*కోరికలను తగ్గించుకో!!!*
*మానవుడు తన కోరికలన్నీ తీరితే సంతోషముగా , సుఖముగా ఉండవచ్చును అనుకుంటాడు.*
*కానీ నిజానికి కోరికలు తీరితే కాదు, కోరికలు ఆరితేనే సుఖముగా, సంతోషముగా ఉండగలడు.*
*కోరికలకు అంతం ఉండదు. ఒకటి తీరితే మరొకటి , అది తీరితే మరొకటి ఇలా ఒకదాని తర్వాత మరొకటి పుడుతూనే ఉంటుంది.*
*ఇంకా కోరిక తీరితే ఆనందం ,తీరకపోతే దుఃఖం. దుఃఖం వలన కోపం, కోపం వలన విచక్షణ కోల్పోవడం, తద్వారా అన్యాయం, అధర్మం, హింసకు పాల్పడడం తుదకు జీవనం నాశనం అవ్వడం జరుగుతుంది.*
*కనుక కోరికలను అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. కోరికలు మితంగా, ధర్మ బద్ధంగా జీవనమునకు అవసరమగు విధముగా ఉండాలి తప్ప అత్యాశకు పోకూడదు.*
*దేవుని యందు ప్రేమను పెంచుకుంటే అసలు మనం ఏ కోరికా కోరనవసరం లేదు. ఎప్పుడు మనకి ఏది అవసరమో ఆయనే చూసుకుంటాడు.*
No comments:
Post a Comment