Thursday, August 29, 2024

ఏవో కావాలన్న పరుగులో బ్రతికి నిన్ను నీవే తెలుసుకోకుండా చనిపోవటాన్ని మించిన ఆధారం ఏముంది?

🌹గుడ్ మార్నింగ్ 🌹నేనెవరు? ఎందుకు పుట్టాను? ఎక్కడ నుండి వచ్చాను? ఈ జీవన విధానమేమిటి? ఈ శరీరమే నేను అనుకుంటూ కోరికల పరుగులో సుఖదుఖాల అనుభూవిస్తూ జీవిస్తున్న నా జీవితం మరణముతో ముగిసిపోవటమేమిటి? అసలు మొత్తముగా ఈ సృష్టి ఏమిటి? అన్న గాఢమైన ఆలోచన  తనలో పుట్టిన వారికే ఆత్మజ్ఞాన మార్గపు దారి నచ్చుతుంది, అర్ధమవుతుంది, ఆచరణలో ఆ వైపు సాగగలుగుతారు. ఎందుకంటే నా గూర్చి నాకు తెలియాలన్న గాఢ తలంపు. నాలోకి నేను చేసే ప్రయాణం. నన్ను నేను సంపూర్ణముగా తెలుసుకునే ప్రక్రియ ఆత్మజ్ఞానము.
నాకు కావాలి అనిపిస్తున్నంత కాలం ప్రపంచం తెలుస్తూ ఉంటుంది. అదే నిజముగా ఉంటుంది. దైవ, భక్తి విధానాలన్నీ బయట తిరిగేవే ఎంచుకుంటాము. అవే సత్యముగా ఉంటాయి. ఎందుకంటే కావాలి కనుక.
కావాలి అనేది నాకు - తెలుసుకోవాలి అనేది నన్ను.......
ఆధ్యాత్మికతలో కావాలి ఉండదు. కేవలం తెలుసుకోవటం మాత్రమే ఉంటుంది. ఇది పూర్తిగా అంతరంగ జ్ఞాన ప్రక్రియ. ఆధ్యాత్మికము, భక్తి, దైవ మార్గాలు అన్నీ నా భావనలో సత్యాన్ని తెలుసుకోటానికి.
ఈ మార్గాలలో ఏదో పొందుదాము అని సాగేవారు తమను తాము మోసం చేసుకుంటున్న వారే. ఒక్కసారి లోపలకు లోతుగా చూసుకుంటే ఎవరికి వారికి ఈ విషయం తప్పక తెలుస్తుంది. ఈ విషయానికి ఎవరివో, ఎక్కడివో సాక్ష్యాలు అక్కర్లేదు - నువ్వే నీ సాక్ష్యం. ఏవో కావాలన్న పరుగులో బ్రతికి నిన్ను నీవే తెలుసుకోకుండా చనిపోవటాన్ని మించిన ఆధారం ఏముంది? ఆలోచిస్తే అంతా అర్ధవుతుంది. 🌹god bless you

No comments:

Post a Comment