Saturday, July 27, 2024

****అంటే నేను అనంత ఆత్మ శక్తిని అన్న సత్య భావ ఎరుకను కలిగిస్తుంది. అర్ధమయితే,అవును అనిపిస్తే, ప్రయత్నించండి.

 🌹గుడ్ మార్నింగ్ 🌹శరీరము, మనసు, ప్రాణముల సంచారము జీవితము. మొత్తము జీవితము శరీరము కొరకు, శరీరముతో జీవించటం జరుగుతున్నది. శరీర నసింపుతో అంతా అయిపోయిందని భావిస్తున్నాము. శరీరాన్ని నడిపేది మనసు ఆలోచనల ద్వారా. శరీరానికి, మనసుకు ఆధారం ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తికి నసింపు లేదు, అది శాస్వితము అని మన ఆధ్యాత్మిక మార్గ పూర్వికులు చెబుతున్నా - ఆత్మజ్ఞాన సంబంధిత గ్రంధాలు అనేకము వున్నా - ఆ స్థితిని పొంది జీవనముక్తులుగా ఎంతోమంది జీవించి ఆ స్థితి నిజము, మేము పొందాము, మీరుకూడా పొందవచ్చు - అలా ఆ మోక్ష స్థితిని పొందితేనే జన్మ పరంపరలు ఆగేది అని చెబుతున్నా - మనం మాత్రం మనలోనే ఉన్న మన సొంత ప్రాణ శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు.దీనికి కారణం పరిమిత శరీర భావన. ఈ భావన నుండి ఆత్మ శక్తి అదే మనలో ప్రాణ శక్తి భావన కలగాలంటే - మన అంతరగములోకి చూసుకుంటే చాలు. అన్నీ అర్ధమవుతాయి.వీలున్నప్పుడు కాసేపు మీలోపలకు మీరు చూసుకోండి. నిదానముగా మీకు మీరు అర్ధమవ్వటం మొదలైన రోజున మీకు సత్యము దానంతట అదే అనుభవమవుతుంది. మిమ్మల్ని మీరు గమనించటమే మీరు చేయవలసింది. మీకు మీరు ఎంత సంపూర్ణముగా తెలుస్తూ ఉంటారో - అంత మీ భౌతిక జీవితము మెరుగుపడుతుంది. మీలో జ్ఞాన వికాసము జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికత అంతరంగములో స్థిరత్వాన్ని పొందుతూ ఉంటుంది. నన్ను నేను గమనించుకోవటం అనే చిన్న పరిశీలన ఇంత చేసి మొక్షాన్ని ఇస్తుంది. అంటే నేను అనంత ఆత్మ శక్తిని అన్న సత్య భావ ఎరుకను కలిగిస్తుంది. అర్ధమయితే,అవును అనిపిస్తే, ప్రయత్నించండి. 🌹god bless you 🌹

Source link : http://youtube.com/post/UgkxUYXqS8_kUsO2s1JceY-fvlBt6bl4KeQv?si=JwNM-V22HWZI7EVH

No comments:

Post a Comment