Saturday, August 10, 2024

ఆధ్యాత్మికతను తప్పించుకోవటము కుదరదు. ఎందుకంటే అదే ఆధారము కనుక.

 🌹గుడ్ మార్నింగ్ 🌹ప్రతి మెలుకువను, ప్రతి ఉదయాన్ని మంచి అనే సాధనతో ప్రారంభిస్తూ - రాత్రి నిద్ర వరకు ఆ సాధన కొనసాగిస్తూ, మన అవసరాలు తీర్చుకొవటమే ఆధ్యాత్మిక జీవితం.జీవితం మన అవసరాల కొరకు, కోరికలు తీర్చుకుంటూ జీవిస్తున్నట్లు కనపడుతున్నా, గమనించేవారికి ప్రతి విషయములోనూ ఏదో ఒక రూపములో జ్ఞానము అవగాహన అవుతూనే ఉంటుంది. మంచి, చెడు, సుఖ,దుఃఖ అనుభవాలన్నీ - అవగాహనగా అర్ధమవుతూనే ఉంటాయి. అందులోనుండి జ్ఞాన గ్రహింపు ప్రతి వారికి జరుగుతూనే ఉంటుంది.మన శరీర నిర్మాణమే సృష్టి అలా కూర్చింది. అందుకే మామూలుగా సాధారణ జీవితములో అంటే భౌతికములో సాగిపోయేవారిలో కూడా జ్ఞాన అనుభవాలు కనపడుతూ ఉంటాయి.అసలు ఆధ్యాత్మికత అనేది కూడా మనిషి తనలోనే తెలుసుకున్న జ్ఞానానుభవం. ప్రయత్నించే వారికి కొంచెం ముందుగా ఎక్కువ అనుభవాలు లేకుండానే అర్ధమవుతుంది. ప్రయత్నించక పోయిన జీవితం అన్నీ నేర్పుతుంది. ఆధ్యాత్మికతను తప్పించుకోవటము కుదరదు. ఎందుకంటే అదే ఆధారము కనుక. 🌹god bless you 🌹

No comments:

Post a Comment