*మనం మిగతా ప్రాణుల కంటే*
*సృష్టిలో కోట్లాది ప్రాణులున్నాయి అన్ని ప్రాణులు గాలి పీల్చగలవు తినగలవు ఇంకా ఇంకా చాల చేయగలవు కానీ మనలాగా ఆలోచించలేవు వండుకుని తినలేవు మాట్లాడలేవు నవ్వలేవు వాటికి పెళ్లిళ్లు లేవు విజ్ఞత లేదు కానీ ప్రకృతిలో దొరికినవి తింటాయి మన మానవుల్లాగే వాటిలో కూడా మగ జాతి ఆడ జాతి అని రెండు జాతులుంటాయి* *అవి ఒకదానితో మరొకటి జత కలసి ఆనందిస్తూ పిల్లలని కంటూ లేదా గుడ్లు పొదుగుతూ తమ జాతిని వృద్ధి చేసుకుంటుంది*
*మరి మనం మాట్లాడగలము ఆలోచించగలం మన మధ్య అనురాగం ప్రేమ సుఖదుఃఖాలు లాంటివి ఎన్నో వున్నాయి* *వావివరసలు కట్టుబాట్లు మనం ఏర్పాటు చేసుకున్నాం*
*వివాహ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాం* *అంతా బాగానే వుంది మరి మనం సరైన టైంకు వివాహం చేసుకుంటున్నామా!* *మిగతా జీవుల్లాగా ఆనందాన్ని అనుభవిస్తున్నామా!*
*అతి తెలివితో జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం*. . *లేనిపోని ఆలోచనలతో కాలాన్ని వృథా చేస్తున్నాము* .
*పెళ్లి అంటే ఏదో పెద్దపులి తో యుద్ధం లా భావిస్తున్నాము* *పెళ్లి ద్వారా ఏర్పడపోయే బంధాల్ని తలచుకొని లేనిపోని అనుమానాలు పెంచుకోవడం కష్టాలు వస్తాయని వాటిని ఎదుర్కోలేమని డీలా పడిపోవడం*
*మనమీద మనకే నమ్మకం లేకపోవడం* *ఇలా వాస్తవం గా ఆలోచిస్తే మనకంటే ఇతర ప్రాణులే నయం కదూ!** భయాన్ని వదిలి ధైర్యంగా వివాహం మీ పిల్లలకు జరిపించండి*
*ఒక వేళ మీరే వివాహం కావాల్సిన యువతి యువకులైతే మీనమేషాలు లెక్కపెట్టకుండా వెంటనే వివాహం చేసుకోండి*
No comments:
Post a Comment