Tuesday, August 6, 2024

****హిందువులలో కులగణన జరగాలి

 *హిందువులలో కులగణన జరగాలి*
 అని గత కొన్ని సం.లుగా రాహుల్ గోలగోల చేస్తోంది ఏదో ఆషామాషీగా అనుకునే వ్యవహారం కాదు... 
దాని వెనకాల పెద్ద కుట్ర ఉంది. 
బిజెపిని ఓడించాలి అంటే తమకు 20% మైనార్టీ సాలిడ్ ఓటు బాంక్ ఎలాగా ఉంది.
 దానిని సుస్థిర పరుచుకుంటూ, 
 రెండో వైపు ఉన్న 70-80% హిందూఓటు బ్యాంకును ఒక్కటిగా కాకుండా ఈ 70-80%మంది మధ్య చిచ్చు రేపి దాన్లో ఒక 20% ఓట్లు తమవైపు తిప్పుకుంటే చాలు అనే ప్రణాళిక దీని వెనుక ఉంది...

అసలు జరిగింది ఏమిటంటే...

2014 ఎన్నికల్లో  యుపిఎ వ్యతిరేక ఓటువల్ల మోదీ అధికారంలోకి లక్కీ గా వచ్చాడు, 
అయితే, 2019 ఎన్నికల నాటికి నోట్ల రద్దు, GST, పెట్రోల్ ధరలు పెరగడం వంటి కారణాలు వల్ల సామాన్య జనాలలో కేంద్ర ప్రభుత్వం పై వ్యతిరేకత బాగా ఉంది, 
బిజెపి పార్టీకి ఒక్క దానికే పూర్తి మెజార్టీ వచ్చి మళ్ళీ మోదీ ప్రధాని గా వచ్చే చాన్స్ లేదు, అందువల్ల బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చినా మిగతా పార్టీల సహకారాన్ని తీసుకుని మోదీ కాకుండా యే గడ్కరీ వంటి వారి నేతృత్వంలో సంకీర్ణ  ప్రభుత్వం ఏర్పడుతుంది అని రాహుల్ ముఠా అంచనా వేశారు. 

ఈ ముఠాలో,
 అమెరికా డీప్ స్టేట్ అంటే సోరోస్,
 ఫోర్డ్ ఫౌండషన్, 
రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, 
అమెరికాలో బలంగా ఉన్న కొన్ని ఇస్లామిక్ గ్రూపులు, 
అలాగే అమెరికా ప్రభుత్వం లో వ్యాపించిన కొందరు చైనా గ్రూప్ సభ్యులు, 
భారత్ లో అయితే వామపక్ష భావజాల మీడియా హౌస్ లు,
 విలేకరులు, ప్రాంతీయ పార్టీలు, 
వాటి మీడియా హౌస్ లు ఇంకా పైన చెప్పుకున్న విదేశీ NGO లు ఆర్ధిక సహాయం చేస్తున్న పలు ఆన్ లైన్ వార్తా సంస్థలు, వెబ్ సైట్లు ఇలా పలు రకాల సభ్యులు వున్నారు...

అయితే, ఈ ముఠా అంచనాలను తలక్రిందులు చేస్తూ  2014 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని 2019లో మోదీ మళ్ళీ ప్రధాని అయ్యారు. 

దీంతో ఖంగు తిన్న రాహుల్ ముఠా లో కొందరు ఈ దేశ వ్యతిరేక మేధావులు బీజేపీని ఓడించాలి అంటే మైనారిటీ లను ఏమాత్రం సిగ్గు పడకుండా వీలయినంత గా బుజ్జగిస్తూ,  
మెజార్టీ హిందువులను కులాల వారిగా విడగొట్టి వారిలో ఒకరిపై ఒకరికి ద్వేషం పెంచి,
 బలహీన పరిచి వారందరూ హిందూత్వ గొడుగు క్రింద చేరకుండా చూడాలి. 
అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే హిందువులను ముక్కలుగా బలహీన పరచి వారిలో కొన్ని గ్రూపుల ఓట్లను మైనారిటీ ఓట్లతో కలపి బిజెపి ని ఓడించాలి అని ప్రణాళికలు రచించారు.

