Monday, July 8, 2024

 శరీరం..... దేహం
🕉️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🕉️

🥀 'శరీరo' అని ఎందుకంటున్నారు.. *‘శీర్యతే ఇతి శరీరః’* ..అని వ్యుత్పత్తి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం శిథిలమైపోవటం దీని లక్షణo♪. ముసలితనం కావాలని మనం మందులు మాకులు మ్రింగనక్కరలేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే అందుకే శరీరం అన్నారు♪.

 దేహం...

🪷 'దేహం' అని ఎందుకన్నారు.. *'దహ్యతే ఇతి దేహః'* .. అని వ్యుత్పత్తి అర్థం♪. దహింపబడేది గనుక దీనిని దేహం అన్నారు♪. చచ్చిన తరువాత కట్టెలలో కాలుస్తారు గనుక దహింపబడేది అన్నారా...! మరి,  కొందరి దేహాలను కట్టెలతో కాల్చరు గదా....!  అవి దహింపబడవు గదా....!  మరి వాటిని దేహాలు అని అనరా....!  

🪷 చనిపోయిన తర్వాత దహింపబడటం కాదు♪. జీవించి ఉన్నప్పుడే తాపత్రయాలు అనే అగ్ని చేత నిరంతరం దహింపబడుతూ ఉండేదే ఈ దేహం♪. 

🪷 ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలే తాపత్రయాలు♪.

      ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ: 
🕉️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🕉️

No comments:

Post a Comment