నా కొడుకు ను సరిదిద్దండి...
ఒకసారి పరమాచార్య వారి దర్శనానికి తండ్రి, కొడుకు వచ్చారు.
తండ్రి " స్వామి వీడు నా కుమారుడు. ఏమి చెప్పిన వినడు చెయ్యడు. పెడగా జవాబిస్తాడు.
మీరు దయతో మా అబ్బాయిని సరి అయిన మార్గంలో పెట్టండి. "అని ప్రార్ధించాడు.
స్వామి ఆ అబ్బాయి వైపు కూడా చూడలేదు.
స్వామి "మొదట మీరు మీ ప్రవర్తన మార్చుకుంటే మీ అబ్బాయి తనంత తానుగా మారిపోతాడు.
మీరు గురువులను, పెద్దలను గౌరవించండి. మీరు, మీ స్నేహితులు మీ ప్రవర్తన మొదట మార్చుకోండి.నువ్వు నీ స్నేహితులను కాకుండా సదాచారం పాటించె వారిని మీ ఇంటికి పిలవండి.
మీ పిల్లవాణ్ణి తీసుకొని మీ ఇంటికి సమీపంలో ఉన్న కోవెల కు వెళ్ళండి. దైవ దర్శనం తో పాటు అక్కడ శ్రమ దానం చెయ్యండి.
*చెట్టుకు నీళ్లు పోస్తే ఆకులు అవే అందుకుంటాయి అని మరువకండి."* అంటూ నర్మ గర్భం గా కుమారునికి బదులు తండ్రిని సరిదిద్ది, ప్రసాదం ఇచ్చి పంపారు.
*తనను తాను ఉత్తమునిగా చిత్రీ కరించుకొని,కుమారుణ్ణి సరిదిద్ద మన్న తండ్రికి ఆ సర్వము తెలిసిన స్వామి ఇచ్చిన సలహా.*
💐🙏🏻
No comments:
Post a Comment