🌹గుడ్ మార్నింగ్ 🌹నన్ను నేను ప్రశాంతముగా ఉంచుకోవటం నా బాధ్యత. నన్ను నేను సంతోషముగా ఉంచుకోవటం నా బాధ్యత. నా ఆరోగ్యం, నా మనసు, నా ఆలోచన - ఇవన్నీ సంపూర్ణముగా నాకు సంబంధించినవే.ఇతరుల వలన వారు ఎవరైనా సరే - నేను బాధకు లోనవ్వటం అనేది - నాపై నాకు లేని అదుపును - మానసికముగా, జీవన పరముగా నా ఆధారతను చూపిస్తున్నది.
ఏ విషయములోనైనా ఇతరులపై లేక బయటి వస్తువులు,విషయాలు,పరిస్థితులపై ఆధారపడి - వాటికీ తగ్గట్టుగా మనసు కదిలిపోతూ సుఖ దుఖాలకు లోనవ్వటమే ఆధారత. ఈ ఆధారత ఎప్పుడు బాధనే మిగులుస్తుంది. ఎందుకంటే నువ్వు నీపై కాక ఇతరమైన వాటిపై ఆధారపడ్డావు. అవే నీ జీవితాన్ని నడుపుతాయి. ఇక నీ జీవితం నీ చేతిలో లేదు.
మరి ప్రపంచములోకి వెళ్లకుండా, మనుషులు, వస్తువులు, విషయాలు, లేకుండా ఎలా జీవితం కుదురుతుంది? అనే ప్రశ్న పుట్టవచ్చు.
అవన్నీ కేవలం నీ స్వప్రయత్నాలుగా నీ అదుపులో నీ బంటులుగా సాగాలి తప్ప - నీ యజమానిలా నీపై పెత్తనం చేయకూడదు. నీ మనసుకు, నీ శరీరానికి, నీ పరిస్థితులన్నిటికీ నువ్వు యజమాని కావటమే ఆధ్యాత్మికత. నీపై పూర్తి పెత్తనం నీదే అయినప్పుడు బాధ, భయం కలిగే అవకాశమే లేదు. ఆధారత అన్ని అనర్ధాలకు కారణం. 🌹god bless you 🌹
No comments:
Post a Comment