2014- 2019 మధ్యలో ఒక్క సారి కూడా  కులాల ఊసు ఎత్తని రాహుల్, 2019లో ఓడిన దగ్గర నుండి అంటే రెండో సారి మోడీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన దగ్గరనుండే పైన చెప్పుకునే మేధావుల సూచన మేరకు ఈ కులాల గోల మొదలుపెట్టాడు. 

ఈ కులగణన పైన చెప్పుకున్న రాహుల్ ముఠా సభ్యులు అయిన దేశ విదేశీ మీడియా సంస్థలు, వెబ్ సైట్స్, వెబ్ పోర్టల్స్ NGO లు భారత్ లో ఉంటున్న వామపక్ష మేధావులు ఇలా ఈ ముఠా సభ్యులు అంతా తమ తమ పరిధిలో గల మీడియా ద్వారా హిందూ ధర్మం లో గల ఈ కుల వ్యవస్థ పై వ్యాసాలు, అభిప్రాయాలు, వార్తలు అంటూ గత 5 సం. లుగా ప్రచారం ప్రారంభించారు.

ముఖ్యంగా విదేశీ వెబ్ పోర్టల్స్ అయితే గత 5 సం. లలో భారత్ లో గల కుల విషయాలపై దృష్టి పెట్టి చాలా ఆర్టికల్స్ ప్రచురించాయి.
 ఏమిటి ఈ విదేశీ వెబ్ పోర్టల్స్ మన దేశ విషయాలు మీద  అంత ఇంట్రస్ట్? ఎందుకంటే చాలా విచిత్రంగా ఈ వెబ్ పోర్టల్స్ లో చాలా వాటికి ధన సహాయం చేస్తున్నవి రాహుల్ ముఠా సభ్యులు అయిన 
అమెరికా డీప్ స్టేట్ పవర్స్ అయిన ఫోర్డ్ ఫౌండేషన్, 
రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, 
జార్జి సోరోస్ ORF, 
హేన్రి లూస్ ఫౌండేషన్ మొదలగు సంస్ధలు.

  నేను చెప్పిన విషయాలు మీద నమ్మకం లేకపోతే ఆ వెబ్ పోర్టల్స్ కి ఫండ్స్ అందిస్తున్నది ఎవరో నెట్ లో చెక్ చేసుకోండి.

ఇంకో సంగతి తెలుసా? 
 *యూరోప్ కి చెందిన ఇద్దరు రీసెర్చర్స్ క్రిస్టఫ్ జెఫర్లాట్ మరియు గిల్స్ వేరనిర్స్*
 భారత రాజకీయాలు మీద రీసెర్చ్ చేస్తూ భారత్ లో కుల గణన అవసరం గురించి ముందుగా మాట్లాడారు. 
వీరి రీసెర్చ్ కోసం ఫండింగ్ చేస్తున్నది హేన్రి లూస్ ఫౌండేషన్. 
ఈ హేన్రి లూస్ ఎవరో కాదు,  టైం మేగజైన్ సహా వ్యవస్థాపకుడు మరియు దాని ఎడిటర్ ఇన్ చీఫ్.

ఈ రిసెర్చర్స్ లో ఒకడైన జెఫర్లాట్  మోడీ ముఖ్యమంత్రి గా గుజరాత్ ని ఒక ప్రయోగశాల గా ఎలా చేసారో అని ఒక పుస్తకం కూడా రాసాడు. 
అలాగే మొన్న ఎన్నికల ముందు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్ల "కొత్త రాహుల్ తయారయ్యాడు అని, అతని ఇమేజ్ పెరిగింది" అని రాహుల్ ని పొగుడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్ రాసాడు.

ఈ మొత్తం టూల్ కిట్ లో ముఖ్య పాత్రధారి రాహుల్. 
రాహుల్ ప్రతీ సారి విదేశాల్లో చేస్తున్న రహస్య పర్యటనల్లో ఈ ముఠా సభ్యులను కలుస్తూ సూచనలు తీసుకున్నాడేమో అని అనుమానం కలుగుతోంది.

 *వీళ్ళందరి దన్ను చూసుకుని రాహుల్ ఎంతగా దిగజారాడు అంటే...* 

*మిలిటరీ వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళలో కులాల వివరాలు అడిగాడు
*సుప్రీంకోర్టు హై కోర్ట్ జడ్జీలు లో ఏ కులం వాళ్ళు ఎంత మంది ఉన్నారో అడిగాడు
*IAS ఆఫీసర్లు లో ఏ కులం ఎంత మంది అని అడిగాడు
*ఎన్నికల సభలో అసలు మోడీ కులం ఏంటో సరిగ్గా తెలియదు. మోదీ అసలు ఓబీసీ కాదు అంటూ వాగాడు.
*తనని ప్రశ్నించిన జర్నలిస్టుల కులం అడిగాడు.
*ఆఖరుకు మొన్న బడ్జెట్ హల్వా ఫంక్షన్ లో ఏ కులం వాళ్ళు ఎంత మంది అని అడిగాడు.

మొన్న 2024 ఎన్నికల సమయంలో *"హిందూ ఓట్లు విభజించు, మైనార్టీ ఓట్లు గంపగుత్తగా కొట్టు"*
 అన్న సూత్రం తోనే ఎన్నికలకు వెళ్లారు. యుపి,బెంగాల్, మహారాష్ట్రలో వీళ్ళ స్ట్రాటజీ కొంతవరకూ పని చేసినా దేశం ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ ముఠా చేతిలోకి పోలేదు. అయినా, ఈ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహం తో ఆ ముఠా రాహుల్ నేతృత్వంలో ఇంకా రెచ్చిపోవడం మొదలు పెట్టింది.

పైకి ఎలా చెప్పినా *అమెరికాకు, చైనాకు, ఈరోపియన్ దేశాలకు భారత్ ఒక బలహీన దేశంగా, వినియోగదారుల మార్కెట్ గా మాత్రమే కావాలి.*
 కానీ గత 10 సం. లలో మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో ఒక పెద్ద దేశ ఒత్తిడికి భయపడో లేక లాబీయింగ్ కి లొంగకుండా  భారత్ దేశానికి ఏది ఉపయోగపడుతుంది అంటే అటువంటి నిర్ణయాలు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటూ అంతర్జాతీయంగా భారత్ ని బలమైన దేశంగా తీర్చి దిద్దుతోంది మోదీ ప్రభుత్వం. 
వాటిల్లో పెద్ద ఉదాహరణ గా రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా వద్దు అని చెప్పినా రష్యా నుండి భారీగా క్రూడ్ దిగుమతి చేసుకుని ఎగుమతులు చేసారు. అలాగే అమెరికా వ్యతిరేకించినా రష్యా నుండి S400మిసైల్ సిస్టం కొన్నారు. అందుకే బలమైన మోదీ నాయకత్వంలో భారతదేశం ఉండటం ఆ శక్తులకు నచ్చడం లేదు, తమ చేతిలో ఆడే రాహుల్ వంటి పప్పెట్ ని ప్రధాని గా చేయాలి అని ఆ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

అందుకే, పైన చెప్పుకున్న శక్తులు అన్ని తెరవెనుక ఉండి,  రాహుల్ ని ముందు పెట్టి ఈ దేశాన్ని బలహీన పరచడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో దేశంలో అలజడులు, అశాంతి సృష్టించడానికి ఈ ముఠా ఏ అవకాశం వదులుకోదు.  అందుకే అప్రమత్తంగా ఉందాం.

....చాడా శాస్త్రి

No comments:

Post a Comment