ఒక తొండ పాముతో
"నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు కాటేసిన మనిషి చావడు, కానీ నేను కరిచిన మనిషి చస్తాడు" అంది..
"అదెలా..?" అనడిగింది పాము.
"నేను చెప్పినట్టు చెయ్యి" అని
ఒక పొలంలో పనిచేసుకునే రైతుని "వెనుక నుండి కాటెయ్యి" అంది తొండ..
పాము అలానే కాటేసింది, వెంటనే ఆయన రెండు కాళ్ల మద్య నుంచి ముందుకి తొండ పరిగెత్తిపొయ్యిందంట.
నన్ను కరిచింది తొండే కదా అని...
ధైర్యం తో గాయానికి ఆకుపసురేదో పూసుకొని తిరిగి పనిలో పడ్డాడు ఆ రైతు.
మళ్ళీ ఇంకో పొలంలో
"రైతుని నేను కరుస్తాను,
నువ్వు ఆయన కాళ్ల మధ్య నుంచి వేళ్ళు" అని..
తొండ కరిచింది..
పాము ఆయన కాళ్ల మధ్య నుంచి సర్రన పాకి పోయింది.
పాముని చూసిన రైతు, కంగారుతో తనని పామే కాటేసిందని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు
భయంతో..
భయం ఎంత భయంకరమైందో తెలియచెప్పే కధ ఇది..
కాబట్టి కరోన కొత్త వేరియంట్ విషయంలో పేపర్లు, టీవీలు, వాట్సాప్ లు, ఫేసుబుక్కు లు మిగతా సామాజిక మాధ్యమాల్లో వాటిలో వచ్చేవి, రాసేవి అదే పనిగా మనసులో పెట్టుకొని, భయపడుతూ ఉంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం బాధపడాల్సి వస్తుంది.
ధైర్యంగా ఉందాం......
కానీ
జాగ్రత్తతో మసలుకుందాం....
*మన ధైర్యమే మనకు కొండంత అండ..*
No comments:
Post a Comment