Thursday, July 18, 2024

నేటి జీవిత సత్యం… *అమ్మ అబద్దాలు*

 1808a.0406b-5.170724-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి జీవిత సత్యం…

              *అమ్మ అబద్దాలు* 
                  ➖➖➖✍️

*వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం అండి...*

*అవునండి మనకి అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడూ నిజమే చెప్పాలి అని హరిశ్చంద్రుడు, గాంధీగారి కధలు చెప్పిన అమ్మ, మన చిన్నప్పటి నుండి మనకెన్ని అబద్ధాలు చెప్పిందో తెలుసా?*

*అందగాడిని గాకున్నా ...*
            *చందమామవంటుంది.*


*కంచం నిండా తిన్నా .......*
            *కొంచెమే కదా అంటుంది.*


*అల్లరెంతగా చేసినా .......*
         *పిల్లలింతేనని చెబుతుంది.*


*అత్తెసరున పాసయినా .......*
   *కొత్త సిలబసే కారణమంటుంది.*


*ఆటలు పాటలు రాకుంటే ....*
       *వాటికి విలువలేదంటుంది.*


*ఇంత కప్పు నే గెలిస్తే మాత్రం ....*
          *ఎంతో గొప్పని అంటుంది.*


*తప్పులెన్ని నే జేసినా .....*
         *ఒప్పులుగనే లెక్కలేస్తుంది*


*అప్పుడప్పుడూ అబద్దమాడినా ...*
        *చెప్పనే చెప్పదు నాన్నకైనా*


*పాతికేళ్ళ వయసున్నా .....*
          *పసివాడిగానే చూస్తుంది.*


*కష్టపడి వాళ్ళు సంపాదించినా...*
            *అదృష్టం నాదంటుంది*


*మనం తల్లి తండ్రులo అయ్యాకే  తెలిసేది .....*
               *అమ్మ అబద్ధాలు*


*ఆమె మమతల నుంచి .....*
                *రాలిన పూలరెక్కలం*


*ఆమె వాత్సల్యంతో ఒలికించిన ....*
                        *తేనె చుక్కలం*


*ఏమిచ్చి ఆ ఋణం తీర్చుకోగలం?*
              *కన్నీటితో కాళ్ళు కడగడం,*
                                *మినహా..!*


*ప్రేమతో అమ్మని చూసుకోవడం,*
               *అనంతమైన ప్రేమలో ,*
         *అమ్మని వెతుక్కోవడం తప్ప.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment