Wednesday, August 14, 2024

*****ఎవరికి వారే ఆలోచించుకోమని ఆధ్యాత్మికత జస్ట్ చెబుతుంది... అంతే..

 జీవితములో అందరూ సక్సెస్ - అంటే ఏదో విజయం సాధించాలని చెబుతూ వుంటారు, కోరుకుంటూ వుంటారు. ఈ సక్సెస్ - విజయ సాధనల గమ్యాలు అనేక మందికి అనేక రకాలుగా ఉంటాయి. వాటి కొరకు నిరంతరం ప్రయత్నిస్తూ వుంటారు. సాధారణముగా ఇవన్నీ - డబ్బు - కీర్తి - అధికారాలు - హోదాలు - ఇలాంటి అనేక ప్రాపంచిక విషయాలై ఉంటాయి. వీటి కొరకు ఎంత ప్రయత్నిస్తారో, ఎన్ని పోగొట్టుకుంటారో,........
ఎందుకంటే సక్సెస్ అయ్యాము అని చెప్పే అనేక మంది -  మొత్తం ప్రాపంచిక విషయాలలోనే ఏదో ఒకటి పొందినది చెబుతారు. దాని కొరకు ఎంత కష్టపడారో - ఆ సక్సెస్ కొరకు మనము ఎంత కష్టపడాలో చెబుతారు. వారు ఎన్ని పోగొట్టుకున్నారో చెప్పరు...........
సక్సెస్ అవసరమే - కాని దాని నిజమైన అర్ధమేమిటి?????????
నేను ఎవరెస్టు ఎక్కాను - లక్షల కోట్లు గడించాను - నేను IAS - IPS -  పెద్ద ప్రజా నాయకుడిని - పెద్ద సెలబ్రిటీని అయ్యాను - ఇలా ఎన్నో చెబుతారు. ఇవన్నీ నిజాలే కావచ్చు..........
ఒక్కరు కూడా   --  నేను ఎప్పుడూ అబద్దమాడలేదు - అధర్మపు పనులు చేయలేదు - ఎవరిని మోసగించటం, ఇబ్బంది పెట్టడం చేయలేదు - జీవితము మొత్తము ఇలాగే వుంటాను - నాకున్న దానితో - నాకున్న వారితో - స్వప్రయత్నముతో సంతోషముగా జీవిస్తున్నాను. నా మనసు, బుద్ధి, నా అదుపులో చక్కగా వున్నాయి. నాకు హాయిగా నిద్రపడుతుంది. చక్కగా ఆరోగ్యముగా వున్నాను. నేనే కాదు నా కుటుంబము మొత్తము ఇలాగే సంతోషముగా, తృప్తిగా వున్నాము అని చెప్పగా వినలేదు - చెప్పటం లేదు....
సక్సెస్ కి ఎవరి అర్ధం వారిదేమో.,...
ఆధ్యాత్మికతలో  సక్సెస్ ఉండదు.   ఉన్నంతకాలము, అన్ని విషయాలలో ఆనందముగా ఉండటమే.
నన్ను నేను తెలుసుకొని - నా అదుపులో నేను మంచిగా ఉండటాన్ని మించిన సక్సెస్ ఉంటుందా??????
ఏమో ఎవరి భావన వారిది...............
కాని ఆధ్యాత్మిక నిజం మాత్రం నేను నాకు సంపూర్ణముగా తెలియటము.
నేను జీవించటానికి భౌతికము అవసరమే. కాని నేనే నాకు తెలియకుండా - 
నా అదుపులో నేనే ఉండకుండా - ప్రాపంచిక విషయాలలో చిక్కుకు పోవటం - ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోవటం కాదా....
ఎవరికి వారే ఆలోచించుకోమని ఆధ్యాత్మికత జస్ట్ చెబుతుంది... అంతే..
జీవితం మనది. ఎలా జీవించాలి అన్న నిర్ణయం మనది. 🌹god bless you 🌹

No comments:

Post a Comment