Monday, July 22, 2024

****నాకెందుకులె... చిన్న కథ.

 >>>>>>>>>>>>>>>>>>>>>   
            నాకెందుకులె...
              చిన్న కథ.
<<<<<<<<<<<<<<<<<<<<<<
          ఒక రైతు తన పొలానికి నీటి కోసం ఒక చెరువును ఏర్పాటు చేసుకున్నాడు.
          నీరు పాడు చేయకుండా, పంట పొలం వైపు ఎవరూ రాకుండా ఉండేందుకు ఆ చెరువులో ఒక మొసలిని పెంచాడు.
        ఇంట్లో ఒక కోడిని పెంచుకుంటున్నాడు.
      తనతో పాటు పొలానికి వెళ్లేటప్పుడు ఒక మేకను తీసుకొని వెళ్లి మేపుకుంటున్నాడు.
         రైతు ఇంట్లో ఒక ఎలుక కూడా ఉంది.
       రైతుకు పెళ్లయింది. భార్య ఇంటికి వచ్చింది.
     ఎలుక ఇంట్లో తెగ తిరుగుతుంది. ఇంట్లో అన్ని వైపులకు పరిగెడుతూ తిరుగుచున్న ఎలకను చూస్తుంటే ఆమెకు చిరాకు పుడుతుంది.
      ఒక బోను తీసుకువచ్చి ఈ ఎలుకను బంధించమని తన భర్తకు చెబుతోంది. అది ఎలుక   విన్నది.
              ఎలుక కోడి వద్దకు వెళ్లి నన్ను రైతు భార్య బోనులో బంధించి ఇంటి నుంచి తరిమివేయాలని చూస్తుంది.
     నా వలన రైతు కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేదు. నన్ను బంధించవద్దని చెప్పమని కోడిని  బ్రతిమలాడుతుంది.
       రైతు నాకు మంచి మంచి గింజలు మేపుతున్నాడు. నాకెందుకులె నీ సమస్య. అది నీవే చూసుకో అన్నది కోడి.
     మేకని, మొసలిని కూడా ఇలాగే బ్రతిమాలింది. అవి కూడా మాకు బాగానే ఉంది కదా! నీ సమస్య మాకెందుకులె అన్నవి.
         రైతు బోను తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. మధ్య రాత్రిలో ఏదో శబ్దం రావడం వలన ఎలుక బోనులో పడి ఉంటుందని రైతు భార్య బోను వద్దకు వచ్చింది.  అక్కడికి వచ్చిన ఒక పాము రైతు భార్యని కరిచింది. భార్య కేకలు విన్న రైతు చుట్టుపక్కల వాళ్ళందరూ లేచారు.
          పాము కాటుకు వైద్యుడిని రప్పించారు. వైద్యుడు వచ్చి పాముకాటుకు వైద్యం చేస్తున్నారు. ఆ వైద్యుడు ఆ ఇంట్లో ఉన్న కోడిని చూసి,  ఫీజు కింద కోడి ని ఇమ్మని వైద్యుడు కోరాడు.
   ఆ కోడిని తీసుకుని వెళ్లి కోసుకు తిన్నాడు.
      రైతు భార్యకు పాము కరిచిన విషయం తెలుసుకున్న బంధువులు అందరూ వచ్చారు.
           రైతు వారి అందరి కోసం మేకను కోసి భోజనాలు పెట్టాడు.
          వారి బంధువులలో ఒకరు, మొసలి రక్తంతో పాము కరిసినచోట రోజు రుద్దితే పాము విషం కు విరుగుడు జరిగి నీ భార్య తొందరగా కోలుకుంటుందని సలహా ఇచ్చారు.
            చెరువులో ఉన్న మొసలని చంపి రక్తం తీశారు.
       ఒకరి సమస్య నాకెందుకులె  అనుకున్న
       కోడిపోయింది
      మేక పోయింది
      మొసలి పోయింది.
ఎలుక మాత్రం అలాగే ఉండిపోయింది.
       ఎవరి గురించో నాకెందుకులె...  నాకు బాగానే జరుగుతుంది కదా?.
   అనే సంస్కృతి పెరుగుతుంది.
    " ఇది మారాలి"
లేకపోతే అలా అనుకునే వారు కూడా నష్టపోతారు.
       ఎవరికో ఇంక్రిమెంట్లు పోతే నాకెందుకులె,
      ఎవరికో లీవ్ దొరకకపోతే నాకెందుకులె,
        ఎవరికో డ్యూటీలో ఇబ్బందులు వస్తే నాకెందుకులె..
       ఇలా అనుకున్నన్నాళ్లు సమస్యలు ఇలాగే ఉంటాయి.
     నేనెందుకు ఇతరులకు సహాయం చేయలేను.
       అందరం కలిసి సమస్యలు ఎందుకు పరిష్కరించుకోలేము అన్న ఆలోచన రావాలి.
      అలాంటి ఆలోచన కల వారందరూ ఏకం అవ్వాలని విజ్ఞప్తి🙏.

====================

No comments:

Post a Comment