Tuesday, July 9, 2024

మానవ రూపంలో దైవం...

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏼
🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్ 

మానవ రూపంలో దైవం...

అయోధ్య రాజ్య పట్టాభిషేకానికి సిద్ధం కావాలని దశరథుడు
నిండు సభలో ఆజ్ఞాపించినప్పుడు రాముడి వదనంలో ఆనంద ఛాయలు వ్యక్తం కాలేదు. తండ్రి తనను రాజ్య భారం స్వీకరించాలని ఆదేశించినట్లుగానే దాశరథి భావించాడు. మరుసటి రోజు కైకేయి తనను పిలిపించి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని దశరథుడి ముందే ఆజ్ఞాపించినప్పుడు... శ్రీరాముడు అప్పుడు సైతం తండ్రి ఉత్తర్వుగానే పరిగణించి ఆయన మాట నిలబెట్టేందుకు కృతనిశ్చయుడయ్యాడు. ఆ సందర్భంలో ఆయన ముఖవైఖరిలో నిరాశ ఛాయలు కనిపించలేదు. | సీతారామలక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని ఉన్నప్పుడు లక్ష్మణుడు ప్రశ్నించాడు. అధికారం చేతికందుతున్నప్పుడు సంతోషం ఎందుకు కనపడలేదు.... అది చేజారినప్పుడు వేదన ఎందుకు వ్యక్తం కాలేదని అడిగాడు. అందుకు శ్రీరాముడు బదులిస్తూ- 'సౌమిత్రి! ఈ విశ్వాన్నంతా గమనించావా? పశువులు పక్షులు చెట్లు ఏ అధికార సంపదల బలంతో సంతుష్టిగా జీవిస్తున్నాయి?
సిరిసంపదలు, అధికారం లేకుండా జీవించలేని వ్యక్తిత్వం మనోవైకల్యం లాంటిదే. సకల జీవరాశులకు లేని ఆ దౌర్బల్యం మనిషికి ఎందుకు ఉండాలి చెప్పు...' అన్నాడు. మనిషి రూపంలో ఉన్న ఆ దైవం.
జై గురుదేవ్ 👏🏼👏🏼

No comments:

Post a Comment