Thursday, July 11, 2024

****నేటి ఆధ్యాత్మిక సాధన

 *_🌹'నేటి ఆధ్యాత్మిక సాధన.'🌹_*

_ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే |_
_సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోஉభిజాయతే !!_

*_ఏవైనా కోరికలను మనసులో పెట్టుకొని పదేపదే ఆ విషయంలో గురించి ఆలోచించడం వలన అనేక కష్టనష్టాలకు భౌతిక దేహం లోనవుతుంది .కాబట్టి భౌతిక సుఖాలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉండవలె ._*

*_కోర్కెలను తగ్గించుకుంటూ మనసును భగవంతుని పైకి మరలించాలి .మన వంతు ప్రయత్నం గా ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తూనే ఇతరులకు కూడా దైవికమార్గాన్ని బోధించే విధంగా మనం పరిపూర్ణంగా దైవిక జ్ఞానాన్ని పొందాలి ._*

*_ముందు నీవు పరిపూర్ణంగా ఆత్మసాక్షాత్కారం గురించి తెలుసుకొని ,పొంది ఆ తర్వాత నలుగురికి నీ వంతు జ్ఞానము అందించాలి .ఈ విధంగా చేసిన వలన భగవంతుడు మీకు  చేరువులోనే ఉంటాడు. ఇలా చేయడం అనేది ఆయనకి అత్యంత ఇష్టము._*

_శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం_
_అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం_

*_నవవిధ భక్తులు పాటిస్తూనే ధ్యానములో మీరు పరమానందాన్ని పొందగలగాలి. దీనికి అత్యంత సాధన అవసరము. ఏకాగ్రత లేని సాధన నిరర్థకము._*

*_భౌతికమైన సుఖాలను పొందుతూనే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి. జ్ఞానము పొందిన తర్వాత మీరు ఆ భౌతిక సుఖాలకు దూరమవుతా వస్తారు. అన్నింటికంటే అనుభవ జ్ఞానము గొప్పది._*

*_మీరు ఆ జ్ఞానము పొందిన తర్వాత తామరాకు పైన నీటి బొట్టులు వలే సంసారానికి మీ మనసు అంటుకోకుండా భగవంతుని పైకి మీ మనసు నిశ్చలంగా ఉంటుంది._*

*_కావున మీ పనులు చేసుకుంటూనే ఎక్కువ సమయము ధ్యానంలో గడపండి.✍🏾_*
*

No comments:

Post a Comment