వెస్ట్ లండన్‌లోని హౌన్స్లోలోని స్ప్రింగ్‌వెల్ స్కూల్లో తన ఏడేళ్ల కుమారుడిని ముస్లిం క్లాస్మేట్స్ మతమార్పిడి చేస్తున్నారని ఆశ్చర్యపోయిన హిందూ తండ్రి.
సహవిద్యార్థులు హిందూ బాలుడి పేరును మహ్మద్‌గా మార్చుకోవడానికి ప్రేరేపించి కత్తెరతో అతని కలవా (హిందూవులు మణికట్టు కు కట్టుకునే పవిత్ర దారం) కోసేశారు. హిందూ విద్యార్థి పూర్తిగా శాకాహారి అని తెలిసినా, ముస్లిం అబ్బాయిలు ఆ హిందూ అబ్బాయికి "మాంసం తింటే నీకు బలం వస్తుంది" మరియు "హలాల్ మాంసం తింటే నీకు ఇంకా ఎక్కువ బలం వస్తుంది" అని చెప్పారని ఆ పిల్లాడి తండ్రి చెప్పాడు.
ఆ ముస్లిం అబ్బాయిలను సస్పెండ్ చేసి, వారి తల్లిదండ్రులకు ఆ సమాచారం చేరవేసి,ఈ సమస్య ను పాఠశాల యాజమాన్యం పరిష్కరించింది. అయితే, తన కుమారుడి సహవిద్యార్థులు తన బిడ్డను ఎలా మతం మార్చేందుకు ప్రయత్నించారనే దానిపై ఆ హిందూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఆ విద్యార్థి తండ్రి మాట్లాడుతూ "మేము ఇంట్లో ఏ ఇతర మతం గురించి మాట్లాడుకోము, మా స్వంత మతం గురించి కూడా మేము మాట్లాకోము, కానీ, తన కొడుకు ఒక రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ప్రవర్తనలో తేడా కనిపించి వాడిని అడగబట్టి ఈ సంఘటనలన్నీ తెలిసాయి. లేక పోతే తెలిసి ఉండేవి కావు" అని చెప్పాడు.
తన కొడుకు పరిస్థితి గురించి తెలుసుకున్న తండ్రి క్లాస్ టీచర్‌కు ఈ సమాచారం ఇస్తే, ఇది ఏం కాదు కేవలం పిల్లలు కొత్త విషయాలను అన్వేషిస్తున్నారని చెప్పింది.
అయితే, హిందూ విద్యార్థి పేరు మార్చుకోక పోతే వాడితో స్నేహం మానుకుంటామని క్లాస్మేట్స్ బెదిరించడం గురించి ఆ తరువాత తెలుసుకున్న టీచర్ ఆ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేశారు.
ఇది ఇతర పాఠశాలల్లో కూడా జరుగుతుందనే ఆందోళనతో తల్లిదండ్రులు తమ ఈ అనుభవాల గురించి ఇతర కుటుంబాలు మరియు పొరుగువారితో చర్చించడం మొదలుపెట్టారు.
నా మాట:
ఈ సంఘటన లో నేను ముస్లిం పిల్లలను ఏ విధంగానూ తప్పు పట్టను. వారికి వారి మత విశ్వాసాలపై అంతటి గురి కుదిర్చిన తల్లిదండ్రులకు, వారి గురువులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే
వారి మత విశ్వాసాలు, వాటి గొప్పతనం, తమ మతం మాత్రమే నిజమైన మతం అని మిగతా దేవుళ్లను ముఖ్యంగా విగ్రహారాధన చేసే వాళ్ళు ఎలా పాపం మూట గట్టుకుంటున్నారో, వారిని మన మతం లోకి తీసుకు వచ్చి వారికి ఎలా సహాయపడవచ్చో, రక్షించవచ్చో వారి పిల్లలకు చిన్నప్పటి నుండి నూరి పోస్తారు.
మరి మన హిందువులో....?
ఈ విధ్వంసకర ఆబ్రాహామిక్ మతాలు ఈ భూమి మీదకు రాక ముందు చెప్పిన "ఏకం సత్ విప్రా బహుదా వదంతి" వంటి వేద వాక్కులను వల్లె వేస్తూ, తరుము కుంటూ వస్తూన్న నేటి కాలపు తోడేళ్ళ మత మార్పిడి గుంపులకు వాటిని అన్వయం చేయడానికి ప్రయత్నిస్తూ వుంటారు.
ఈ విదేశీ సెక్యులరిజం మత్తులో పడి బాగా ఉదార వ్యాధి లక్షణాలు ఒంటబట్టించుకున్న హిందూ తల్లి తండ్రులు "సర్వ ధర్మ సమభావన" అంటే 'సమోసా-వడా-పావ్' తిన్నంత సులభం లాగా అది తమ పిల్లలకు నూరి పోశారు తప్ప, తమ దైన సంస్కృతి, సంప్రదాయాలు, తమ ధర్మం, దానిలో విశ్వాసాలు చెప్పడం నామోషి గా భావించి పిల్లలను ఆధునిక ఉదార విశాల భావజాలం తో పెంచాలి అని భావించడం వల్లే ఈ సమస్య.
ఈ మత మార్పిడి కి ప్రయత్నించిన పిల్లల వయసు జస్ట్ 7 సం. లు. అదీ వారు ఉంటున్న దేశం ఏమీ ఇస్లామిక్ దేశం కాదు. పూర్తిగా ఉదారవాద దేశం. అటువంటి వాతావరణం లో పెరిగిన పిల్లలే అలా వుంటున్నారు అంటే, మన దేశంలో అందరూ వాళ్లే వుండే చిన్న చిన్న కాలనీలలో పెరుగుతూ మదరసాలలో చదివిన పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయో? ఇలా చిన్న పిల్లలే కాదు, కాలేజీల్లోనూ, ఉద్యోగస్తుల లోనూ, ఆఖరుకు ఆటగాళ్లలో కూడా మత మార్పిడి చేయాలి అనే ఇటువంటి ఛాందస వాదం కనిపిస్తుంది.
గత వారం భారత్ లో ఉత్తరప్రదేశ్ లో మొరాదాబాద్ లో లాక్మే బ్యూటీ మరియు మేక్ అప్ సెంటర్ లో జరిగిన ఇటువంటి సంఘటన గురించి వేరే పోస్ట్ పెడతాను.
లండన్ వార్త లింక్ :
ealing.nub.news/news/local-new…
....చాడా శాస్త్రి.....
No comments:
Post a Comment