటాడు. ఈశ్వరాంశతో పుట్టిన ఋషులు, దేవతలు తమ తమ కర్మఫలాన్ని బట్టి, జన్మించి ఐశ్వర్యం పారమేష్యం అధికారం పొంది తిరిగి వస్తారు. మరికొందరు కర్మానుసారమైన ఇంద్రియాధీనులై, పితృదేవతలను ఆరాధిస్తూ సంసారమగ్నులై ఉంటారు. వీరిని డ్రైవర్తిక పురుషులంటారు. మాతా! పరమేశ్వరుని భజిస్తూ, ఆయన మధుర కథాసుధలను గ్రోలువారే ధన్యాత్ములు.
🍃🌺వాసుదేవ భక్తి వల్ల జ్ఞానవైరాగ్యాలు కలుగుతాయి. బ్రహ్మ సాక్షాత్కారానికి ఇవే సాధనాలు. సమవర్తియైన భక్తునకు ప్రియాప్రియములు వుండవు. సర్వత్ర సమదర్శనం ఏర్పడుతుంది. ఆత్మను తనలోనే దర్శించగల ధీశాలి. పరమేశ్వరుడు ఏకరూపుడే ఐనా చూచే వారిని బట్టి అనేక రూపాలుగా గోచరిస్తాడు. విషయాలనుండి వెనుదిరిగితే పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. జీవస్వరూపుడైన విరాట్ పురుషుడు బ్రహ్మాండంలో ఉంటాడు. నేను చెప్పిన భక్తియోగంతో పరమాత్మ సగుణుడు. భక్తి, జ్ఞాన యోగాలు రెండూ ఒక్కటే. తీర్థయాత్రలతో పరమేశ్వరుడు గోచరించడు. ఇంద్రియ నిగ్రహంతో, సకల కర్మలను భగవంతునికి అప్పగించి, వైరాగ్యంతో, కర్మఫల నిస్సంగుడే పరమాత్మను చేరగలడు. అమ్మా! నీకు భక్తి, సాంఖ్య యోగాల్ని వివరించాను. దుష్టునకు, అవిశ్వాసికి, భక్తిలేనివారికి ఇంద్రియలోలురకు ఉపదేశించవద్దు. భక్తుడు శ్రద్ధాళువు, శాంతబుద్ధుడు, సర్వభూత సుహృదుడు అగువానికే ఈ యోగము ఉపదేశింపదగినది.
*🌻దేవహూతికి మోక్షప్రాప్తి🌻*
🍃🌺మహా పతివ్రత దేవహూతి పుత్రుడైన కపిల భగవానుని ఉపదేశం పొంది, మోహాన్ని విడనాడి, భగవానునికి సాష్టాంగ ప్రణామంచేసి, ఇలా స్తుతించింది.
🍃🌺“ఓ మహానుభావా! ఓ వటపత్రశాయీ! నిన్ను సాక్షాత్తూ సృష్టికర్త వయిన ఆ బ్రహ్మయే తెలుసుకొనలేడు గదా! స్వామీ! నీవు నా పూర్వజన్మ పుణ్యఫలంగా నా గర్భాన జన్మించావు. దీనితో నా జన్మ ధన్యమైంది. ఓ జ్ఞానస్వరూపా! నీ మంగళకరమైన నామాన్ని స్మరించినా, కీర్తించినా పేదలు ధనవంతులౌతారు. నీచులు ఉత్తములౌతారు. నీ కథాసుధలను ఆస్వాదించిన వారికి సకల దివ్యఫలాలు లభిస్తాయి. పరమపురుషుడవు, వేదమూర్తివి అయిన నీకు అనేక నమస్కారాలు.” అని స్తుతించిన మాతృమూర్తిని ఆశీర్వదించి, కపిల భగవానుడు అదృశ్యమైనాడు.
🍃🌺జ్ఞానోదయం పొందిన దేవహూతి, సర్వం త్యజించి, సరస్వతీ నదీ తీరాన గల బిందుసరోవరం గట్టున తపోదీక్ష ఆరంభించింది. ఏకాగ్రచిత్తంతో శ్రీమన్నారాయణుని పాదపద్మాలపై మనస్సును నిలిపి, వైరాగ్యభావంతో, పరిశుద్ధ మనస్సుతో ధ్యానించింది. ఆమెకు బ్రహ్మజ్ఞానం లభించింది. జీవభావం నశించింది. శ్రీమహావిష్ణువులో లయమై పోయింది. ఆ పవిత్ర క్షేత్రమే సిద్ధపదం అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది.
🍃🌺మైత్రేయుడు విదురునితో ఇలాగ అన్నాడు : “నాయనా! ఈ కపిల దేవహూతి సంవాదం అతి పవిత్రమైంది. దీనిని భక్తి శ్రద్ధలతో చదివినవారు, విన్నవారు శ్రీహరి పాదపద్మములను చేరుకొంటారు.” అని శ్రీ శుకుడు పరీక్షిత్తునకు చెప్పినట్లుగా, సూతుడు శౌనకాది మునులకు చెప్పెను.
*తృతీయ స్కంధం సమాప్తం*
*ఓం శ్రీకృష్ణార్పణమస్తు*
🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*
🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹
No comments:
Post a Comment