Tuesday, July 23, 2024

 1. ప్రశ్న:

స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న త్రాడు ఎన్నాళ్ళకి ఒకసారి మార్చి కొత్తది కట్టుకొనవలెను ?

జవాబు:

మాంగల్యం కట్టిన పసుపు త్రాటిలో
ఒక నూలు పోగు పోయినాసరే,
శని, మంగళవారాలు కాకుండా
మిగిలిన రోజులలో రాహుకాలం, మరణయోగం, లేకుండా మంచి సమయం చూసి క్రొత్త పసుపు త్రాడు కట్టుకొనవలెను.( మాంగల‌్యం పసుపుత్రాడులో కట్టుకొనటమే విశేషము)

2. ప్రశ్న:

స్త్రీలు రెండు చేతులతో
రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ వినాయకునికి నమస్కరించవచ్చునా?

జవాబు:

రెండు చేతులతో
రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తున్నట్టు భావన చేస్తూ స్త్రీలు నమస్కరించవచ్చును 

3. ప్రశ్న:

సుమంగళి స్త్రీలు చందనం పెట్టుకోవచ్చునా ?

జవాబు:

నుదుట కుంకుమ పెట్టుకుని
దానిపైన చిన్నగా విభూతి పెట్టుకొనవచ్చును.                      చందనం కంఠానికి రాసుకోవలెను.*

4. ప్రశ్న:

భర్త , పిల్లల ఆరోగ్యం
కుటుంబ క్షేమం కొరకు గృహిణి వారానికి ఒక రోజు ఏ దేవతకి పూజ చేస్తే మంచిది?

జవాబు:

శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయవలెను. దేవాలయంలో పరాశక్తి అర్చన చేయవలెను
క్షేమం కలుగుతుంది.

5.ప్రశ్న:

కుటుంబంలో దారిద్ర్యం తీరి పిల్లలకు వివాహాలు కావడానికి నేను ఏ స్తోత్రాలు చదవాలి ?

జవాబు:

మీరు ప్రతిరోజు
పారాయణం చేయవలసిన స్తోత్రం…

విదేహి దేవి కళ్యాణం
విదేహి పరమం శుభం*
రూపం దేహి జయం దేహి
యశో దేహి ద్విషో‌ దేహి*

లోకా సమస్తా సుఖినోభవన్తు.

No comments:

Post a Comment