Thursday, July 25, 2024

****తలపులకు…తలుపులు వేయాలి!*

 తలపులకు…తలుపులు వేయాలి!*
*తాబేలు తనను తాను రక్షించుకోడానికి దాని మీద ఒక ధృఢమైన కవచం లాంటి డిప్ప ఒకటి సహజంగా అమర్చబడి ఉంటుది.*
తాబేలు తనకు బయట నుండి ఏదైనా ఆపద సంభవిస్తుంది అని అనిపించిపుడు…      తన తలను, మిగిలిన అంగములను ఆ డిప్పలోకి లాక్కుంటుంది. అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది.
*అలాగే స్థిత ప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయవాంఛల నుండి తనను తాను రక్షించుకోడానికి తన ఇంద్రియములను వెనక్కు లాక్కుంటాడు.*
*ఇది అర్థం కావాలంటే మనము ఆచరించ వలసిన సాధనల గురించి ముందు తెలుసుకోవాలి!*
*ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడం.*
*నిగ్రహము అంటే ఇంద్రియములను అణగతొక్కడం అని అర్థం తీసుకోకూడదు.*
*విపరీతంగా ఇంద్రియములతో స్పందించకూడదు. దేహమును అంటే ఇంద్రియములను నియంత్రించాలి.*
*సాధకుడికి ఇదిముఖ్యం. దీనినే ‘దమము’ అని అంటారు.*ఆదిత్యయోగీ*
*ఎందుకంటే ప్రాపంచిక విషయములకు ఇంద్రియములు విపరీతంగా స్పందిస్తుంటే నిరంతరం వాటి ప్రభావానికి లోనవుతాడు కానీ అతడికి ఉన్నతస్థితి లభించే అవకాశమే లేదు.*
*ఇంద్రియములనే ఎందుకు నియంత్రించాలి ముందు మనసును నియంత్రించవచ్చు కదా. అంటే ముందు బయటకు కనపడే ఇంద్రియములను నియంత్రించ గలిగితే మనసును నియంత్రించడం సులభం అవుతుంది. అందుకే ముందు ఇంద్రియ నిగ్రహముతో మొదలు పెట్టాలి.*
*సాధారణంగా ఇళ్లకు తలుపులు పెట్టుకుంటాము.     ఎందుకు.. ?అనవసరమైన వాళ్లు ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త.    ఇంకా కొంత మంది అనుమతి లేనిదే లోపలకు రాకూడదు అని బోర్డుకూడా పెడతారు. మన ఇంటికే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము కదా. మన శరీరంలోకి ఇంద్రియముల ద్వారా ఎన్ని అనవసరవిషయాలు ప్రవేశిస్తాయో తెలుసుకోవద్దా! వాటిని నిరోధించడానికి తలుపులు పెట్టుకోవాలి కదా! లేకపోతే మన శరీరం ఒక పబ్లిక్ టాయిలెట్ అయిపోతుంది.*
*పబ్లిక్ టాయిలెట్ కు తలుపులు ఉండవు. ఎవరైనా వచ్చి పని కానిచ్చి పోవచ్చు. కాని వాళ్లు వదిలిన తాలూకు వాసనలు అక్కడే ఉంటాయి. అలాగే మన శరీరం తలుపులు తెరిచిపెడితే, బయట ప్రపంచంలో ఉన్న శబ్ద, స్పర్శ, రస, రూప,గంధములు అన్నీ యధేచ్ఛగా లోపలకు ప్రవేశిస్తాయి. వెళ్లిపోతాయి.* *కాని వాటి వాసనలు మాత్రం మనలను వదలవు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము అనే తలుపులు మనం అమర్చుకోవాలి..
.
ఇక్కడ కర్మ ఋణం, యొక్క సూక్ష్మం.అర్ధమైతే.
కర్మ సిద్ధాంతంను అనుసరిస్తారు ఎవ్వరైనా..
.
*. స్వీయ-సాక్షాత్కార స్థితిలో, జీవ పరిమితుల నుండి విముక్తి పొందినప్పటికీ, నాడుల యొక్క ప్రకాశం కారణంగా ప్రాణంతో సంబంధం సహజంగా మరియు సున్నితంగా ప్రవహిస్తుంది.*

*ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు కూడా, యోగి పరమాత్మ చైతన్యానికి అనుసంధానమై ఉంటాడు. అటువంటి యంత్రాంగాలు శివుని యొక్క సంపూర్ణ స్వయంప్రతిపత్తి యొక్క శక్తి కేంద్రమైన శక్తిచే నియంత్రించ బడతాయి. ప్రాణం యొక్క స్వయంచాలక ప్రవాహం కొనసాగుతున్నంత కాలం యోగి తన భౌతిక శరీరంలో ఉనికిలో ఉంటాడు. తన శరీరానికి మరియు ప్రాణానికి మధ్య సంబంధం ఉన్నంత వరకు, తన శరీరాన్ని పరిపూర్ణ స్థితిలో ఉంచుకోవడం యోగి యొక్క విధి. అతని శరీరానికి ప్రాణం ఆగిపోవడం ముందుగా నిర్ణయించిన సమయంలోనే జరుగుతుంది. ఆ తదుపరి అతని ఆత్మ శాశ్వతత్వంలో కరిగిపోతుంది, మళ్లీ పుట్టదు. ఎల్లవేళలా భగవంతునితో అనుసంధానమై నిలబడాలనే సందేశం ఈ సూత్రం ద్వారా అందించబడిన సందేశం. ఇక్కడ అన్ని సమయాలలో  అనేది ప్రపంచ ప్రాణశక్తి అనే పదం ద్వారా సూచించబడుతుంది.*
.

ప్రస్తుతం ఏం జరుగుతుంది? 
ఎలా జరుగుతుంది?..
.

అవును జీవులన్నింటిలో ఉత్కృష్టమైనవాడు మానవుడే! జ్ఞాననేత్రాలతో సర్వమును గ్రహించే శక్తి మానవునికి వుంది! తానే పరమాత్మ స్వరూపుడైనప్పుడు తనకు వేరే నియామకుడు ఎలా వుంటాడు! ఆత్మరూపుడైన తాను శాశ్వతుడు! తనకు నాశనం లేదు! తన దేహానికి తానే ఆభరణం! ఈ భూమిపై జన్మించిన తాను ఈ భూమికే అలంకారం! సచ్చిదానందములే తన ఐశ్వర్యాలు! ఆత్మానుభూతి పొందిననాడే శోకములన్ని నానుండి దూరమైనవి! బ్రహ్మమే నేనైన నాకు ఇక శోకమెక్కడిది!ఆదిత్యయోగీ.

ఈ భావనే జ్ఞానోదయమునకు పునాది! జ్ఞానంతో జీవుడు తానే పరమాత్మ అన్న సత్యాన్ని అనుభూతి పొందగలడు! అదే జీవుని నిజస్వరూపము!

చిదానందరూపః శివోహమ్! శివోహమ్! అన్న ఆదిశంకరుల ఆత్మబోధకు అర్ధమిదే!..
.

*బ్రహ్మము అనే పదానికి అర్థం ఇది*

భారతదేశంలో మనకు బ్రహ్మము అనే ఒక భావన ఉంది, సాంప్రదాయపరంగా, బ్రహ్మము అంటే భగవంతునితో సమానం, అదే అంతిమ సత్య తత్వంగా, పరమాత్మగా భావిస్తారు. లేదా మీకు నచ్చిన పేరుతో పిలవవచ్చు. అయినప్పటికీ మనం ఆ పదం ఎక్కడినుండి వచ్చింది అనే శబ్ద మూలాలను పరిశీలిస్తే. మనకు పూర్తిగా భిన్నమైన కథనం బయటపడుతుంది. 'బ్రహ్మన్' అనేది బృహ అంటే 'విస్తరణ'. మాన్ అంటే 'ధ్యానం'
అని రెండు సంస్కృత మూలాల కలయిక వల్ల ఏర్పడింది. అందుకని.   "బ్రహ్మము అంటే విస్తరించి. ధ్యానించేది" అని అర్థం.....*

No comments:

Post a Comment