*సంసార చక్రంలో మనిషి ఎప్పటికీ ఏకాకే! నిస్సహాయుడే*
కొంతమంది ఋషులు వ్యాస భగవానుడు వద్దకు వెళ్లి, ”ఓ! మహర్షీ! సర్వజ్ఞుడవు. నీకు తెలియని విషయం ఉండదు కదా! మాకొక సందేహం వచ్చి వివరణ కొ రకు మీ వద్ధకు వచ్చాము.
మానవుడికి సహాయంగా ఉండేది తల్లిదండ్రులా? తాతా, నాయనమ్మ లా? సంతానమా? లేక గురువా?స్నే హతులా? బంధువులా? వీరిలోఎవ రు? మనిషి మరణించగానే జీవంలే ని కట్టెను ఎవ్వ రూ పట్టించుకోరు.
అంతా ఋణానుబంధం అని కొద్ది రోజులు విచారించి, జన స్రవంతిలో మామూలుగా తిరుగుతూ ఉంటారు. మరి వారి వెంట వెళ్ళేది పాపపుణ్యాలంటారు.
వ్యాస మహర్ష ఋషివర్యులారా! నరుడు ఒక్కడు గానే జన్మిస్తాడు. ఒక్కడుగానే మరణిస్తాడు. ఎవరి సుఖ - దుఃఖాలు వారేఅనుభవిస్తు న్నారు. మనిషి ఎప్పటికీ ఏకాకే!. నిస్సహాయుడే.
అతడు మరణిస్తే బంధువులు అందరూ కొద్ది రోజులు దుఃఖంలో ఉండి విచారిస్తుంటారు. వెంట ఎవ్వరూ రారు కదా. వెంట వెళ్ళేది *”ధర్మం”* ఒక్కటే!.
తన జీవితకాలంలో చేసే పాప- పుణ్యాలు అనుసరించే మార్గం ధర్మమే. మరేదీ మనిషి వెంట వెళ్ళదు. ధర్మం వల్ల తనకు మేలుకలుగుతుందని, మానవుడు సత్కర్మ లు చేస్తూ ధర్మ మార్గంలో సంచరించాలి.
మనిషిని అంటిపెట్టుకుని ఉన్నకామ క్రోధ, లోభ వంటి అరిషడ్వర్గాలు వ ల్ల, భయం వల్ల, స్వార్థం వల్ల, ధర్మం తప్పుతూ ఉంటారు.
మహాజ్ఞానులు సైతం కొన్ని పరిస్థితుల్లో ధర్మ విరుద్ధమైన కర్మలు చేస్తూంటారు అర్థం, కామం, అనే పురుషార్థాన్ని కూడా ధర్మబద్ధంగా పొందితేనే, మానవుని జీవితం సాఫల్యత చెందుతుంది.
వ్యాసుడు చెప్పగా విని మరల ఆ మహర్షులు స్వామి శరీరం నాశనం ఎలా అవుతుంది? మానవుడి శరీరం దహనం పూర్తి అయిన తరువాత అతడి ఆత్మసూక్ష్మ రూపంలో కనిపించకుండా, ఉంటుంది!
ధర్మం ఈ సూక్ష్మ రూపాన్ని
ఎలా వెంబడిస్తుంది?” అని తిరిగి ప్రశ్నించారు. ఋషులారా! గృహస్థ ధర్మాన్నిఆచ రించేవారు నిరంతరం ఆచారాలు పాటించాలి.
జ్ఞానులు, పెద్దలు చెప్పిన రీతిలో, చూపిన మార్గంలో సంచరించాలి. సత్యం, ధర్మం రెండు కళ్ళుగా నీతి తో వ్యవహరించని వారికి ఇహ-పర సౌఖ్యాలు ఉండవు.
*పుత్రులు అంతా అల్ఫాయుష్కులు అవుతారు.*
*ముందుతరం వారు అనుసరించకపోతే, తరువాతి తరంవారు అథోగతి పాలవుతారు. వక్ర మార్గంలోనేనడు స్తారు*
ప్రతీ గృహస్థుడుకు తన కర్త వ్యంగా ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాలను సాధించే దిశగానడ వాలి.
