🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ససహవాస - దోషం*
➖➖➖✍️
*ఒక గురువు తన శిష్యుడితో కలిసి తీరప్రాంతాన నడుస్తున్నాడు. వారికి సుదూరంగా ఒక ఓడ కనిపించింది. ఇద్దరూ చల్లగాలిని ఆస్వాదిస్తున్నారు. కొన్ని నిమిషాలు గడిచాయో లేదో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చింది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచాయి. గురుశిష్యులు ఆశ్చర్యంగా చూస్తుండగానే ఓడ మునిగిపోయింది. అందులో ఎందరు ప్రయాణిస్తున్నారో, ఎందరి ప్రాణాలు పోయాయో తెలీదు. అంతలోనే వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది.*
*శిష్యుడికి దుఃఖం ఆగలేదు. ‘గురువర్యా! ఏమిటీ విపత్తు? పాపం కదా! ఒక్కసారిగా ఇంతమంది చనిపోయారేంటి?’ అన్నాడు.*
*‘ఏం చెప్పను?! చేసిన పాపాల ఫలితం’ సాలోచనగా అన్నాడాయన.*
*’అందరూ పాపులేనా? కొందరైనా పుణ్యాత్ములు ఉంటారుగా! భగవంతుడు వారిని కూడా ఎందుకు చంపాడు?’ మళ్లీ అడిగాడు శిష్యుడు.*
*దానికి గురువు సమాధానం చెప్పలేదు.*
*ఇద్దరూ ఆశ్రమానికి తిరిగెళ్లారు. శిష్యుడు తన సందేహం గురించి మర్చిపోయాడు. మరుసటిరోజు యథాప్రకారం గురుశిష్యులు సముద్ర తీరాన నడుస్తున్నారు. శిష్యుడికి అందమైన శంఖం కనిపించడంతో ఆనందంగా చేతిలోకి తీసుకున్నాడు.*
*అందులోని జీవిని తినేందుకు చీమలు చేరాయి. వాటిల్లో ఓ చీమ శిష్యుడి చేతిమీద కుట్టింది. చురుక్కుమనడంతో శంఖాన్ని గబుక్కున సముద్రంలోకి విసిరేశాడు.*
*ఎన్ని చీమలు కుట్టాయని అడిగారాయన.*
*ఒకటేననగా ‘మరి ఒక్క చీమకు వేయాల్సిన శిక్షను అన్నిటికీ వేయడం సరైనదేనా?’ అన్నాడు గురువు.*
*అర్థమైంది గురువర్యా! మనం మంచిగా ఉన్నంతలో చాలదు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా మంచివారయ్యుండాలి’ అంటూ నమస్కరించాడు శిష్యుడు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment