👌 దత్తబోధ 👌
మానసికంగా త్యజించాలి!
✍️ శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
🙏🌹🥀🌻🪷✳️🌻🪷🥀🌹🙏
🪷 "సన్యాసం" ... భౌతికంగా కన్నా అంతరంగిక ప్రాముఖ్యాన్ని అధికంగా కలిగి ఉంటుంది♪.
🪷 కర్తవ్యాన్ని మానుకోవడం సన్యాసం కాదు♪. మతపరమైన ఆచార, సంప్రదాయాలు పాటించడం, మంత్రోచ్చాటన చేయడం, కాషాయ వస్త్రాలు ధరించడం వంటివి సన్యాసానికి చిహ్నాలు కాదు♪. అహంకార మమకారాలను విడిచి పెట్టాలి♪. బాధలన్నింటికీ మూలం ఇవే♪. అందుకే 'నేను', 'నాది' అనే భావాలను మానసికంగా త్యజించినప్పుడే ఎవరైనా సన్యాసి కాగలడు♪. కాషాయ వస్త్రాన్ని ధరించడం మానసిక త్యాగానికి చిహ్నం మాత్రమే♪.
🪷 అంతరంగ పరిత్యాగం పొందాలంటే, కొన్ని క్రమశిక్షణా పద్ధతులు లేక ఆచరణలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది♪. సంపద, సంతానం, పేరు-ప్రఖ్యాతులు కావాలనే కోరికలను ప్రతి సన్యాసీ త్యజించాలి♪. కేవలం ఇంతటితో ఆగకుండా వైరాగ్యాన్ని పెంచుకోవాలి♪. ప్రపంచంలోని వస్తువులతో సంబంధం కలిగి ఉండడం వల్ల కష్టాలు కలుగుతాయనే అవగాహన అవసరం♪. వాస్తవంగా సన్యాసం అనేది ఇవ్వడానికి లేక పుచ్చుకోవడానికి వీలైన వస్తువు కాదు♪. కేవలం స్వయం ప్రేరణతో ప్రయత్నించి, తగిన కృషితో సంపాదించదగిన ఒక స్థితి♪. ఎవరైతే ఆలోచించకుండా, తొందరపడి సన్యాసం స్వీకరిస్తారో అటువంటివారు ఆ తర్వాత తప్పనిసరిగా పశ్చాత్తాప పడవలసి ఉంటుంది♪.
🪷 సంసార బంధాలను తెంచుకొని, శాశ్వత ఆనందాన్ని పొందడానికి శ్రద్ధతో ప్రయత్నించే వ్యక్తికి అనేక మార్గాలు ఉన్నాయి♪. ముఖ్యంగా కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం అనేవి అందరికీ బాగా తెలిసినవే♪. వీటికి అదనంగా ఆచరణ సాధ్యమైన వేరొక మార్గాన్ని మన పవిత్ర గ్రంథాలు సూచిస్తున్నాయి. అదే 'సన్యాసయోగం'. ప్రాపంచిక వస్తువుల నుంచి, ఉద్రేకాల నుంచి, ఆలోచనల నుంచి మనస్సును దూరం చేయడమే ఈ యోగంలోని ప్రధానాంశం♪. ప్రాపంచిక విషయాల నుంచి దూరమైన మనస్సు భగవంతుని పాదపద్మాలను అంటిపెట్టుకొని ఉంటుంది♪. ఈ దృష్టికోణంలో ఆలోచిస్తే 'సన్యాసయోగం' అంటే అసంగయోగం♪. ఈ యోగాన్ని ఎల్లప్పుడూ స్థిరంగా అభ్యాసం చేసినట్లయితే బుద్ధిపూర్వకంగా ప్రయత్నం చేసే సాధకుని ఆత్మ కడకు లక్ష్యాన్ని చేరుతుంది♪. అంటే సన్యాసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడన్నమాట♪!
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు
సేకరణ:
🙏🌹🥀🌻🪷✳️🌻🪷🥀🌹🙏
No comments:
Post a Comment