Monday, July 15, 2024

భగవంతుడు అంటే ఏమిటి...?

            *_నేటి మాట_*

*భగవంతుడు అంటే ఏమిటి...?*
భగవంతుడు అంటే కోర్కెలు తీర్చేవాడండి, ఆయనంటే నాకు ఇష్టం అండి, భజన చేస్తానండి, పూజలు చేస్తాను...ఇది చాలా మందికి తెలిసిన భగవతత్త్వం. 

        అర్థం తెలీదు, కోర్కె తీరింది, ఇష్టం పెరిగింది, ఆయన్ని పట్టుకున్నాను, అంతకు మించి అర్థం పర్థం లేదు!!...
_ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం..._
        ఇష్టం అంటే వారి గురించి తెలుసుకోవడం, భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకుంటే నువ్వు భగవంతుడు అయిపోతావు. 
       అంతే తప్ప ఏ కోరిక కావాలంటే అది తీర్చేవాడు కాదు. 
        ఆయన గురించి విచారణ చేయాలి!!...
         కాకపోతే కోరిక కోసం భక్తులు తప్ప అర్థం చేసుకోవడానికి కాదు, ఎవరైనా అర్థం చెబుతున్నా  తెలుసుకునే ప్రయత్నం చేయం.

       మనంతట మనం తలుపులు మూసేస్తే సూర్యుడి కిరణాలు మనకి చేరవు, తలుపు తెరవండి. 
        కిరణాలను ప్రసరించనివ్వండి, ఎంతవరకు కోరిక తెర అడ్డు ఉంటుందో అంతవరకు భగవంతుడిని ఆస్వాదించలేము.
   
      పరమాత్మని ఎందుకు తెలుసుకోవాలి?
పరమాత్మ ఆధారమై ఉన్నాడు, పరమాత్మ వలన ఏర్పడింది, పరమాత్మ చేత నిర్వహింపబడుతుంది,
పరమాత్మే ప్రపంచమై ఉన్నాడు. 

         ఎలా? ...  సముద్రము పైన కెరటములు ఉన్నాయి, సముద్రం వలన కెరటాలు ఉన్నాయి, సముద్రం చేత కెరటాలు ఉన్నాయి, సముద్రమే కెరటం, మనం కెరటం కెరటం అంటున్నాం కదా.. సముద్రం లోని జలం, సముద్రమే జలం కదా! 
         మనం ప్రత్యేక దృష్టితో కెరటం చూస్తున్నాం కనుక పైకి లేచింది. 
         ఇంత సేపు ఉంది అంటున్నాం, సముద్ర జలం తప్ప కెరటంలో అన్యమైన జలం ఉందా! లేదు...

      అలానే ఈ సృష్టి యావత్తు భగవంతుడే ఉన్నాడు, అన్యమైనది ఏదీ లేదు, లేనే లేదు. 
       పరమాత్మ యందు పరమాత్మ వల్ల పరమాత్మ చేత జరపబడుతున్న ప్రపంచము పరమాత్మ యొక్క స్వరూపమే, అని తెలుసుకోవాలి, అంతా ఆయన స్వరూపమే అని భావించాలి...

               *_🍃శుభమస్తు.🍃_*
 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

No comments:

Post a Comment