ప్రతీరోజు బ్రహ్మముహూర్తంలో అం టే సూర్యోదయానికి ముందే, స్నానా దికాలు ముగించుకొని ఇష్ట దైవాన్ని స్తుతించాలి. ఆరాధించాలి.
ప్రతీ జీవి పట్ల ఔదార్యంతో ఉంటూ, ఆకలితో అలమ టించే వారికి ఆహా రం సమకూర్చాలి. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి.
దేవాలయాల్లో, పంటభూముల్లో,పు ణ్య నదుల లో, మల మూత్ర విసర్జ న చేయకూడదు.
అన్నం పరబ్ర హ్మ స్వరూపం. కాబ ట్టి, మంచాల మీద, కుర్చీల మీద, నుంచొని,ఆహారంభుజించకూడదు. గురువులుతో, పెద్దలతోఅనుకూలం గా సంభాషించాలి.వ్యర్థ ప్రసంగం చే యకూడదు.
ఇతరుల మీద నిందలు మోపి, తగ వులు పెట్టడం వంటి దుర్గుణాలు ఉండకూడదు.
స్త్రీలను, అంగవైకల్యం వారిని, పెద్ద లను, గురువుల ను నిందించరాదు.
దేవాలయదర్శనమూ,పూజలు,దానాలు చేయడం, దైవకార్యాలలో పా ల్గొనడం,యాగములు, ప్రజోపయో గమైన కార్యాలు చేయడం, ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు.” అంటూ ఇం కా ఎన్నో ధర్మాలు, ఆచారాలు వివ రించారు.
*”మహర్షులారా! మానవులు చేసే ప్ర తీ ధర్మ అధర్మ కార్యాలకు పంచభూ తాలు సాక్ష్యులుగా ఉంటాయి.*
జీవుడుమరణించినతరువాత,చర్మం,మాంసం, ఎముకలు, రక్తం వం టివి అన్నీ ప్రాణంతోనే నశిస్తాయి.
ఆత్మ ఒక్కటే అదృశ్య రూపంలో వె డుతుంది. అంతవర కు జీవి చేసు కొన్న పాప- పుణ్యాల ఫలం ధర్మం రూపం లో వెడుతుంది.
అధర్మపరుడు అయితే!, నరకానికి, పుణ్యవంతుడుఅయితేపుణ్యలోకా లకు వెడతారు.
జీవి ఒక వేళ తప్పుచేసినా,పశ్చాత్తా పంచెందితే కొంతవరకు పుణ్యంలభి స్తుంది. మళ్ళీ తిరిగి ఎప్పుడూ అదే తప్పు చేయకూడదు.” అంటూ వివ రించారు.
*మానవులు సంసారచక్రంలోచిక్కుకొ ని, స్వార్థంతోభార్యాపిల్లలఔన్నత్యం గురించే తాపత్రయ పడుతుంటారు.*
దీనివల్ల అధర్మంగా ప్రవర్తించవలసి వస్తుంది. అందుకేఅనేకసుఖ-దుఃఖాలకువారంతటవారేకారణభూతులవుతున్నారు.
అంతులేనిరోగాలపాలవుతున్నారు. అటువంటి సమయంలోనే భగవం తుడు కనపడతాడు.
ఆ స్థితిలో పరమాత్మమాత్రంఏమిచె య్యగలడు? తను చేసుకొన్నదుష్క ర్మల ప్రభావంఅనుభవించకతప్పదు కదా. అందుకే మానవులు సన్మార్గం లో నడవడానికి మీరు అందరూ బా టలు వేయండి.” అని చెప్పి ముగిం చారు.
చూసారా! ఇహ పర సౌఖ్యాలు పొం దాలంటే మనచేతుల్లోనేఉందనివ్యా సమహర్షి చెప్పారు.
*మనం కూడా మన విచక్షణా జ్ఞానం తో మంచి కార్యాలు చేయడానికిసం సిద్ధులమవుదాం.*
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
No comments:
Post a Comment